కొత్త బజాజ్ ప్లాటినా ఈఎస్; ధర, ఫీచర్లు, స్పెసిఫికేషన్లు

By Ravi

బజాజ్ ఆటో లిమిటెడ్ విక్రయిస్తున్న చీప్ అండ్ బెస్ట్ కమ్యూటర్ మోటార్‌సైకిల్ బజాజ్ ప్లాటినాలో కంపెనీ తాజాగా ఫేస్‌లిఫ్ట్ వెర్షన్‌ను మార్కెట్లో విడుదల చేసింది. 'బజాజ్ ప్లాటినా ఈఎస్' (ఎలక్ట్రిక్ స్టార్ట్)ను పేరుతో కంపెనీ విడుదల చేసిన ఈ సరికొత్త మోడల్, 100సీసీ సెగ్మెంట్లో కెల్లా విశిష్టమైన మైలేజీని ఆఫర్ చేస్తుంది.

ఈ సెగ్మెంట్లో హీరో స్ప్లెండర్, హీరో ప్యాషన్, హోండా డ్రీమ్ సిరీస్ మరియు టీవీఎస్ స్టార్ సిటీ వంటి మోటార్‌సైకిళ్లకు గట్టి పోటీనిచ్చే విధంగా, లీటరు పెట్రోలుకు ఏకంగా 96.9. కిలోమీటర్ల మైలేజీనిచ్చేలా (ఏఆర్ఏఐ సర్టిఫైడ్ మైలేజ్) రూపొందించిన ప్లాటినా ఈఎస్ మోడల్‌ను రూపొందించారు. దీని ధర, ఫీచర్లు, ఇతర స్పెసిఫికేషన్లను ఈ ఫొటో ఫీచర్‌లో పరిశీలించండి.

మరింత సమాచారం తర్వాతి సెక్షన్‌లో.. మరిన్ని వివరాలను ఈ ఫొటో ఫీచర్‌లో పరిశీలించండి..!

ధర

ధర

దేశీయ విపణిలో బజాజ్ ప్లాటినా ఈఎస్ ధర రూ.44,507 (ఎక్స్-షోరూమ్, ఢిల్లీ)గా ఉంది.

ఇంజన్

ఇంజన్

బజాజ్ ప్లాటినా ఈఎస్ మోటార్‌సైకిల్‌లో కొత్త 102సీసీ, సింగిల్ సిలిండర్ ఇంజన్‌ను ఉపయోగించారు. ఈ ఇంజన్‌లో బజాజ్ పాపులర్ డిటిఎస్ఐ టెక్నాలజీని మరియు ఎగ్జాస్‌టెక్ టెక్నాలజీని ఉపయోగించారు. ఈ ఇంజన్ గరిష్టంగా 8 బిహెచ్‌పిల శక్తిని, 8.7 ఎన్ఎమ్‌ల టార్క్‌ని ఉత్పత్తి చేస్తుంది. ఇది 4-స్పీడ్ గేర్‌బాక్స్‌తో లభిస్తుంది.

మైలేజ్

మైలేజ్

కంపెనీ పేర్కొన్న సమాచారం ప్రకారం, బజాజ్ ప్లాటినా ఈఎస్ లీటరుకు 96.9. కిలోమీటర్ల మైలేజీనిస్తుంది (ఏఆర్ఏఐ సర్టిఫైడ్ మైలేజ్). దీని ఫ్యూయెల్ ట్యాంక్ సామర్థ్యం 11.5 లీటర్లు. సింగిల్ ఫుల్ ట్యాంక్‌తో 1114 కిలోమీటర్ల దూరం ప్రయాణించవచ్చని కంపెనీ తెలిపింది.

డిజైన్ ఫీచర్స్

డిజైన్ ఫీచర్స్

* కొత్త సైడ్ ప్యానెల్స్

* కొత్త ఎగ్జాస్ట్

* కొంచెం విభిన్నంగా ఉండే హెడ్‌ల్యాంప్స్

* కొత్త గ్రాఫిక్స్

ఇతర ఫీచర్లు

ఇతర ఫీచర్లు

* ఎస్ఎన్ఎస్ సస్పెన్షన్

* సెగ్మెంట్లో కెల్లా బెస్ట్ గ్రౌండ్ క్లియరెన్స్

* ఎలక్ట్రిక్ స్టార్ట్

* సెగ్మెంట్లో కెల్లా వెడల్పాటి టైర్

* పొడవాటి సీట్

* అల్లాయ్ వీల్స్

* జీరో మెయింటినెన్స్ బ్యాటరీ

కలర్ ఆప్షన్స్

కలర్ ఆప్షన్స్

బజాజ్ ప్లాటినా ఈఎస్ మూడు ఆకర్షనీయమైన రంగులలో లభిస్తుంది. అవి -

* ఎబోనీ బ్లాక్

* ఎలక్ట్రాన్ బ్లూ

* క్యాండీ రెడ్

Most Read Articles

English summary
Bajaj Auto has launched its all new Platina ES in India . The Indian manufacturer had a strong hold over the commuter segment of motorcycles with its predecessor models. The motorcycle gets an all new engine and design elements to make it more appealing to today's buyers.
Story first published: Tuesday, January 27, 2015, 18:45 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X