గంటకు 120 కిమీ రేంజ్ అందించే హై స్పీడ్‌ ఎలక్ట్రిక్‌ బైక్‌.. ఇక కుర్రకారుకి పండగే

ఇండియన్ మార్కెట్లో ఎలక్ట్రిక్ వాహనాలకు విపరీతమైన డిమాండ్ ఉంది. ఈ తరుణంలో చాలా కంపెనీలు దేశీయ మార్కెట్లో కొత్త కొత్త ఆధునిక వాహనాలను విడుదల చేస్తున్నాయి. ఇందులో భాగంగానే దేశీయ ఎలక్ట్రిక్ వాహనాల తయారీ సంస్థ ఇగ్నిట్రాన్ మోటోకార్ప్ (Ignitron Motocorp) భారతదేశంలో సైబోర్గ్ బ్రాండ్ క్రింద కొత్త హై-స్పీడ్ ఎలక్ట్రిక్ మోటార్‌సైకిల్ Cyborg GT120 ని ఆవిష్కరించింది. దీని గురించి మరింత సమాచారం ఇక్కడ తెలుసుకుందాం.

గంటకు 120 కిమీ రేంజ్ అందించే ఎలక్ట్రిక్‌ బైక్‌

ఇగ్నిట్రాన్ మోటోకార్ప్ (Ignitron Motocorp) ఆవిష్కరించిన Cyborg GT120 బైక్ చూడటానికి చాలా స్టైలిష్ గా ఉంటుంది. ఈ ఎలక్ట్రిక్ బైక్ గంటకు 125 కిలోమీటర్ల వేగంతో పరుగులు తీస్తుందని కంపెనీ అధికారికంగా తెలిపింది. అంతే కాకూండా ఈ ఎలక్ట్రిక్ బైక్ పూర్తిగా దేశీయ మార్కెట్లోనే తయారుచేయబడింది. కావున ఇందులో కొత్త టెక్నాలజీ మరియు అప్డేటెడ్ ఫీచర్స్ కలిగి ఉంటుంది.

సైబోర్గ్ GT 120 ఎలక్ట్రిక్ బైక్ రెండు కలర్ ఆప్సన్స్ లో అందుబాటులో ఉంటుంది. ఇందులో ఒకటి బ్లాక్ కలర్ కాగా, మరొకటి డార్క్ పర్పుల్ కలర్. కంపెనీ ఈ ఎలక్ట్రిక్ బైక్ ని యువ కస్టమర్ల అవసరాలను దృష్టిలో ఉంచుకుని రూపొందించడం జరిగింది. కావున ఇది భారతీయ మార్కెట్లో తప్పకుండా మంచి ఆదరణ పొందుతుందని భావిస్తున్నాము.

కంపెనీ యొక్క కొత్త జిటి 120 బైక్ చూడటానికి ఒక స్పోర్ట్స్ బైక్ లాగా రూపొందించబడింది. అయితే దాని రైడింగ్ పొజిషన్ కమ్యూటర్ బైక్ వలె చాలా సౌకర్యవంతంగా ఉంటుంది. ప్రస్తుతం మార్కెట్లో అందుబటులో ఉన్న చాలా స్టైలిష్ బైకులలో ఇది కూడా ఒకటిగా ఉంటుంది.

ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌తో నడిచే Cyborg GT 120 బైక్‌ రేంజ్‌ విషయానికి వస్తే, ఇది ఒక్కసారి ఛార్జ్‌ చేస్తే ఏకంగా 180 కి.మీ పరిధిని అందిస్తుంది. ఇందులో 4.68 kWhr లిథియం-అయాన్ బ్యాటరీ అమర్చబడి ఉంటుంది. ఇది 6000 W గరిష్ట శక్తి రిలీజ్‌ చేయనుంది. Cyborg GT 120 బ్యాటరీ 0 నుంచి 80శాతం ఛార్జ్ చేయడానికి 3 గంటలు, 100 శాతం ఛార్జ్ చేయడానికి 4 నుంచి 5 గంటలు సమయం పడుతుంది.

కంపెనీ ఈ కొత్త బైక్‌ ధరను కంపెనీ ఇంకా ప్రకటించలేదు. కావున దీని ధరను వచ్చే నెలలో వెల్లడించే అవకాశం ఉంటుందని ఆశిస్తున్నాము. అంతే కాకూండా కంపెనీ ఈ బైక్ యొక్క మోటారు, బ్యాటరీ వంటి వాటిపైన ఇప్పుడు ఏకంగా 5 సంవత్సరాల వారంటీని కూడా అందిస్తుంది.

GT 120 బైక్‌లో జియో లొకేట్ / జియో ఫెన్సింగ్, బ్యాటరీ స్థితి, USB ఛార్జింగ్, బ్లూటూత్, కీ లెస్ ఇగ్నిషన్ (రిమోట్ కంట్రోల్) మరియు డిజిటల్ క్లస్టర్ వంటి ఆధునిక ఫీచర్లు అందుబటులో ఉన్నాయి. ఈ బైక్ గంటకు 0-40 కిమీ వేగాన్ని 2.5 సెకన్లలో అందుకుంటుంది. ఇది రైడింగ్ స్టైల్ మరియు రైడర్ అవసరాలకు సరిపోయే ఎకో, నార్మల్ మరియు స్పోర్ట్ అనే మూడు రైడింగ్ మోడ్‌లతో వస్తుంది.

ఈ కొత్త బైక్ ఇప్పుడు రివర్స్ మోడ్ కూడా కలిగి ఉంటుంది. అంతే కాకూండా ఈ బైక్ ముందువైపు టెలిస్కోపిక్ ఫోర్కులు మరియు వెనుక వైపున మోనోషాక్ సస్పెన్షన్ యూనిట్‌ వంటి వాటిని పొందుతుంది. ఈ బైక్‌లో రెండు చక్రాలకు డిస్క్ బ్రేక్‌లు ఉన్నాయి. కావున మంచి బ్రేకింగ్ సిస్టం అందుబటులో ఉంటుంది.

ఇదిలా ఉండగా ఇగ్నిట్రాన్ మోటోకార్ప్ కంపెనీ భారతీయ ఎలక్ట్రిక్ టూ వీలర్ మార్కెట్లో సైబోర్గ్ యోడా అనే పేరుతో ఒక బైక్ పరిచయం చేసింది. ఈ విభాగంలో కంపెనీ అనేక ప్రీమియం ఎలక్ట్రిక్ బైక్‌లను తీసుకురాబోతోంది. ప్రస్తుతం కస్టమర్లు కోరుకునే ఫీచర్స్ మరియు పరికరాలను ఇందులో అందించడమే కాకుండా, పర్యావరణానికి అనుకూలంగా ఉండే విధంగా కొత్త టెక్నాలజీలను ఈ బైక్ లో తీసుకురానుంది.

కంపెనీ వెల్లడించిన ఈ బైక్ హై రేంజ్ ఎలక్ట్రిక్ క్రూయిజర్ బైక్, ఇది స్వాప్ చేయగల బ్యాటరీతో అందించబడుతుంది. కావున ఈ బైక్ లో ఉన్న బ్యాటరీని బయటకు తీసి సులభంగా ఛార్జ్ చేసుకోవచ్చు. కావున ఇది వాహన వినియోగదారులకు చాలా అనుకూలంగా ఉంటుంది.

ఈ కొత్త బైక్ 3.24 kWh లిథియం-అయాన్ బ్యాటరీ ప్యాక్‌తో వస్తుంది, ఇది ఒక్కసారి ఛార్జింగ్‌పై 150 కిమీల పరిధిని అందించగలదు. ఈ క్రూయిజర్ బైక్‌ను గరిష్టంగా గంటకు 90 కిమీ వేగంతో నడపవచ్చు. యోడా బ్లాక్ మరియు సిల్వర్ అనే రెండు కలర్ వేరియంట్‌లలో లభిస్తుంది.

అంతే కాకుండా కంపెనీ ఇటీవల కాలంలోనే సైబోర్గ్ (Cyborg) దేశీయ మార్కెట్లో తన రెండవ ఎలక్ట్రిక్ బైక్ బాబ్-ఇ (Bob-e) ని ఆవిష్కరించింది. బాబ్-ఇ ఎలక్ట్రిక్ బైక్ రెండు కలర్ ఆప్సన్స్ లో అందుబటులో ఉంటుంది. అవి బ్లాక్ మరియు రెడ్ కలర్స్.

కొత్త బాబ్-ఇ ఎలక్ట్రిక్ బైక్ 2.88 కిలోవాట్ లిథియం-అయాన్ బ్యాటరీని కలిగి ఉంటుంది. అయితే ఇది పూర్తిగా డిటాచబుల్ బ్యాటరీ. కావున దీనిని బయటకు తీసి ఛార్జింగ్ వేసుకునే వెసులుబాటు కూడా ఉంటుంది. ఈ బైక్ కి ఒక్క సారి పూర్తిగా ఛార్జింగ్ వేస్తే దాదాపుగా 110 కిలోమీటర్ల పరిధిని అందిస్తుంది.

Most Read Articles

English summary
Yoda gt 120 high speed electric sports bike launched range charging details
Story first published: Saturday, January 29, 2022, 17:18 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X