హీరో మోటోకార్ప్‌ను ప్రమోట్ చేయనున్న అలియా భట్

బాలీవుడ్ దర్శకుడు మహేష్ భట్ కుమార్తె, వర్ధమాన నటి అలియా భట్ (21 ఏళ్లు) ఇకపై హీరో మోటోకార్ప్ ఉత్పత్తులకు ప్రచారకర్తగా (బ్రాండ్ అంబాసిడర్) వ్యవహరించనుంది. ఇప్పటి వరకు ప్రచారకర్తగా ఉన్న కరీనా కపూర్‌ను పక్కకు నెట్టి, అలియా భట్ ఆ స్థానాన్ని దక్కించుకుంది. హైవే, 2 స్టేట్స్ సినిమాలతో సక్సెస్ సాధించిన ఆమె తాజాగా వరున్ ధావన్‌తో ''హంప్టీ శర్మకి దుల్హనియా'' సినిమాలో నటిస్తోంది.

హీరో మోటోకార్ప్ ఇటీవలి కాలంలో యువతకు చేరువగా ఉండే ఉత్పత్తులను విడుదల చేస్తున్న నేపథ్యంలో, బ్రాండ్ అంబాసిడర్ విషయంలో కూడా యువతకే ప్రాధాన్యత ఇవ్వాలనే ఉద్దేశ్యంతో అలియా భట్‌ను తమ బ్రాండ్ అంబాసిడర్‌గా నియమించుకుంటున్నామని కంపెనీ పేర్కొంది. అలియా భట్ అతి తక్కువ సమయంలోనే ఇండస్ట్రీలో మంచి పాపులారిటీని దక్కించుకోవటంతో ఇప్పుడు టాప్ కంపెనీల దృష్టి ఆమెపై పడింది.

Alia Bhatt

యూత్‌ఫుల్ ఎనర్జీ, డైనమిజం, వెర్సటాలిటీలతో అలియా భట్ హీరో బ్రాండ్ ప్రచారానికి కీలకం కాగలదని కంపెనీ వర్గాలు తెలిపాయి. అయితే, తమ ఉత్పత్తులకు బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరిస్తున్నందుకు గాను అలియా భట్‌కు ఎంత మొత్తం రెన్యూనరేషన్ ఇస్తున్న విషయాన్ని హీరో మోటోకార్ప్ వెల్లడించలేదు. ఆమె తొలి క్యాంపైన్ హీరో ప్లెజర్ స్కూటర్‌తోనే ప్రారంభం కానుంది.

ప్రత్యేకించి మహిళల కోసం తయారు చేయబడిన ఈ స్కూటర్‌ను ఇదివరకు ప్రియాంకా చోప్రా ప్రమోట్ చేసేది. ఈ స్కూటర్‌తో అలియా భట్ కమర్షియలో త్వరలోనే విడుదల కానుంది. భారతదేశపు అగ్రగామి కంపెనీ అయిన హీరో మోటోకార్ప్ ఇప్పటికే రాజ్యవర్థన్ రాథోడ్, గౌతమ్ గంబీర్, వీరేందర్ సెహ్వాగ్, ఇషాంత్ శర్మ, సురేష్ రైనా వంటి క్రీడాకారులతో పాటుగా రణ్‌బీర్ కపూర్ వంటి సెలబ్రిటీలు కూడా బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరించారు.

Most Read Articles

English summary
Indian two wheeler giant Hero MotoCorp has appointed bollywood actress Alia Bhatt as their latest Ambassador. Alia Bhatt is an upcoming actress and daughter of movie maker Mahesh Bhatt. She has performed as the leading lady in two of her recent movies Two States and Highway.
Story first published: Friday, June 20, 2014, 14:31 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X