125సీసీ ఇంజన్‌తో వస్తున్న కొత్త హోండా యాక్టివా

By Ravi

భారత ద్విచక్ర వాహన మార్కెట్లో పోటీ రోజు రోజుకు పెరిగిపోతుంది. ఈ పెరుగుతున్న పోటీ వాతావరణాన్ని తట్టుకొని అగ్రస్థానంలో నిలబడాలంటే, కొనుగోలుదారుల అభిరుచులకు అనుగణంగా తయారీదారులు తమ ఉత్పత్తులను, నాణ్యమైన సేవలను ఆఫర్ చేయాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలో, భారతదేశపు ద్వితీయ అగ్రగామి టూవీలర్ కంపెనీ హోండా మోటార్‌సైకిల్ అండ్ స్కూటర్స్ ఇండియా ఇప్పుడ సరికొత్త ఉత్పత్తులతో మార్కెట్లోకి వస్తుంది.

ఇటీవలే తక్కువ ధర కలిగిన యాక్టివా ఐ స్కూటర్ ప్రవేశపెట్టిన హోండా, ఇప్పుడు మరింత శక్తివంతమైన ఇంజన్‌తో కూడిన ప్రీమియం యాక్టివాను ప్రవేశపెట్టేందుకు సిద్ధమవుతోంది. పరిశ్రమ వర్గాల సమాచారం ప్రకారం, హోండా యాక్టివా త్వరలోనే 125సీసీ ఇంజన్‌తో విడుదల కానున్నట్లు తెలుస్తోంది. ఈ సెగ్మెంట్లో సుజుకి యాక్సెస్, స్విష్, వెస్పా వంటి 125సీసీ స్కూటర్లను సవాల్ చేసేలా ఈ కొత్త యాక్టివా 125 ఉండబోతుంది.

హోండా యాక్టివా ఐ ఫీచర్ల కోసం ఈ లింక్‌పై క్లిక్ చేయండి

హోండాకు 125సీసీ స్కూటర్ సెగ్మెంట్లో కూడా ఇదే మొదటి ఉత్పత్తి కావటం విశేషం. కొత్త యాక్టివా 125లో ఫోర్-స్ట్రోక్, ఫోర్స్ ఎయిర్-కూల్డ్, సింగిల్ సిలిండర్ 125సీసీ ఇంజన్‌ను ఉపయోగించనున్నాు. ఇది వేరియేటర్ కంట్రోల్డ్ ఆటోమేటిక్ ట్రాన్సిమిషన్‌తో జతచేయబడనుంది. డిజైన్, ఫీచర్ల పరంగా కూడా ఈ కొత్త యాక్టివాలో కొద్దిపాటి మార్పులు చేర్పులు ఉండనున్నట్లు తెలుస్తోంది. ఈ ఏడాది పండుగ సీజన్‌లో ఈ పవర్‌ఫుల్ యాక్టివా కొనుగోలుదారుల చెంతకు చేరనుంది. లేటెస్ట్ అప్‌డేట్స్ కోసం తెలుగు డ్రైవ్‌స్పార్క్‌ను గమనిస్తూనే ఉండండి.

Honda Activa
Most Read Articles

English summary
According to sources, Honda Motorcycle and Scooter India (HMSI) is planning to launch a powerful version of its Activa scooter with 125cc engine. The new Honda Activa 125 is expected launch during the festive season in this year. Stay tune for latest updates.
Story first published: Wednesday, July 3, 2013, 10:21 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X