అమెరికా, బ్రిటన్‌ల కోసం 750సీసీ రాయల్ ఎన్‌ఫీల్డ్ బైక్స్

By Ravi

ఇటీవలే కెఫే రేసర్ స్టైల్ బైక్ 'కాంటినెంటల్ జిటి'ని విడుదల చేసి ప్రపంచం దృష్టిని ఆకట్టుకున్న మన భారతీయ పురాతన మోటార్‌సైకిల్ కంపెనీ రాయల్ ఎన్‌ఫీల్డ్, ఇప్పుడు అమెరికా, బ్రిటన్ మార్కెట్ల కోసం 750సీసీ మోటార్‌సైకిళ్లను తయారు చేసేందుకు సిద్ధమైంది.

రాయల్ ఎన్‌ఫీల్డ్ బ్రాండ్‌కు ప్రపంచ వ్యాప్తంగా డిమాండ్ అధికమవుతున్న నేపథ్యంలో, ప్రస్తుతం కంపెనీ అందిస్తున్న 500సీసీ మోటార్‌సైకిళ్లకు ఎగువన పెద్ద ఇంజన్‌తో కూడిన హైపెర్ఫామెన్స్ ప్రీమియం మోటార్‌సైకిళ్ల తయారీపై కంపెనీ దృష్టి సారించింది.

Royal Enfield To Build 750cc Motorcycles

ఈ దశాబ్ధం చివరి వరకు తమ దృష్టంతా ప్రధానంగా మిడ్-సైజ్ మోటార్‌సైకిళ్లపైనే ఉంటుందని రాయల్ ఎన్‌ఫీల్డ్ పేర్కొంది. ఈ మోటార్‌సైకిల్ బ్రాండ్ మాతృ సంస్థ అయిన ఐషర్, కేవలం ఈ బ్రాండ్ ఉత్పత్తి సామర్థ్యాన్ని పెంచడానికే కాకుండా, ఈ డివిజన్ యొక్క రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్‌ను మరింత పటిష్టం చేసుకునేందుకు కూడా రానున్న రెండేళ్ల పాటు రూ.600 కోట్ల పెట్టుబడి వెచ్చించనున్నట్లు ప్రకటించింది.

అయితే, భారతీయ రాయల్ ఎన్‌ఫీల్డ్ బైక్ ప్రియులకు నిరుత్సాహం కలిగించే విషయం ఏంటంటే, కంపెనీ తయారు చేయనున్న పెద్ద ఇంజన్‌తో కూడిన ఈ హై పెర్ఫార్మెన్స్ మోటార్‌సైకిళ్లు కేవలం యూకె, యూఎస్ మార్కెట్ల కోసం మాత్రమే కావటం. ప్రస్తుతానికి ఇవి దేశీయ విపణిలో విడుదలయ్యే అవకాశాలు ఏ కోశానా కనిపించడం లేదు. ఈ రెండు ప్రాంతాల్లో ఉండే బైక్ ప్రియులు సరసమైన ధరకే లభ్యమయ్యే ఆర్ఈ బైక్‌లను ఎక్కువగా ఆదరిస్తారని కంపెనీ ఆశిస్తోంది.

Most Read Articles

English summary
Royal Enfield has confirmed that its focus will be on mid-sized motorcycles until the end of this decade and parent company Eicher has already announced plans to invest INR 600 crores in the next two years to not just increase production, but also to strengthen its research and development division.
Story first published: Saturday, February 15, 2014, 15:20 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X