రాజ్‌పుతన కస్టమ్స్ కస్టమైజ్డ్ హ్యార్లీ డేవిడ్‌సన్ స్ట్రీట్ 750 'మక్కు'

By Ravi

జైపూర్‌కి చెందిన ప్రముఖ మోటార్‌సైకిల్ కస్టమైజేషన్ హౌస్ 'రాజ్‌పుతన కస్టమ్స్' (Rajputana Customs) నవంబర్ నెలలో జరగనున్న హ్యార్లీ రాక్ రైడర్స్ - సీజన్ 5లో, ఇండియన్ బైక్ ప్రియుల కోసం ఓ ఆకర్షనీయమైన కస్టమ్ కాన్సెప్ట్‌ను ప్రదర్శించనుందని, ఈ బైక్‌ను అమెరికన్ మోటార్‌సైకిల్ కంపెనీ హ్యార్లీ డేవిడ్‌సన్ అందిస్తున్న స్ట్రీట్ 750 మోడల్ ఆధారంగా చేసుకొని తయారు చేస్తారని ఇదివరకటి కథనంలో తెలుగు డ్రైవ్‌స్పార్క్ ప్రచురించిన సంగతి తెలిసినదే.

కాగా.. రాజ్‌పుతన కస్టమ్స్ ఇప్పుడు ఈ కస్టమైజ్డ్ హ్యార్లీ డేవిడ్‌సన్ స్ట్రీట్ 750 బైక్ పనిని పూర్తి చేసింది. ఈ కస్టమైజ్డ్ బైక్‌ని 'మక్కు' (Makku) అని పిలువనున్నారు. రాజ్‌పుతన కస్టమ్స్ తయారు చేసిన ఈ కస్టమైజ్డ్ హ్యార్లీ డేవిడ్‌సన్ స్ట్రీట్ 750 బైక్‌కు సంబంధించిన కొన్ని చిత్రాలను హ్యార్లీ డేవిడ్‌సన్ ఇండియా తమ అధికారిక ఫ్యాన్ పేజ్‌లో పోస్ట్ చేసింది. ఈ బైక్‌కి సంబంధించిన మరింత సమాచారాన్ని ఈ కథనంలో తెలుసుకుందాం రండి.

మరింత సమాచారం తర్వాతి సెక్షన్‌లో.. మరిన్ని వివరాలను ఈ ఫొటో ఫీచర్‌లో పరిశీలించండి..!

కస్టమైజ్డ్ హ్యార్లీ డేవిడ్‌సన్ స్ట్రీట్ 750

తర్వాతి స్లైడ్‌లలో మక్కు అలియాస్ కస్టమైజ్డ్ హ్యార్లీ డేవిడ్‌సన్ స్ట్రీట్ 750 మోడల్‌కి సంబంధించిన సమాచారాన్ని తెలుసుకోండి.

కస్టమైజ్డ్ హ్యార్లీ డేవిడ్‌సన్ స్ట్రీట్ 750

క్రూజర్ స్టయిల్‌లో ఉండే రెగ్యులర్ హ్యార్లీ డేవిడ్‌సన్ స్ట్రీట్ 750 బైక్‌ను రాజ్‌పుతన కస్టమ్స్ కెఫే రేసర్ స్టయిల్‌లో తీర్చిదిద్దింది.

కస్టమైజ్డ్ హ్యార్లీ డేవిడ్‌సన్ స్ట్రీట్ 750

పాపులర్ స్ట్రీట్ 750 మోడల్‌ను ఆధారంగా చేసుకొని తయారు చేసిన ఈ ఆర్గానిక్ అండ్ ఓల్డ్-స్కూల్ ఇన్‌స్పైర్డ్ కస్టమైజ్డ్ బైక్‌ను ఈ నవంబర్ 15-16 తేదీలలో, ముంబైలో జరిగిన హ్యార్లీ రాక్ రైడర్స్ - సీజన్ 5లో ప్రదర్శించారు.

కస్టమైజ్డ్ హ్యార్లీ డేవిడ్‌సన్ స్ట్రీట్ 750

పెద్ద టైర్లు, గోల్డ్ కలర్ అప్ సైడ్ డౌన్ ఫ్రంట్ ఫోర్క్ (రివర్సులో ఉండే ముందు ఫోర్క్), రౌండ్ హెడ్‌ల్యాంప్, కెఫే రేసర్ స్టయిల్ సీట్ వంటి మార్పులను ఇందులో చూడొచ్చు.

కస్టమైజ్డ్ హ్యార్లీ డేవిడ్‌సన్ స్ట్రీట్ 750

బెల్ట్ డ్రైవ్ ఆప్షన్‌తో లభించే ఒరిజినల్ హ్యార్లీ డేవిడ్‌సన్ స్ట్రీట్ 750 మోటార్‌సైకిల్‌ను చైన్ డ్రైవ్‌గా మార్చారు.

కస్టమైజ్డ్ హ్యార్లీ డేవిడ్‌సన్ స్ట్రీట్ 750

ఒరిజినల్ ట్యాంక్ డిజైన్‌ని యధావిధిగా ఉంచారు అయితే, దీని మ్యాట్ ఫినిష్‌లో రీపెయింట్ చేశారు. ఒరిజినల్ ఫ్రేమ్‌లో కొద్దిపాటి మార్పులు చేశారు.

కస్టమైజ్డ్ హ్యార్లీ డేవిడ్‌సన్ స్ట్రీట్ 750

హ్యార్లీ డేవిడ్‌సన్ స్ట్రీట్ 750 బైక్‌ని చేసిన తొలి భారతీయ కస్టమ్ కంపెనీ రాజ్‌పుతన కస్టమ్స్ కావటం విశేషం.

కస్టమైజ్డ్ హ్యార్లీ డేవిడ్‌సన్ స్ట్రీట్ 750

ఈ ఏడాది ఆరంభంలో జరిగిన ఆటో ఎక్స్‌పో 2014లో హ్యార్లీ డేవిడ్‌సన్ ఆవిష్కరించిన స్ట్రీట్ 750, ఓ ప్యూర్, లిక్విడ్-కూల్డ్ బైక్. ఈ బైక్ కోసం కంపెనీ అనేక రకాల కస్టమైజేషన్ ఆప్షన్‌లు కూడా అందుబాటులో ఉంచింది.

Most Read Articles

English summary
Harley Davidson India has shared a few images of its one-off custom Street 750, customised by Jaipur based custom motorcycle house, Rajputana Customs. Rajputana is calling this Brat Café Racer style custom Harley Davidson Street 750 as ‘Makku’ and It was on display at the recently concluded Harley Rock Riders - Season V on November 15-16, 2014 in Mumbai.
Story first published: Monday, November 17, 2014, 16:36 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X