హ్యార్లీ డేవిడ్‌సన్ నుంచి మరో రెండు కొత్త మోటార్‌సైకిళ్లు

అమెరికాకు చెందిన ప్రముఖ లగ్జరీ మోటార్‌సైకిళ్ల తయారీ సంస్థ హ్యార్లీ డేవిడ్‌సన్, ఈ నెలాఖరున భారత మార్కెట్లో రెండు సరికొత్త మోటార్‌సైకిళ్లను విడుదల చేసేందుకు సిద్ధమవుతోంది. బ్రేకవుట్ మరియు సివిఓ లిమిటెడ్ అనే రెండు మోటార్‌సైకిళ్లను హ్యార్లీ డేవిడ్‌సన్ ఇండియా ఆక్టోబర్ 30, 2014వ తేదీన విడుదల చేయనుంది.

హ్యార్లీ డేవిడ్‌సన్ బ్రేకవుట్ మోడల్ కంపెనీ అందిస్తున్న ఫ్యాట్ బాయ్, ఫ్యాట్ బాయ్ స్పెషల్, హెరిటేజే సాఫ్టైల్ క్లాసిక్ వంటి సాఫ్టైల్ ఫ్యామిలీకి చెందినది. ఇకపోతే హ్యార్లీ డేవిడ్‌సన్ సివిఓ (కస్టమ్ వెహికల్ ఆపరేషన్స్) లిమిటెడ్ మోటార్‌సైకిల్ కంపెనీ ప్రత్యేకంగా తయారు చేసిన కస్టమైజ్డ్ మోడల్. ఈ రెండు మోడళ్లలోను ఒకేరకమైన ఇంజన్‌ను ఉపయోగించనున్నారు.


హ్యార్లీ డేవిడ్‌సన్ బ్రేకవుట్ మరియు సివిఓ లిమిటెడ్ మోడళ్లలో 1801సీసీ, ఎలక్ట్రానిక్ సీక్వెన్షనల్ పోర్ట్ ఫ్యూయెల్ ఇంజెక్షన్ సిస్టమ్ కలిగిన ఇంజన్‌ను ఉపయోగించనున్నారు. అయితే, బ్రేకవుట్ మోడల్‌లో ఎయిర్-కూల్డ్, ట్విన్ క్యామ్ 110బి రకం ఇంజన్‌ను, సివిఓ లిమిటెడ్‌లో ట్విన్-కూల్డ్, ట్విన్ క్యామ్ 110 ఇంజన్‌ను ఉపయోగించనున్నారు.
Harley Davidson India Launching Breakout

ఈ రెండు రకాల మోటార్‌సైకిళ్లలో అనేక వ్యత్యాసాలు ఉండనున్నాయి. సివిఓ లిమిటెడ్ మోడల్‌లో 6.5 ఇంచన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ రియు 75 వాట్ ఆడియో సిస్టమ్ లభ్యం కానున్నాయి. ఈ రెండు బైక్‌లకు సంబంధించిన ధరలు మరియు ఇతర వివరాలను కంపెనీ అక్టోబర్ 30, 2014వ తేదీన విడుదల చేయనుంది. లేటెస్ట్ అప్‌డేట్స్ కోసం తెలుగు డ్రైవ్‌స్పార్క్‌ను గమనిస్తూ ఉండండి.
Most Read Articles

English summary
Harley Davidson has informed its fans via Facebook that they would be launching two new models in India on 30th of October. The American manufacturer will be introducing Indians to their CVO Limited and Breakout models.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X