Just In
Don't Miss
- News
విమానంలో టాయిలెట్‌కు వెళ్లనివ్వలేదని... డీజీసీఏ ఉద్యోగులను కిడ్నాప్ చేసిన యువకుడు...
- Sports
సెంచరీ చేశాక సెలబ్రేట్ చేసుకోను.. ఎగిరి గంతులేయకుండా..: లబుషేన్
- Finance
30 లోన్ యాప్స్‌కు గూగుల్ షాక్, ప్లేస్టోర్ నుండి తొలగింపు
- Movies
ఝాన్సీ, శ్రీముఖి ఖతం.. ఇప్పుడు సుమ వంతు.. ఇప్పటికైనా ఆ షో గట్టెక్కేనా?
- Lifestyle
సినిమా థియేటర్ కు వెళ్దామనుకుంటున్నారా? అయితే ఈ విషయాలు మీకోసమే...
- Technology
వన్‌ప్లస్ నార్డ్ స్మార్ట్‌ఫోన్ ప్రీ-ఆర్డర్స్ ఇండియాలో జూలై 15 మధ్యాహ్నం 1.30 గంటల నుండి మొదలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
హోండా డియో, డ్రీమ్ నియో మోడళ్లలో రిఫ్రెష్డ్ వెర్షన్స్
హోండా మోటార్‌సైకిల్ అండ్ స్కూటర్ ఇండియా ఈ ఏడాది మొత్తం 15 మోడళ్లను మార్కెట్లో విడుదల చేయనుంది. వీటిలో కొన్ని సరికొత్త మోడళ్లు అలాగే కొన్ని రిఫ్రెష్డ్ మోడళ్లు ఉంటాయి. గడచిన జనవరిలో సరికొత్త సిబి యునికార్న్ 160 బైక్‌ను, ఫిబ్రవరిలో కొత్త యాక్టివా 3జి స్కూటర్‌ను విడుదల చేసిన కంపెనీ, తాజాగా మరో రెండు రిఫ్రెష్డ్ మోడళ్లను విడుదల చేసింది.
యాక్టివా 3జి స్కూటర్‌ని విడుదల చేసినప్పుడు హోండా ప్రదర్శనకు ఉంచిన రిఫ్రెష్డ్ డియో స్కూటర్, డ్రీమ్ నియో మోటార్‌సైకిళ్లను హోండా కస్టమర్లకు అందుబాటులోకి తీసుకువచ్చింది. అప్‌డేటెడ్ డియో స్కూటర్ డ్యూయెల్ టోన్ కలర్ ఆప్షన్లు, రిఫ్రెష్డ్ గ్రాఫిక్స్‌తో లభ్యం కానుంది. ఇంజన్ పరంగా కొత్త హోండా డియో స్కూటర్‌లో ఎలాంటి మార్పులు లేవు. విపణిలో దీని ధర రూ.47,851 (ఎక్స్-షోరూమ్, ఢిల్లీ)గా ఉంది.

ఇక హోండా డ్రీమ్ నియో విషయానికి వస్తే.. ఈ మోటార్‌సైకిల్ బాడీ గ్రాఫిక్స్‌ను కూడా మార్చారు. ఫ్యూయెల్ ట్యాంక్, సైడ్ కౌల్, సైడ్ ప్యానెళ్లపై కొత్త బాడీ గ్రాఫిక్స్, రెడ్ హోండా లోగో, కొత్త లాకబల్ సైడ్ కౌల్ వంటి మార్పులు ఉన్నాయి. డ్యూయెల్ టోన్ బాడీ కలర్ ఆప్షన్ ఇందులో కూడా అందుబాటులో ఉంది. విపణిలో ఈ రిఫ్రెష్డ్ డ్రీమ్ నియో ధర రూ.49,034 (ఎక్స్-షోరూమ్, ఢిల్లీ)గా ఉంది.
కాగా.. ఈ రెండు మోడళ్లలో కాస్మోటిక్ అప్‌గ్రేడ్స్ మినహా ఎలాంటి మెకానికల్ అప్‌గ్రేడ్స్ లేవు. త్వరలోనే రిఫ్రెష్డ్ డ్రీమ్ యుగ, సిబి షైన్ మోడళ్లను మార్కెట్లో విడుదల చేసేందుకు హోండా సన్నాహాలు చేస్తోంది. లేటెస్ట్ అప్‌డేట్స్ కోసం తెలుగు డ్రైవ్‌స్పార్క్‌ని గమనిస్తూ ఉండండి.