ఎక్కువ మంది ఇష్టపడే కమ్యూటర్ బైకులు: ధరలు రూ. 1 లక్ష కంటే తక్కువే..!!

భారతదేశంలో అందుబాటులో ఉన్న ద్విచక్ర వాహనాలలో కమ్యూటర్ మోటార్ సైకిళ్లకు ఎక్కువ ఆదరణ ఉంది. ఎందుకంటే ఇవి రోజు వారీ ప్రయాణానికి అనుకూలంగా ఉండటమే కాకుండా మంచి మైలేజ్ కూడా అందిస్తాయి. దేశీయ మార్కెట్లో అత్యంత ప్రజాదరణ పొందిన మరియు రూ. 1 లక్ష కంటే తక్కువ ధర వద్ద లభించే కమ్యూటర్ బైకుల గురించి ఈ కథనంలో తెలుసుకుందాం.

ఎక్కువ మంది ఇష్టపడే కమ్యూటర్ బైకులు: ధరలు రూ. 1 లక్షకంటే తక్కువే..!!

టీవీఎస్ స్పోర్ట్:

భారతీయ మార్కెట్లో టీవీఎస్ కంపెనీ యొక్క ద్విచక్ర వాహనాలను ఉన్న ఆదరణ మరియు డిమాండ్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. అయితే ఇందులో టీవీఎస్ స్పోర్ట్ బైక్ ఎక్కువ మంది కొనుగోలు చేయడానికి ఇష్టపడే బైక్. ఈ బైక్ ప్రారంభ ధర రూ. 64,050 (ఎక్స్-షోరూమ్, ఢిల్లీ)

ఎక్కువ మంది ఇష్టపడే కమ్యూటర్ బైకులు: ధరలు రూ. 1 లక్షకంటే తక్కువే..!!

టీవీఎస్ స్పోర్ట్స్ బైక్ 110 సిసి ఇంజన్ పొందుతుంది. ఇది 7350 ఆర్‌పిఎమ్ వద్ద 8.18 బిహెచ్‌పి పవర్ మరియు 4500 ఆర్‌పిఎమ్ వద్ద 8.7 ఎన్ఎమ్ టార్క్ ఉత్పత్తి చేస్తుంది. ఇంజిన్ ఎకో థ్రస్ట్ ఫ్యూయల్ ఇంజెక్షన్ టెక్నాలజీని కలిగి ఉంది. ఇది బైక్ యొక్క మైలేజిని 15 శాతం వరకు పెంచడంలో సహాయపడుతుంది. ఈ బైక్ యొక్క మైలేజ్ 110 కిమీ/లీ గా నమోదు చేయబడింది.

ఎక్కువ మంది ఇష్టపడే కమ్యూటర్ బైకులు: ధరలు రూ. 1 లక్షకంటే తక్కువే..!!

హోండా సిడి 110 డ్రీమ్:

హోండా మోటార్ సైకిల్స్ యొక్క 'సిడి 110 డ్రీమ్' బైక్ కూడా దేశీయ మార్కెట్లో లభిస్తున్న అత్యంత సరసమైన బైక్. ఈ బైక్ ప్రారంభ ధర రూ. 71,113 (ఎక్స్ షోరూమ్, ఢిల్లీ). ఈ బైక్ 110 సిసి ఇంజిన్ కలిగి 7500 ఆర్‌పిఎమ్ వద్ద 8.67 బిహెచ్‌పి పవర్ మరియు 5500 ఆర్‌పిఎమ్ వద్ద 9.30 ఎన్ఎమ్ పీక్ టార్క్ ఉత్పత్తి చేస్తుంది. ఇందులో ప్రోగ్రామ్డ్ ఫ్యూయల్ ఇంజెక్షన్ టెక్నాలజీ ఉంటుంది. హోండా సిడి 110 డ్రీమ్ ఒక లీటరుకు 70 కిమీ నుంచి 75 కిమీ మైలేజ్ అందిస్తుంది.

ఎక్కువ మంది ఇష్టపడే కమ్యూటర్ బైకులు: ధరలు రూ. 1 లక్షకంటే తక్కువే..!!

టీవీఎస్ స్టార్ సిటీ+:

మన జాబితాలో టీవీఎస్ స్టార్ సిటీ+ కూడా సరసమైన అధిక డిమాండ్ ఉన్న బైక్. ఈ బైక్ ప్రారంభ ధర రూ. 75,890 (ఎక్స్-షోరూమ్, ఢిల్లీ). ఈ బైక్ కూడా ఎకో థ్రస్ట్ ఫ్యూయల్ ఇంజెక్షన్ టెక్నాలజీని కలిగి ఉంది. ఇందులో 110 సిసి ఇంజిన్ 7350 ఆర్‌పిఎమ్ వద్ద 8.08 బిహెచ్‌పి పవర్ మరియు 4500 ఆర్‌పిఎమ్ వద్ద 8.7 ఎన్ఎమ్ టార్క్ ఉత్పత్తి చేస్తుంది. ఈ బైక్ 80 కిమీ నుంచి 86 కిమీ మైలేజ్ అందిస్తుందని నివేదించబడింది.

ఎక్కువ మంది ఇష్టపడే కమ్యూటర్ బైకులు: ధరలు రూ. 1 లక్షకంటే తక్కువే..!!

బజాజ్ పల్సర్ 125:

బజాజ్ ఆటో యొక్క పల్సర్ 125 దేశీయ మార్కెట్లో ఎక్కువ మంది ఇష్టపడి కొనుగోలు చేసే బైక్. ఈ బైక్ ప్రారంభ ధర రూ. 87,149 (ఎక్స్-షోరూమ్, ఢిల్లీ). ఈ బైక్ సింగిల్ సీట్, స్ప్లిట్ సీట్ మరియు నియాన్ సింగిల్ సీట్ వేరియంట్స్ లో లభిస్తుంది. వీటి ధరలు వరుసగా రూ . 89,254, రూ. 91,642 మరియు రూ. 87,149 (ధరలు ఎక్స్-షోరూమ్).

ఎక్కువ మంది ఇష్టపడే కమ్యూటర్ బైకులు: ధరలు రూ. 1 లక్షకంటే తక్కువే..!!

బజాజ్ పల్సర్ 125 బైక్ పైన చెప్పిన బైకులకంటే ఎక్కువ పవర్ డెలివరీ చేస్తుంది. ఈ బైక్ 11.64 బిహెచ్‌పి పవర్ మరియు 10.8 ఎన్ఎమ్ పీక్ టార్క్ ఉత్పత్తి చేస్తుంది. ఈ బైక్ గరిష్టంగా ఒక లీటరుకు 53 కిమీ నుంచి 55 కిమీ మైలేజ్ అందిస్తుంది. ఇది కూడా రూ. 1 లక్ష లోపు లభించే ఎక్కువ డిమాండ్ ఉన్న బైక్.

ఎక్కువ మంది ఇష్టపడే కమ్యూటర్ బైకులు: ధరలు రూ. 1 లక్షకంటే తక్కువే..!!

హీరో ప్యాషన్ ప్రో:

మనం ఈ జాబితాలో తప్పకుండా హీరో మోటోకార్ప్ బైకుల గురించి కూడా తప్పకుండా చెప్పుకోవాలి. ఎందుకంటే దేశీయ మార్కెట్లో హీరో మోటోకార్ప్ బైకులకు ఒక ప్రత్యేకమైన డిమాండ్ ఉంది. ఇందులో హీరో ప్యాషన్ ప్రో ఒకటి. ఈ బైక్ ప్రారంభ ధర రూ. 74,408 (ఎక్స్-షోరూమ్, ఢిల్లీ).

ఎక్కువ మంది ఇష్టపడే కమ్యూటర్ బైకులు: ధరలు రూ. 1 లక్షకంటే తక్కువే..!!

హీరో ప్యాషన్ ప్రో లోని 113 సిసి ఇంజిన్ గరిష్టంగా 9.02 బిహెచ్‌పి పవర్ మరియు 9.89 ఎన్ఎమ్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. ఈ బైక్ రోజు వారీ ప్రయాణానికి చాలా అనుకూలంగా ఉంటుంది. అంతే కాకుండా ఈ బైక్ యొక్క నిర్వహణ ఖర్చు కూడా తక్కువగానే ఉంటుంది.

ఎక్కువ మంది ఇష్టపడే కమ్యూటర్ బైకులు: ధరలు రూ. 1 లక్షకంటే తక్కువే..!!

హోండా సిబి షైన్:

మన జాబితాలో చివరి బైక్ హోండా సిబి షైన్. ఈ బైక్ ప్రారంభ ధర రూ. 78,687 (ఎక్స్-షోరూమ్, ఢిల్లీ). ఇది 125 సిసి ఇంజిన్ కలిగి ఉంటుంది. ఈ ఇంజిన్ 10.59 బిహెచ్‌పి పవర్ మరియు 11 ఎన్ఎమ్ పీక్ టార్క్ ఉత్పత్తి చేస్తుంది. అంతే కాకుండా ఇందులో ఆధునిక టెక్నాలజీ కూడా ఉపయోగించబడింది, ఇది బైక్ యొక్క మైలేజ్ పెంచడంలో సహాయపడుతుంది.

ఎక్కువ మంది ఇష్టపడే కమ్యూటర్ బైకులు: ధరలు రూ. 1 లక్షకంటే తక్కువే..!!

ఎక్కువ మంది కోరుకునే బైకులతో పైన పేర్కొన్న బైకులు మాత్రమే కాకుండా హీరో స్ప్లెండర్ మొదలైనవి కూడా ఉన్నాయి. ఇవన్నీ కూడా తక్కువ నిర్వహణ ఖర్చుతో ఎక్కువ మైలేజ్ అందిస్తాయి. కావున ఎక్కువమంది గ్రామీణా ప్రాంతాల్లో ఉండే వారు పట్టణ ప్రాంతాల్లో ఉండే వారు ఇలాంటి బైకులు కొనుగోలు చేయడానికి ఎక్కువ ఆసక్తి చూపుతారు. ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన కథనాలు గురించి తెలుసుకోవడానికి తెలుగు డ్రైవ్‌స్పార్క్ చూస్తూ ఉండండి.

Most Read Articles

English summary
Top 6 commuter bikes under 1 lakh in india telugu details
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X