భారత్‌లో విడుదలైన కొత్త Yezdi Scrambler బైక్: ధర & వివరాలు

ద్విచక్ర వాహన విభాగంలో అత్యంత ప్రాచుర్యం పొందిన బ్రాండ్లలో ఒకటి Yezdi. ఇది 90 ల లోనే ద్విచక్ర వాహన మార్కెట్‌ను తిరుగులేకుండా పాలించింది. అటువంటి కంపెనీ ఇప్పుడు భారతీయ మార్కెట్లో ఎట్టకేలకు కొత్త 'యెజ్డీ స్క్రాంబ్లర్' (Yezdi Scrambler) బైక్ విడుదల చేసింది. దేశీయ మార్కెట్లో కొత్త Yezdi Scrambler ప్రారంభ ధర రూ. 2,04,900 (ఎక్స్-షోరూమ్, ఢిల్లీ). ఈ బైక్ గురించి మరింత సమాచారం ఇక్కడ తెలుసుకుందాం.

భారత్‌లో విడుదలైన కొత్త Yezdi Scrambler బైక్: ధర & వివరాలు

భారతీయ మార్కెట్లో అడుగుపెట్టిన కొత్త Yezdi Scrambler ఆధునిక డిజైన్ కలిగి అప్డేటెడ్ ఫీచర్స్ కలిగి ఉంటుంది. ఈ బైక్ యొక్క డిజైన్ విషయానికి వస్తే, దీని ముందు భాగంలో ఎల్ఈడి హెడ్‌లైట్, ఎల్ఈడి టెయిల్ ల్యాంప్ మరియు ఎల్ఈడి ఇండికేటర్స్ ఉంటాయి. ఈ బైక్ లో స్పెఏదో మీటర్ అనేది ఫ్రంట్ ఫోర్క్ పైన ఉంటుంది. ఇది బైక్ గురించిన చాలా సమాచారాన్ని రైడర్ కి అందిస్తుంది, కావున రైడింగ్ సమయంలో ఇది చాలా అనుకూలంగా ఉంటుంది.

కొత్త Yezdi స్క్రాంబ్లర్ బైక్ డబుల్ క్రెడిల్ ఛాసిస్‌ను పొందుతుంది. అదే సమయంలో ఈ బైక్ 150 మిమీ ఫ్రంట్-వీల్ ట్రావెల్‌తో టెలిస్కోపిక్ ఫ్రంట్ ఫోర్క్‌లను పొందుతుంది. కావున ఇది భారతీయ రోడ్లపైన ప్రయాణించడానికి చాలా అనుకూలంగా ఉంటుంది.

భారత్‌లో విడుదలైన కొత్త Yezdi Scrambler బైక్: ధర & వివరాలు

కొత్త స్క్రాంబ్లర్ యొక్క ఫ్యూయెల్ ట్యాంక్ సామర్థ్యం 12.5 లీటర్లు. కావున సుదూర ప్రాంతాలకు వెళ్ళడానికి కూడా ఇది అనుమతిస్తుంది. అదే సమయంలో ఇది ట్యాంక్‌లో చక్కగా కలిసిపోయే సింగిల్-పీస్ సీటును కలిగి ఉంటుంది. ఇది డ్యూయల్-ఛానల్ ఏబీఎస్ కలిగి ఉంటుంది. అంతే కాకూండా రోడ్, రైన్ మరియు ఆఫ్-రోడ్ అనే మూడు ABS మోడ్‌లను కలిగి ఉంటుంది. స్క్రాంబ్లర్‌కు 200 మిమీ గ్రౌండ్ క్లియరెన్స్ కూడా లభిస్తుంది.

భారత్‌లో విడుదలైన కొత్త Yezdi Scrambler బైక్: ధర & వివరాలు

స్క్రాంబ్లర్ యొక్క బ్రేకింగ్ విషయానికి వస్తే, ఈ బైక్ యొక్క ముందువైపు 320 మి.మీ డిస్క్ మరియు వెనుకవైపు 240 మి.మీ డిస్క్ ఉంటుంది. స్క్రాంబ్లర్ 19 ఇంచెస్ ఫ్రంట్ వీల్ మరియు 17 ఇంచెస్ వెనుక చక్రం మీద నడుస్తుంది. మోటార్‌సైకిల్ USB టైప్-C మరియు స్టాండర్డ్ USB ఛార్జింగ్ సాకెట్‌ వంటి వాటిని పొందుతుంది.

భారత్‌లో విడుదలైన కొత్త Yezdi Scrambler బైక్: ధర & వివరాలు

స్క్రాంబ్లర్‌ బైక్ యొక్క ఇంజిన్ విషయానికి వస్తే, ఇందులో 334 సిసి, సింగిల్-సిలిండర్, లిక్విడ్-కూల్డ్ ఇంజన్ ఉంటుంది. ఈ ఇంజన్ 28.7 బిహెచ్‌పి పవర్ మరియు 28.2 ఎన్ఎమ్ గరిష్ట టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. స్క్రాంబ్లర్‌లో ట్విన్ ఎగ్జాస్ట్ సిస్టమ్ మరియు 6-స్పీడ్ గేర్‌బాక్స్ అందుబటులో ఉటుంది. ఇది మంచి పనితీరుని అందిస్తుంది.

భారత్‌లో విడుదలైన కొత్త Yezdi Scrambler బైక్: ధర & వివరాలు

డ్రైవ్‌స్పార్క్ అభిప్రాయం:

Yezdi బ్రాండ్ ఎట్టకేలకు దేశీయ మార్కెట్లో ఒక్క సారిగా మూడు బైకులను విడుదల చేసింది. ఇందులో యెజ్డీ స్క్రాంబ్లర్ (Yezdi Scrambler) ఒకటి. మొత్తానికి ఈ బైక్ దేశీయ మార్కెట్లో విడుదలైంది, అయితే మార్కెట్లో దాని ప్రత్యర్థులకు ఎలాంటి పోటీ ఇస్తుంది, మరియు ఎలాంటి అమ్మకాలను పొందుతుంది అనే విషయాలు త్వరలో తెలుస్తాయి.

Most Read Articles

Read more on: #యెజ్డి #yezdi
English summary
Yezdi Scrambler launched in india details
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X