ఈ రోజు నుంచి ప్రారంభం కానున్న 'మిహోస్' బుకింగ్స్.. డెలివరీలు ఎప్పుడంటే?

ఇటీవల జరిగిన '2023 ఆటో ఎక్స్‌పో' లో 'జాయ్' ఈ బైక్ కంపెనీ 'మిహోస్' ఎలక్ట్రిక్ స్కూటర్ లాంచ్ చేసింది. కంపెనీ లాంచ్ చేసిన ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ ధర రూ.1.49 లక్షలు (ఎక్స్-షోరూమ్). అయితే కంపెనీ ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ కోసం ఈ నెల 22 నుంచి బుకింగ్స్ స్వీకరించడం ప్రారంభించింది.

జాయ్ కంపెనీ విడుదల చేసిన ఈ ఎలక్ట్రిక్ బైక్ కొనాలనుకునే వారు జనవరి 22 నుంచి దేశ వ్యాప్తంగా ఉన్న కంపెనీ యొక్క అధికారిక డీలర్‌షిప్‌లలో లేదా ఆన్‌లైన్ లో బుక్ చేసుకోవచ్చు. అయితే జాయ్ ఎలక్ట్రిక్ స్కూటర్ ప్రారంభ ధరలు కేవలం మొదటి 5,000 మంది కస్టమర్లకు మాత్రమే వర్తిస్తుంది. ఆ తరువాత ఈ స్కూటర్ ధరలు ఆ తరువాత పెరిగే అవకాశం ఉంటుంది. డెలివరీలు దశల వారీగా ప్రారంభమవుతాయి.

రేపటి నుంచి ప్రారంభం కానున్న మిహోస్ బుకింగ్స్

జాయ్ ఇ-బైక్ మిహోస్ అద్భుతమైన డిజైన్ మరియు ఫీచర్స్ పొందుతుంది. పరిమాణం విషయానికి వస్తే, దీని పొడవు 1,864 మిమీ, వెడల్పు 700 మిమీ మరియు ఎత్తు 1,178 మిమీ వరకు ఉంటుంది. అదే సమయంలో ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ 1,360 మిమీ పొడవైన వీల్‌బేస్‌ కలిగి, 175 మిమీ గ్రౌండ్ క్లియరెన్స్‌ పొందుతుంది. ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ యొక్క సీటు ఎత్తు భూమి నుంచి 740 మిమీ వరకు ఉంటుంది. కావున రైడర్లకు అనుకూలంగా ఉంటుంది.

జాయ్ మిహోస్ ఎలక్ట్రిక్ స్కూటర్ నికెల్ మాంగనీస్ కోబాల్ట్ (NMC) లిథియం-అయాన్ బ్యాటరీ పొందుతుంది. ఇది 2.5 kWh బ్యాటరీ కలిగి ఉండటం వల్ల, ఒక ఫుల్ ఛార్జ్ తో ఏకంగా 100 కిమీ పరిధిని అందిస్తుండని ధృవీకరించబడింది. ఈ బ్యాటరీని పూర్తిగా ఛార్జ్ చేయడానికి పట్టే సమయం నాలుగు గంటలు మాత్రమే. దీని గరిష్ట వేగం 70 కిమీ వరకు ఉంటుంది. అదే సమయంలో కేవలం 7 సెకన్లలో గంటకు 0 నుంచి 100 కిమీ వరకు వేగవంతం అవుతుంది.

జాయ్ ఇ-బైక్ మిహోస్ యొక్క డిజైన్ విషయానికి వస్తే, ఇది చూడటానికి సింపుల్ గా చాలా ఆకర్షణీయంగా ఉంటుంది. ఈ బైక్ రెట్రో డిజైన్‌ను కలిగి రౌండ్ హెడ్‌ల్యాంప్ ఉంటుంది, దానికి కింద ఇండికేటర్స్ చూడవచ్చు. మిహోస్‌లో పొడవైన సీటు మరియు సింగిల్-పీస్ గ్రాబ్రెయిల్ కూడా ఉన్నాయి. ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ యొక్క బాడీ ప్యానెల్ పాలీ డిసైక్లోపెంటాడైన్ తో తాయారు చేయబడి ఉంటుంది.

మిహోస్ ఎలక్ట్రిక్ స్కూటర్ లో బ్లూటూత్ ద్వారా స్కూటర్‌కి కనెక్ట్ అయ్యే జాయ్ ఇ-కనెక్ట్ యాప్‌తో సహా అనేక ఫీచర్లను పొందుతుంది. ఇవన్నీ స్కూటర్ గణాంకాలను తనిఖీ చేయడానికి మరియు GPS తో రిమోట్‌గా ట్రాక్ చేయడానికి రైడర్ ని అనుమతిస్తుంది. అంతే కాకుండా ఇందులో జియోఫెన్సింగ్, యాంటీథెఫ్ట్ మరియు కీలెస్ ఆపరేషన్‌తో పాటు సులభమైన పార్కింగ్ కోసం రివర్స్ మోడ్ కూడా అందుబాటులో ఉన్నాయి.

జాయ్ ఇ-బైక్ మిహోస్‌లో టెలీస్కోపిక్ ఫ్రంట్ ఫోర్క్‌లు మరియు వెనుకవైపు మోనోషాక్‌తో అమర్చబడి ఉంటుంది. ఇందులో హైడ్రాలిక్ కాంబి-బ్రేకింగ్ సిస్టమ్ ద్వారా సహాయపడే రెండు డిస్క్ బ్రేక్స్ కలిగి ఉంటాయి. మీరు బ్రేక్ లివర్‌ని లాగిన ప్రతిసారీ బ్యాటరీని ఛార్జ్ చేయడంలో బ్రేక్‌లు సహాయపడతాయి. ఇది ఈ ఎలక్ట్రిక్ బైకులో ఒక ఉత్తమైన ఫీచర్ అనే చెప్పాలి. కావున ఇది అన్ని విధాలుగా వాహన వినియోగదారులకు అనుకూలంగా ఉంటుంది.

జాయ్ కంపెనీ భారతీయ మార్కెట్లో విడుదల చేసిన ఈ కొత్త ఈ బైక్ ఒక సింగిల్ ఛార్జ్ తో గరిష్టంగా 100 కిమీ రేంజ్ అందిస్తుంది. దీనికోసం కంపెనీ ఇందులో లిథియం-అయాన్ బ్యాటరీ ప్యాక్‌ అమర్చబడి ఉంటుంది. మిహోస్ ఎలక్ట్రిక్ వెహికల్ మొత్తం నాలుగు కలర్ ఆప్సన్స్ లో లభిస్తుంది. అవి మెటాలిక్ బ్లూ, సాలిడ్ బ్లాక్ గ్లోసీ, సాలిడ్ ఎల్లో గ్లోసీ మరియు పెర్ల్ వైట్ కలర్స్. ఇవన్నీ కూడా చూడటానికి చాలా ఆకర్షణీయంగా ఉంటాయి.

Most Read Articles

English summary
Mihos electric scooter bookings start from january 22 details
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X