భారత్‌లో బిఎమ్‌డబ్ల్యూ ఎస్1000ఆర్ బైక్ విడుదల

Written By:

జర్మన్ లగ్జరీ కార్ బ్రాండ్ బిఎమ్‌డబ్ల్యూకి చెందిన ద్విచక్ర వాహన విభాగం బిఎమ్‌డబ్ల్యూ మోటారాడ్ తమ సరికొత్త స్ట్రీట్ నేక్డ్ మోటార్‌సైకిల్ ఎస్1000ఆర్ (S1000R) మోడల్‌ను భారత మార్కెట్లో విడుదల చేసింది. కంపెనీ అందిస్తున్న ఎస్1000ఆర్ఆర్‌కు స్ట్రిప్డ్ఆఫ్ వెర్షనే ఇది.

రేస్ వెర్షన్ బిఎమ్‌డబ్ల్యూ ఎస్1000ఆర్ఆర్ బైక్ నుంచి స్ఫూర్తి పొంది దీనిని తయారు చేశారు. ఈ రెండు బైక్‌లు డిజైన్ విషయంలో తప్ప మిగిలిన అన్ని విషయాల్లో సమానంగా ఉంటాయి. ఎస్1000ఆర్ఆర్‌లో ఉపయోగించిన ఫోర్-స్ట్రోక్, 996సీసీ, లిక్విడ్/ఆయిల్-కూల్డ్, ఇన్-లైన్ ఫోర్ సిలిండర్ ఇంజన్‍‌నే ఈ కొత్త ఎస్1000ఆర్‌లోను ఉపయోగించారు.

bmw s 1000 r superbike

కానీ ఈ ఇంజన్ పెర్ఫార్మెన్స్ ఫిగర్స్‌ను మాత్రం రీట్యూన్ చేశారు. ఎస్1000ఆర్ స్ట్రీట్-నేక్డ్ బైక్ కావటంతో, మరింత ఎక్కువ పవర్, టార్క్‌లను ఇచ్చేలా ఈ ఇంజన్‌ను అప్‌ట్యూన్ చేశారు. ఎస్1000ఆర్‌లోని ఇంజన్ 11,000 ఆర్‌పిఎమ్ వద్ద గరిష్టంగా 160 బిహెచ్‌పిల శక్తిని మరియు 9250 ఆర్‌పిఎమ్ వద్ద గరిష్టంగా 11.4 కెజిఎమ్‌ల టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది.

మొత్తం 207 కిలోల బరువు కలిగిన ఈ బైక్‌ను ధృడమైన అల్యూమినియం ఫ్రేమ్‌తో తయారు చేశారు. ఇందులో ముందు వైపు అప్‌సైడ్-డౌన్ టెలిస్కోపిక్ ఫోర్క్, వెనుక వైపు రియర్ మోనోషాక్ సస్పెన్షన్లను ఉపయోగించారు. సమర్థవంతమైన బ్రేకింగ్ కోసం ఇందులో ముందు వైపు 320 మి.మీ. డిస్క్ బ్రేక్, వెనుక వైపు 220 మి.మీ. డిస్క్ బ్రేక్స్‌ను ఉపయోగించారు. ఇందులో స్విచబల్ ఏబిఎస్ (యాంటీ-లాక్ బ్రేకింగ్ సిస్టమ్) స్టాండర్డ్‌గా లభిస్తుంది.

భారత మార్కెట్లో బిఎమ్‌డబ్ల్యూ ఎస్1000ఆర్ మోటార్‌సైకిల్ ధర రూ.22.83 లక్షలు (ఎక్స్-షోరూమ్, ఢిల్లీ)గా ఉంది. ఇది రెడ్, బ్లూ, వైట్ కలర్లలో లభిస్తుంది. బైక్ కలర్‌ను బట్టి వెయటింగ్ పీరియడ్ వారం నుంచి నెల వరకూ ఉంటుంది.

English summary
BMW has been selling vehicles in India for a while now however they do not have a dedicated showroom for their premium and powerful motorbikes. They will sell their CBU (Completely Built Unit) bikes through their car dealers in selected cities. The German automobile giant has officially launched the S1000R in India at a price of INR 26,50,000 in Mumbai.
Story first published: Tuesday, May 20, 2014, 9:03 [IST]

Latest Photos

డ్రైవ్స్పార్క్ నుండి తాజా ఆటో అప్డేట్స్ పొందండి
Telugu Drivespark