తనకు తానుగా సెల్ఫ్ బ్యాలెన్స్ చేసుకునే లైగర్ మొబిలిటీ ఎలక్ట్రిక్ స్కూటర్.. 2023 ఆటో ఎక్స్‌పోలో కనిపించనుందోచ్

ప్రపంచంలో రోజు రోజుకి టెక్నాలజీ చాలా వేగంగా అభివృద్ధి చెందుతోంది. ఎద్దుల బండ్లు, గుర్రపు బండ్లుతో ప్రారంభమైన మానవుడి ప్రయాణం ఈ రోజు గగనతలానికి చేరుకుంది. అయితే ప్రస్తుతం సెల్ఫ్ బ్యాలెన్సింగ్ ఎలక్ట్రిక్ స్కూటర్‌ ఒకటి వెలుగులోకి వచ్చింది. దీని గురించి మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం.

లైగర్ మొబిలిటీ (Liger Mobility) అనే సంస్థ ప్రపంచంలోనే మొట్టమొదటి సెల్ఫ్ బ్యాలెన్సింగ్ ఎలక్ట్రిక్ స్కూటర్‌ తీసుకు రానుంది. ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ త్వరలో జరగనున్న ఆటో ఎక్స్‌పో 2023 లో ప్రదర్శించబడుతుంది. ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ ని ఆపి ఉంచినప్పుడు దీనికి స్టాండ్ వేయకపోయినా కిందికి పడకుండా తనకు తానీ బ్యాలెన్స్ చేసుకుంటుంది. ఇది నిజంగా చాలా గొప్ప టెక్నాలజీ అనే చెప్పాలి.

తనకు తానుగా సెల్ఫ్ బ్యాలెన్స్ చేసుకునే ఎలక్ట్రిక్ స్కూటర్

గతంలోనే కంపెనీ 2019 లో సెల్ఫ్ బ్యాలెన్సింగ్ మరియు సెల్ఫ్ పార్కింగ్ టెక్నాలజీ ఎనేబుల్డ్ ఎలక్ట్రిక్ స్కూటర్‌ గురించి వెల్లడించింది. దీనికి సంబంధించిన టీజర్ కూడా విడుదల చేసింది. అయితే 2019 తరువాత ఈ సంవత్సరం ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నట్లు అధికారికంగా ప్రకటించింది. ఇటువంటి టెక్నాలజీ కలిగిన ఎలక్ట్రిక్ స్కూటర్ బహుశా ప్రపంచంలో ఇదే మొదటిది అని చెప్పడంలో కూడా ఎటువంటి సందేహం లేదు.

లైగర్ మొబిలిట్రీ విడుదల చేయనున్న ఈ కొత్త లేటెస్ట్ ఎలక్ట్రిక్ స్కూటర్ ఆధునిక రెట్రో డిజైన్ కలిగి, అధునాతన ఫీచర్స్ పొందుతుంది. ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ చూడగానే వెస్పా డిజైన్ మాదిరిగా అనిపిస్తుంది. అయితే తీక్షణంగా గమనిస్తే ఈ స్కూటర్ డిజైన్ అవగతమవుతుంది. ఈ స్కూటర్ పైభాగంలో సొగసైన క్షితిజ సమాంతర LED డేటైమ్ రన్నింగ్ లైట్ (DRL) మరియు ముందు ఆప్రాన్ వద్ద డెల్టా ఆకారంలో ఉన్న LED హెడ్‌ల్యాంప్ ఉన్నాయి.

ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ లో గుండ్రంగా ఉండే LED టర్న్ ఇండికేటర్స్ ఫ్రంట్ కౌల్‌లో చూడవచ్చు. ఇందులో సౌకర్యవంతమైన సీటు, వెనుక భాగంలో గ్రాబ్ రైల్ మరియు LED టైల్‌లైట్ వంటి వాటిని గమనించవచ్చు. ఇందులో ఉన్న సీటు రైడర్ మరియు పిలియన్ ఇద్దరికీ కూడా చాలా సౌకర్యవంతంగా ఉంటుంది. మొత్తం మీద ఇది చూడగానే ఆకర్షించే డిజైన్ కలిగి చూపరులను ఇట్టే ఆకట్టుకుంటుంది.

లైగర్ మొబిలిటీ ఎలక్ట్రిక్ స్కూటర్ టెలిస్కోపిక్ సస్పెన్షన్ మరియు అప్డేటెడ్ ఫీచర్స్ పొందుతుంది. అంతే కాకుండా ఈ స్కూటర్ మల్టిపుల్ కలర్ ఆప్సన్స్ లో విడుదలయ్యే అవకాశం ఉంటుంది. ఇందులో ఒకటి మాట్ రెడ్ కలర్. అదే సమయంలో ఈ స్కూటర్ రబ్బరుతో చుట్టబడిన అల్లాయ్ వీల్స్‌ కలిగి ఉంటుంది. ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ గురించి మరిన్ని వివరాలు ఇంకా తెలియాల్సి ఉంటుంది. దేని గురించి మరిన్ని వివరాలు త్వరలోనే తెలుస్తాయి.

ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ తప్పకుండా ఆధునిక టెక్నాలజీ కలిగి ఉంటుందని కంపెనీ తెలిపింది. ఈ టెక్నాలజీలన్నీ కూడా ఎలక్ట్రిక్ స్కూటర్ రైడింగ్ చేసేవారి యొక్క భద్రతహను నిర్థారిస్తుంది. కావున ఇది సాధారణ స్కూటర్లకంటే కూడా చేలా సౌకర్యంగా మరియు రైడర్లకు చాలా సౌలభ్యంగా ఉంటుంది. ఈ స్కూటర్ సెల్ఫ్ బ్యాలెన్సింగ్ టెక్నాలజీతో పాటు మీ వాయిస్‌తో కూడా పని చేస్తుంది. అధునాతన వాయిస్ కమాండ్‌ ఫీచర్ కూడా ఈ స్కూటర్‌కు జోడించబడింది.

ఈ ఎలక్ట్రిక్ స్కూటర్లోని వాయిస్ కమాండ్స్ చాలా అనుకూలంగా ఉంటుంది. ఈ స్కూటర్ కి సంబంధించిన చాలా సమాచారాన్ని కంపెనీ 2023 ఆటో ఎక్స్‌పోలో వెల్లడించనుంది. త్వరలో జరగనున్న ఆటో ఎక్స్‌పో 2023 లో దాదాపు 15 దేశాలకు చెందిన 800 కంపెనీలు పాల్గొనే అవకాశం ఉంది. ఆటో ఎక్స్‌పోలో అడుగుపెట్టే వాహనాలను గురించి ఎప్పటికప్పుడు తెలుసుకోవడానికి తెలుగు డ్రైవ్‌స్పార్క్ ఛానల్ చూస్తూ ఉండండి.

Most Read Articles

English summary
Liger mobility self balancing electric scooter to launch in 2023 auto expo
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X