బెంగుళూరు సివిఎస్ మోటార్స్; ఢిఫరెంట్ రాయల్ ఎన్‌ఫీల్డ్ డీలర్

By Ravi

నేను ఇటీవల బెంగుళూరులోని రాయల్ ఎన్‌ఫీల్డ్ డీలర్ సివిఎస్ మోటార్స్ యజమాని మయూరు చంద్రశేఖర్ ఆహ్వానం మేరకు, వారి ప్రత్యేక వార్షికోత్సవ రైడ్‌లో పాల్గొనేందుకు వెళ్లాను.

ఉదయం తెల్లవారుజామున 5.30 గంటలకు సివిఎస్ మోటార్ షోరూమ్ వద్దకు చేరుకోగానే, అప్పటికే అనేక మంది రాయల్ ఎన్‌ఫీల్డ్ బైక్ యజమానులు రైడ్‌కు సిద్ధంగా ఉండటాన్ని గమనించాను. వారిలో కొందరితో పరిచయం అయ్యాక నాకు ఓ విషయం అర్థమైంది. అదేంటంటే, ఆ ట్రూప్‌లోని చాలా మంది సివిఎస్ మోటార్స్ నుంచి రాయల్ ఎన్‌ఫీల్డ్ మోటార్‌సైకిళ్లను కొనుగోలు చేసిన వారేనని.

ఇందులో కొంతమంది బెంగుళూరుకు చెందిన రాయల్ ఎన్‌ఫీల్డ్ ఓనర్స్ క్లబ్ 'థంపర్స్ యునైటెడ్'కు చెందిన వారు కూడా ఉన్నారు. ఈ ట్రూప్‌తో పాటు నేను కూడా రైడ్‌కు సిద్ధమయ్యాను. మేమంతా బెంగుళూరు నుంచి తిరుమల తిరుపతి దేవస్థానానికి బయలుదేరాము. నా జీవితంలో ఈ రైడ్ ఓ మర్చిపోలేని అనుభూతిని మిగిల్చింది. సివిఎస్ మోటార్స్ డీలర్ నిజంగా ఓ కస్టమర్ ఫ్రెండ్లీ డీలర్ అని అర్థమైంది.

బెంగుళూరులో రాయల్ ఎన్‌ఫీల్డ్ బుకింగ్/సర్వీసింగ్ కోసం మేము సివిఎస్ మోటార్స్‌ను ప్రతిపాదిస్తాం. ఆ డీలర్‌షిప్ చిరునామా..

CVS Motors Sales:
Telephone - 080 23618282
Address - 209/1, Upper Palace Orchards,
Bellary Road, Bangalore, Karnataka 5600080

CVS Motors Service:
Telephone - 080 2346 2266
Address - 14, Sankey Road, Next to Hotel Nandhini,
Bangalore, Karnataka 560020

బెంగుళూరు సివిఎస్ మోటార్స్ ట్రిప్

ఒకేసారి అనేక మంది రాయర్ ఎన్‌ఫీల్డ్ మోటార్‌సైకిల్ ప్రియులంతా ఒకేచోట సమావేశం కావటం, గుంపులుగా రైడ్ చేయటమనేది నిజంగా ఓ మర్చిపోలేని అనుభూతి. మరోవైపు ఏడు కొండల వెంటశ్వరుని దర్శనం, అందమైన తిరుమల గిరులపై రైడ్, ఆహ్లాదకరమైన వాతావరణం, సాన్నిహిత్యంగా ఉండే సహచరులు, భగవంతుని దీవెనలతో మా ప్రయాణం చాలా అద్భుతంగా సాగింది.

ఈ సెవన్ హిల్స్ రైడ్‌ను సివిఎస్ మోటార్స్ మరియు థంపర్స్ యునైటెడ్‌లు సంయుక్తంగా నిర్వహించాయి.
బెంగుళూరు సివిఎస్ మోటార్స్ ట్రిప్

అనేకమంది రాయల్ ఎన్‌ఫీల్డ్ డీలర్లు దీర్ఘకాల బుకింగ్స్‌తో సతమతవుతుంటే, సివిఎస్ మోటార్స్ డీలర్ మయూర్ చంద్రశేఖర్ మాత్రం ఇందుకు భిన్నంగా ప్రవర్తిస్తుంటాడు. అందుకే, టైటిల్‌లో డిఫరెంట్ డీలర్ అని పెట్టింది. ఇతను చూపించే వ్యత్యాసం ఏంటంటే, మిగతా రాయల్ ఎన్‌ఫీల్డ్ డీలర్ల మాదిరిగా కేవలం సేల్స్ అండ్ సర్వీస్ వరకు మాత్రమే పరిమితం కాకుండా, రాయల్ ఎన్‌ఫీల్డ్ ప్రియులతో అప్పుడప్పుడూ ఇలాంటి షార్ట్ ట్రిప్‌లను ప్లాన్ చేస్తూ, తన మంచితనంతో కస్టమర్లను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తుంటాడు మయూర్.

వాస్తవానికి మయూర్ కూడా రాయల్ ఎన్‌ఫీల్డ్ ప్రియుడే. ఇతని వద్ద ఓ క్రోమ్ కలర్ రాయల్ ఎన్‌ఫీల్డ్ క్లాసిక్ 500సీసీ బైక్ ఉంది. ఇదిదో ఈ ఫొటోలో బైక్‌ను నడుపుతున్నది మయూర్ చంద్రశేఖరే.

రాయల్ ఎన్‌ఫీల్డ్ క్లాసిక్ 500సీసీ ధర: రూ.1.50 లక్షలు (ఎక్స్-షోరూమ్)

బెంగుళూరు సివిఎస్ మోటార్స్ ట్రిప్

ఈ ట్రిప్‌లో నేను రాయల్ ఎన్‌ఫీల్డ్ క్లాసిక్ 350సీసీ బైక్‌ను రైడ్ చేశాను. రాయల్ ఎన్‌ఫీల్డ్ క్లాసిక్ 350సీసీ ధర: రూ.1.17 లక్షలు (ఎక్స్-షోరూమ్)

రూట్ మ్యాప్: CVS Motors > M.G. Road > Old Madras Road > K.R. Puram hanging bridge > Hoskote > Kolar > Mulbhagal > Palamaner > Chittoor - Kadapa bypass > Tirupati > Tirumala

ఈ రూట్‌లో మొత్తం మేము 550 కిలోమీటర్ల దూరాన్ని కవర్ చేశాం.

బెంగుళూరు సివిఎస్ మోటార్స్ ట్రిప్

ఓయ్ తేరి.. ఈ బైక్‌ని గన్‌లా తయారు చేశారు.. ఇదేమో బుల్లెట్‌లా దూసుకుపోతోంది..!

బెంగుళూరు సివిఎస్ మోటార్స్ ట్రిప్

బైక్ రైడ్, రాయల్ ఎన్‌ఫీల్డ్ అంటే ప్రేమ ఉంటే చాలు, ఇలా ఎంత దూరమైనా ఈ మోటార్‌సైకిళ్లపై ముందుకు సాగిపోవచ్చు. ఈ విషయంలో సివిఎస్ మోటార్స్ చేస్తున్న ప్రయత్నాన్ని మెచ్చుకోక తప్పదు. వచ్చే ఏడాది కూడా సివిఎస్ మోటార్స్ ఈ తరహా లాంగ్ ట్రిప్‌ను ప్లాన్ చేసేందుకు సన్నాహాలు చేస్తోంది. మరి దీనిపై మీ స్పందన ఏంటి..?

Most Read Articles

English summary
I recently had the privilege of being invited by Mayur Chandrashekhar, Owner of CVS Motors, to be a part of a special anniversary ride. CVS Motors is an authorised Royal Enfield showroom located in Sankey road, Bangalore.
Story first published: Monday, April 21, 2014, 19:21 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X