2015 ఇండియా బైక్ వీక్‌లో కస్టమైజ్డ్ హ్యార్లీ డేవిడ్‌సన్ స్ట్రీట్ 750

Written By:

మూడవ ఎడిషన్ ఇండియా బైక్ వీక్ 2015లో అమెరికన్ లగ్జరీ బైక్ మేకర్ హ్యార్లీ డేవిడ్‌సన్ ఓ కస్టమైజ్డ్ మోటార్‌సైకిల్‌ను ప్రదర్శనకు ఉంచనుంది. గడచిన సంవత్సరం నవంబర్ నెలలో జరిగిన హ్యార్లీ రాక్ రైడర్స్ - సీజన్ 5 కోసం, జైపూర్‌కి చెందిన ప్రముఖ మోటార్‌సైకిల్ కస్టమైజేషన్ హౌస్ 'రాజ్‌పుతన కస్టమ్స్' తయారు చేసిన కస్టమైజ్డ్ హ్యార్లీ డేవిడ్‌సన్ స్ట్రీట్ 750 బైక్‌ని ఐబిడబ్ల్యూలో ప్రదర్శించనున్నారు.

హ్యార్లీ డేవిడ్‌సన్ అందిస్తున్న స్ట్రీట్ 750 మోడల్ ఆధారంగా చేసుకొని రాజ్‌పుతన కస్టమ్స్ కెఫే రేసర్ స్టయిల్‌లో ఈ బైక్‌ను కస్టమైజ్ చేశారు. ఈ కస్టమైజ్డ్ బైక్‌ని 'మక్కు' (Makku) అనే ముద్దు పేరుతో పిలువనున్నారు. పెద్ద టైర్లు, గోల్డ్ కలర్ అప్ సైడ్ డౌన్ ఫ్రంట్ ఫోర్క్ (రివర్సులో ఉండే ముందు ఫోర్క్), రౌండ్ హెడ్‌ల్యాంప్, కెఫే రేసర్ స్టయిల్ సీట్ వంటి మార్పులను ఇందులో గమనించవచ్చు.

To Follow DriveSpark On Facebook, Click The Like Button
Harley Davidson To Showcase RCM Street 750 At IBW 2015

కాగా.. మూడవ ఎడిషన్ ఇండియా బైక్ వీక్ 2015 ఫెస్టివల్‌ను గోవాలోని వగతోర్ ప్రాంతం వద్ద ఫిబ్రవరి 20, 2015 మరియు ఫిబ్రవరి 21, 2015 తేదీలలో నిర్వహించనున్నారు. భారత్‌లోని సెవంటీ ఈవెంట్ మీడియా గ్రూప్, ఫాక్స్ లైఫ్ సంస్థలు సంయుక్తంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించనున్నాయి. ఈ ఏడాది ఇండియా బైక్ వీక్‌లో హౌలింగ్ డాగ్ అనే డ్రాగ్ రేస్ ఈవెంట్, డర్ట్ ట్రాక్ ఛాలెంజ్ అనే ఆఫ్-రోడ్ ఈవెంట్ మరియు ఆల్ ఇండియా స్టంట్ ఛాంపియన్‌షిప్ ఫినాలే కార్యక్రమాలు జరగనున్నాయి.

ఇదివరకటి రెండు ఎడిషన్ల ఇండియా బైక్ వీక్‌లతో పోల్చుకుంటే, ఈ ఏడాది జరగనున్న మూడవ ఎడిషన్ ఇండియా బైక్ వీక్‌కు ఎక్కువ స్పందన లభించవచ్చని నిర్వాహకులు భావిస్తున్నారు. ఈ కార్యక్రమాన్ని మా డ్రైవ్‌స్పార్క్ బృందం ప్రత్యక్షంగా కవర్ చేయనుంది. లేటెస్ట్ అప్‌డేట్స్ కోసం తెలుగు డ్రైవ్‌స్పార్క్‌ని గమనిస్తూ ఉండండి.

English summary
Harley Davidson India will showcase its one-off custom Street 750 at India Bike Week 2015, customised by Jaipur based custom motorcycle house, Rajputana Customs.
Story first published: Wednesday, February 18, 2015, 10:23 [IST]
Please Wait while comments are loading...

Latest Photos

డ్రైవ్స్పార్క్ నుండి తాజా ఆటో అప్డేట్స్ పొందండి
Telugu Drivespark