ఇండియా బైక్ వీక్ 2015: వెస్పా, ఆప్రిలియా, మోటో గుజ్జి బైక్స్

By Ravi

ఇటాలియన్ ఆటోమొబైల్ దిగ్గజం పియాజ్జియో వద్ద ఆప్రిలియా, వెస్పా, మోటో గుజ్జి వంటి పాపులర్ ద్విచక్ర వాహన బ్రాండ్లు ఉన్న సంగతి తెలిసినదే. ప్రస్తుతం ఈ మూడు బ్రాండ్లకు ద్విచక్ర వాహనాలు ఇండియన్ మార్కెట్లో లభిస్తున్నాయి.

తాజాగా.. ఫిబ్రవరి 20, 21 తేదీలలో గోవాలో జరిగిన ఇండియా బైక్ వీక్ 2015లో పియాజ్జియో ఈ మూడు మోడళ్లలోని సరికొత్త ఉత్పత్తులను ప్రదర్శనకు ఉంచింది. ప్రస్తుతం భారత్‌లో అందుబాటులో లేని అరుదైన మోడళ్లను కూడా పియాజ్జియో ప్రదర్శించింది.

గోవాలో జరిగిన మూడవ ఎడిషన ఇండియా బైక్ వీక్‌లో పియాజ్జియో తమ ఆప్రిలియా, మోటో గుజ్జి, వెస్పా ద్విచక్ర వాహనాలను ప్రదర్శించింది. మరి ఆ వివరాలేంటో ఈ కథనంలో తెలుసుకుందాం రండి..!

ఇండియా బైక్ వీక్ 2015: వెస్పా, ఆప్రిలియా, మోటో గుజ్జి బైక్స్

ఇండియా బైక్ వీక్ 2015లో పియాజ్జియో ప్రదర్శించిన ద్విచక్ర వాహనాలకు సంబంధించిన మరిన్ని వివరాలను తర్వాతి స్లైడ్‌లలో చూడండి.

వెస్పా ఎస్ 125

వెస్పా ఎస్ 125

మూడవ ఎడిషన్ ఇండియా బైక్‌లో పియాజ్జియో తమ వెస్పా ఎస్ 125 బైక్‌ను ప్రదర్శించింది. ఈ ప్రదర్శన కోసం రెగ్యులర్ వెస్పాస్ ఎస్ 125 మోడల్‌ను ప్రత్యేకంగా కస్టమైజ్ చేశారు. ఇందులోని 125సీసీ ఇంజన్ గరిష్టంగా 10 బిహెచ్‌పిల శక్తిని, 10.6 ఎన్ఎమ్‌ల టార్క్‌ని ఉత్పత్తి చేస్తుంది. ఇందులో ముందు వైపు డిస్క్ బ్రేక్ కూడా ఉంటుంది.

వెస్పా జిటిఎస్ సూపర్

వెస్పా జిటిఎస్ సూపర్

పియాజ్జియో ప్రదర్శించిన ద్విచక్ర వాహనాల్లో మరో అద్భుతమైన మోడల్ ఈ వెస్పా జిటిఎస్ సూపర్. ఇందులో పవర్‌ఫుల్ 278సీసీ, సింగిల్ సిలిండర్, క్వసారా ఇంజన్ ఉంటుంది. ఈ ఇంజన్ గరిష్టంగా 21.1 హెచ్‌పిల శక్తిని, 22.3 ఎన్ఎమ్‌ల టార్క్‌ని ఉత్పత్తి చేస్తుంది. ఇందులో ఫ్రంట్ అండ్ రియర్ డిస్క్ బ్రేక్స్, ఏబిఎస్ కూడా ఉంటుంది.

వెస్పా జిటిఎస్ 300

వెస్పా జిటిఎస్ 300

వెస్పా జిటిఎస్ సూపర్ మరియు జిటిఎస్ 300 రెండూ కవల పిల్లల లాంటివి. ఈ రెండింటిలోను ఒకేరకమైన ఇంజన్‌ను ఉపయోగించారు. ఇందులో పవర్‌ఫుల్ 278సీసీ, సింగిల్ సిలిండర్, క్వసారా ఇంజన్ ఉంటుంది. ఈ ఇంజన్ గరిష్టంగా 21.1 హెచ్‌పిల శక్తిని, 22.3 ఎన్ఎమ్‌ల టార్క్‌ని ఉత్పత్తి చేస్తుంది. ఇందులో ఫ్రంట్ అండ్ రియర్ డిస్క్ బ్రేక్స్, ఏబిఎస్ కూడా ఉంటుంది.

మోటో గుజ్జి వి7 రేసర్

మోటో గుజ్జి వి7 రేసర్

పియాజ్జియో ప్రదర్శించిన ద్విచక్ర వాహనాల్లో మోటో గుజ్జి వి7 రేసర్ మోడల్ కూడా ఉంది. ఇందులో పవర్‌ఫుల్ 744సీసీ, వి-ట్విన్ ఇంజన్ ఉంటుంది. ఈ ఇంజన్ గరిష్టంగా 50 హెచ్‌పిల శక్తిని, 58 ఎన్ఎమ్‌ల టార్క్‌ని ఉత్పత్తి చేస్తుంది. దీని మొత్తం బరువు 179 కేజీలు.

మోటో గుజ్జి గ్రిసో 8వి ఎస్ఈ

మోటో గుజ్జి గ్రిసో 8వి ఎస్ఈ

పియాజ్జియో ప్రదర్శించిన ద్విచక్ర వాహనాల్లో అందమైన మోటో గుజ్జి గ్రిసో 8వి ఎస్ఈ మోడల్ కూడా ఉంది. ఇందులో 1151సీసీ, వి 90 ట్విన్ ఇంజన్ ఉంటుంది. ఈ ఇంజన్ గరిష్టంగా 110 హెచ్‌పిల శక్తిని, 108.47 ఎన్ఎమ్‌ల టార్క్‌ని ఉత్పత్తి చేస్తుంది.

మోటో గుజ్జి కాలిఫోర్నియా 1400 టూరింగ్

మోటో గుజ్జి కాలిఫోర్నియా 1400 టూరింగ్

ఇండియా బైక్ వీక్ 2015లో పియాజ్జియో తమ పాపులర్ టూరింగ్ మోటార్‌సైకిల్ 'మోటో గుజ్జి కాలిఫోర్నియా 1400 టూరింగ్'ను కూడా ప్రదర్శనకు ఉంచింది. ఈ బైక్‌లో 1380సీసీ, వి-ట్విన్ ఇంజన్ ఉంటుంది. ఈ ఇంజన్ గరిష్టంగా 96 హెచ్‌పిల శక్తిని, 120 ఎన్ఎమ్‌ల టార్క్‌ని ఉత్పత్తి చేస్తుంది.

ఆప్రిలియా కపోనార్డ్ ర్యాలీ

ఆప్రిలియా కపోనార్డ్ ర్యాలీ

అడ్వెంచర్ బైక్ ప్రియుల కోసం ఆప్రిలియా అందిస్తున్న కపోనార్డ్ ర్యాలీ మోటార్‌సైకిల్‌ని కూడా పియాజ్జియో ఈ మూడవ ఎడిషన్ ఇండియా బైక్ వీక్‌లో ప్రదర్శించింది. ఈ బైక్‌లో 1197సీసీ, వి-ట్విన్ ఇంజన్ ఉంటుంది. ఈ ఇంజన్ గరిష్టంగా 125 హెచ్‌పిల శక్తిని, 114.8 ఎన్ఎమ్‌ల టార్క్‌ని ఉత్పత్తి చేస్తుంది.

ఆప్రిలియా షివర్ 750

ఆప్రిలియా షివర్ 750

ఆప్రిలియా అందిస్తున్న మరో అద్భుతమైన నేక్డ్ మోటార్‌సైకిల్ షివర్ 750ని కూడా కంపెనీ ఈ ప్రదర్శనకు తీసుకువచ్చింది. ఇందులో 90 డిగ్రీ, 749.9సీసీ వి-ట్విన్ ఇంజన్ ఉంటుంది. ఈ ఇంజన్ గరిష్టంగా 95 హెచ్‌పిల శక్తిని, 81 ఎన్ఎమ్‌ల టార్క్‌ని ఉత్పత్తి చేస్తుంది. రేసింగ్ బైక్‌లలో ఉపయోగించే అడ్వాన్స్డ్ సస్పెన్షన్ సిస్టమ్, బ్రేక్స్‌ను ఇందులో ఆఫర్ చేస్తున్నారు.

ఆప్రిలియా ఆర్ఎస్‌వి4

ఆప్రిలియా ఆర్ఎస్‌వి4

ఇక చివరగా.. ఐబిడబ్ల్యూ 2015లో పియాజ్జియో ప్రదర్శించిన మోడల్ ఆప్రిలియా ఆర్ఎస్‌వి4 స్పోర్ట్స్ బైక్. ఈ బైక్‌లో 996.6సీసీ, వి4 ఇంజన్‌ను ఉపయోగించారు. ఈ ఇంజన్ గరిష్టంగా 184 హెచ్‌పిల శక్తిని, 117 ఎన్ఎమ్‌ల టార్క్‌ని ఉత్పత్తి చేస్తుంది.

Most Read Articles

English summary
At the third edition of India Bike Week, Piaggio brought Aprilia, Moto Guzzi and Vespa two-wheelers. They had an array of products on display and everyone could touch and feel their offerings.
Story first published: Wednesday, February 25, 2015, 21:13 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X