పియాజ్జియో ఆటో ఎక్స్‌పో 2014 ప్లాన్స్; కొత్త మోడల్స్

By Ravi

ఇటాలియన్ ఆటోమొబైల్ బ్రాండ్ పియాజ్జియో ఈసారి జరగనున్న ఆటో ఎక్స్‌పో 2014లో మునుపటి కన్నా మరిన్ని సరికొత్త ఉత్పత్తులను భారతీయులకు పరిచయం చేసేందుకు సిద్ధమవుతోంది. ఇందులో భాగంగానే, పియాజ్జియో గడచిన 2012 ఆటో ఎక్స్‌పోలో ఉపయోగించిన స్టాల్ కన్నా రెండింతల పరిమాణం పెద్దగా ఉండేలా 2014 ఆటో ఎక్స్‌పోలో తమ స్టాల్‌ను ఏర్పాటు చేయనుంది.

పియాజ్జియో ఈసారి తమ పాపులర్ వెస్పా స్కూటర్లతో పాటుగా, పాపులర్ ఇటాలియన్ బ్రాండ్స్ అయిన ఆప్రిలియా, మోటో గుజ్జి ఉత్పత్తులను కూడా ప్రదర్శించనుంది.
2012లో జరిగిన ఆటో ఎక్స్‌పోలో పియాజ్జియో ప్రదర్శనకు ఉంచిన మూడు చక్రాల మోటార్ వాహనం ఎమ్‌పి3 ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఈసారి కూడా ప్రత్యేక ఆకర్షణలు మరెన్నో ఉంటాయని అంచనా.

ఫిబ్రవరిలో జరగనున్న 2014 ఢిల్లీ ఆటో ఎక్స్‌పోలో పియాజ్జియో ప్రదర్శించనున్న ఉత్పత్తుల వివరాలేంటో క్రింది ఫొటో ఫీచర్‌లో పరిశీలించండి.

పియాజ్జియో ఆటో ఎక్స్‌పో 2014 ప్లాన్స్

పియాజ్జియో ఆటో ఎక్స్‌పో 2014 ప్లాన్స్

ముందుగా.. పియాజ్జియో తమ పాపులర్ వెస్పా స్కూటర్లను ఇక్కడి మార్కెట్‌కు పరిచయం చేయనుంది. అయితే, గడచిన 2012 ఆటో ఎక్స్‌పో మాదిరిగా ఈసారి ఎలాంటి వెస్పా స్కూటర్లను విడుదల చేయబోదని తెలుస్తోంది.

వెస్పా ఎస్

వెస్పా ఎస్

అయితే, గత కొద్ది కాలంగా పెండింగ్‌లో వెస్పా ఎస్ మోడల్‌ను మాత్రం ఫిబ్రవరి 3వ వారంలో కానీ లేదా 4వ వారంలో కానీ కంపెనీ విడుదల చేసే అవకాశం ఉంది.

వెస్పా ఎస్

వెస్పా ఎస్

ఈ స్పోర్ట్ వెర్షన్ వెస్పా ఎస్ మోడల్‌లో ప్రస్తుతం ఎల్ఎక్స్125, విఎక్స్125 మోడళ్లలో ఉపయోగిస్తున్న 125సీసీ ఇంజన్‌నే ఇందులోను ఉపయోగించనున్నారు. కానీ, డిజైన్ ఫీచర్లు మాత్రం ఈ రెండు స్కూటర్ల కన్నా భిన్నంగా ఉంటాయి.

వెస్పా ఎస్ స్కూటర్‌కు సంబంధించిన పూర్తి సమాచారం కోసం ఈ లింక్‌పై క్లిక్ చేయండి.

 

వెస్పా 946
 

వెస్పా 946

కాగా.. అతికొద్ది కాలంలోనే ప్రపంచం వ్యాప్తంగా పాపులర్ అయిన వెస్పా 946 మోడల్‌ను భారత మార్కెట్లో విడుదల చేసే అంశంపై కంపెనీ ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. పియాజ్జియో ఇందుకు తగిన సమయం కోసం ఎదురచూస్తోంది.

వెస్పా 946 స్కూటర్‌కు సంబంధించిన పూర్తి సమాచారం కోసం ఈ లింక్‌పై క్లిక్ చేయండి.

 

వెస్పా ప్రైమావెరా

వెస్పా ప్రైమావెరా

పియాజ్జియో ఈ నాలుగు మోడళ్లతో పాటుగా (ఎల్ఎక్స్125, విఎక్స్125, వెస్పా ఎస్, 946) ప్రపంచ వ్యాప్తంగా పాపులర్ అయిన వెస్పా ప్రైమావెరా వంటి ఇటాలియన్ స్కూటర్లను కూడా 12వ ఎడిషన్ ఆటో ఎక్స్‌పోలో విడుదల చేసే అవకాశం ఉంది.

వెస్పా ప్రైమావెరాకు సంబంధించిన పూర్తి సమాచారం కోసం ఈ లింక్‌పై క్లిక్ చేయండి.

 

ఆప్రిలియా

ఆప్రిలియా

అలాగే, పియాజ్జియో తమ ఆప్రిలియా బ్రాండ్‌ను కూడా ఆటో ఎక్స్‌పోలో ప్రదర్శించనుంది. ఇందులో ఆప్రిలియా ఆర్ఎస్‌వి4 సూపర్‌బైక్‌ను విడుదల చేయనున్నారు.

మోటో గుజ్జి కాలిఫోర్నియా 1400

మోటో గుజ్జి కాలిఫోర్నియా 1400

ఇకపోతే మోటో గుజ్జి బ్రాండ్ క్రింద కాలిఫోర్నియా 1400 మోడల్‌ను మరియు బెల్లాజ్జియా మోటార్‌సైకిల్‌ను ప్రదర్శించనుంది.

మోటో గుజ్జి బెల్లాజ్జియో

మోటో గుజ్జి బెల్లాజ్జియో

మోటో గుజ్జి బెల్లాజ్జియో బైక్‌కు సంబంధించిన పూర్తి సమాచారం కోసం ఈ లింక్‌పై క్లిక్ చేయండి.

 
Most Read Articles
English summary
Piaggio Vehicles plans to display its global portfolio and engineering capabilities at the Auto Expo 2014 next month. The company has planned a big line-up of products ranging from brands such as Vespa scooters to other Italian marques Aprilia and Moto Guzzi.
Please Wait while comments are loading...
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X