యాక్టివా కొత్త వేరియంట్ విడుదల చేసిన హోండా మోటార్‌సైకిల్ - ధర & వివరాలు ఇక్కడ చూడండి

దేశీయ విఫణిలో హోండా మోటార్‌సైకిల్ అండ్ స్కూటర్ ఇండియా తన యాక్టివా హెచ్ స్మార్ట్‌ స్కూటర్ విడుదల చేసింది. ఈ స్కూటర్ ధర రూ. 80,537. కంపెనీ ఈ యాక్టివా హెచ్ స్మార్ట్‌తో పాటు 'యాక్టివా 6జి స్టాండర్డ్' మరియు 'యాక్టివా 6జి డిఎల్‌ఎక్స్' అనే వేరియంట్స్ కూడా లాంచ్ చేసింది.

కంపెనీ విడుదల చేసిన ఈ స్కూటర్ ధరలు వరుసగా రూ. 74,536 (యాక్టివా 6జి స్టాండర్డ్) మరియు రూ. 77,036 (యాక్టివా 6జి డిఎల్‌ఎక్స్). ఈ స్కూటర్లు అన్నీ కూడా చూడటానికి చాలా ఆకర్షణీయంగా ఉండటమే కాకుండా ఆధునిక ఫీచర్స్ పొందుతాయి. కావున ఇవి వాహన వినియోగదారులకు ఈ ఆధునిక కాలంలో చాలా ఉపయోగకరంగా ఉంటాయి. ఈ కొత్త అప్డేటెడ్ మోడల్స్ దాని స్టాండర్డ్ మోడల్స్ కంటే కూడా కొంత ఎక్కువ ధరను పొందుతాయి.

యాక్టివా కొత్త వేరియంట్ విడుదల చేసిన హోండా మోటార్‌సైకిల్

హోండా యాక్టివా హెచ్ స్మార్ట్ ఇప్పుడు ఎలక్ట్రానిక్ కీ ఫోబ్‌ పొందుతుంది. అంతే కాకుండా ఇందులో ఆధునిక ఎలక్ట్రానిక్ ఫీచర్‌లు కూడా అందుబాటులో ఉన్నాయి. అవి స్మార్ట్ అన్‌లాక్, స్మార్ట్ స్టార్ట్, స్మార్ట్ ఫైండ్ మరియు స్మార్ట్ సేఫ్ ఫీచర్స్. ఇందులో ఉండే స్మార్ట్ అన్‌లాక్ ఫీచర్ మీ యాక్టివా హ్యాండిల్‌ బార్లు, స్టోరేజ్ ఏరియా మరియు ఫ్యూయల్ ఫిల్లర్ క్యాప్‌ వంటి వాటిని లాక్ చేయడానికి లేదా అన్‌లాక్ చేయడానికి ఉపయోగపడతాయి.

ఇక ఇందులోని స్మార్ట్ స్టార్ట్ అనేది కూడా స్టార్ట్ అన్‌లాక్ ఫీచర్ లాగానే ఉంటుంది. అయితే మీరు ఈ ఫీచర్ ద్వారా కీ తీయాల్సిన అవసరం లేకుండానే స్కూటర్ ప్రారంభించడానికి అనుమతిస్తుంది. ఇది ఈ ఆధునిక కాలంలో చాలా ఉపయోగకరమైన ఫీచర్ అనే చెప్పాలి. స్మార్ట్ స్టార్ట్ ఫీచర్ ద్వారా మీ స్కూటర్ 10 మీటర్ల దూరం నుంచి కూడా గుర్తించడానికి అబుకూలంగా ఉంటుంది.

మీరు కొత్త యాక్టివా 6జి నుంచి 10 మీటర్లు లేదా అంతకంటే తక్కువ దూరంలో ఉన్నప్పటికీ స్కూటర్ గుర్తించకపోతే ఉన్నట్లయితే స్మార్ట్ కీలో ఉండే ఆన్సర్ బ్యాక్ బటన్ నొక్కినప్పుడు నాలుగు వింకర్‌లు రెండుసార్లు వెలుగుతాయి. అదే సమయంలో ఇందులో ఉండే స్మార్ట్ సేఫ్ అనేది యాంటీ-థెఫ్ట్ సిస్టమ్, ఇది స్కూటర్‌ను లాక్ చేయడానికి ఉపయోగపడుతుంది. యాంటీ-థెఫ్ట్ సిస్టమ్ యాక్టివేట్ చేయబడిందని మీకు తెలియడానికి కీ లైట్లు రెడ్ కలర్ లో కనిపిస్తాయి. అప్పుడు మీ స్కూటర్ సేఫ్ గా ఉందని నిర్దారించుకోవచ్చు.

యాక్టివా హెచ్ స్మార్ట్‌ రెగ్యులర్ యాక్టివా కంటే కొత్తగా ఉంది అని తెలియజేయడానికి ఇందులో అల్లాయ్ వీల్స్ ఉంటాయి. సుమారు 20 సంవత్సరాలు తరువాత 110 సిసి యాక్టివా అల్లాయ్ వీల్స్‌ పొందటం బహుశా ఇదే మొదటిసారి. కంపెనీ ఈ స్కూటర్ యొక్క ఉత్పత్తిని ఈ వారం చివరి నాటికి ప్రారంభించే అవకాశం ఉంది. కావున త్వరలోనే ఈ స్కూటర్ డెలివరీ కూడా ప్రారంభమయ్యే అవకాశం ఉంది.

హోండా యాక్టివా ఫీచర్స్ పరంగా అప్డేట్ పొందినప్పటికీ ఇంజిన్ మరియు పర్ఫామెన్స్ పరంగా ఎటువంటి మార్పుకు లోను కాలేదు. కావున ఈ కొత్త యాక్టివా 6G వేరియంట్ అదే 109.51 సిసి సింగిల్ సిలిండర్ ఇంజన్ పొందుతుంది. ఇది 7.73 బిహెచ్‌పి పవర్ మరియు 8.9 ఎన్ఎమ్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. అయితే ఈ కొత్త మోడల్ దాని మునుపటి మోడల్ కంటే కూడా 1 కేజీ తక్కువ బరువును పొందుతుంది.

దేశీయ మార్కెట్లో విడుదలైన కొత్త 2023 యాక్టివా 6జి మొత్తం ఆరు కలర్ ఆప్సన్స్ లో లభిస్తుంది. అవి డీసెంట్ బ్లూ, రెబెల్ రెడ్ మెటాలిక్, మ్యాట్ యాక్సిస్ గ్రే మెటాలిక్, బ్లాక్, పెర్ల్ ప్రెషియస్ వైట్ మరియు పియర్ సైరన్ బ్లూ కలర్స్. ఇవన్నీ కూడా చూడటానికి చాలా ఆకర్షణీయంగా ఉంటాయి. కావున కొనుగోలు దారులు తమకు నచ్చిన కలర్ వేరియంట్ ఎంచుకోవచ్చు.

Most Read Articles

English summary
2023 honda activa 6g launched price features and details
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X