రాయల్ ఎన్‌ఫీల్డ్ కాంటినెంటల్ జిటి ఇప్పుడు నలుపు రంగులో లభ్యం

By Ravi

భారతదేశపు పురాతన ద్విచక్ర వాహన తయారీ సంస్థ రాయల్ ఎన్‌ఫీల్డ్ గడచిన 2013లో దేశీయ విపణిలో విడుగల చేసిన కెఫే రేసర్ స్టైల్ మోటార్‌సైకిల్ 'కాంటినెంటల్ జిటి'లో కంపెనీ ఇప్పుడు మరో కొత్త కలర్ ఆప్షన్‌ను ప్రవేశపెట్టింది. తాజా కలర్ ఆప్షన్ చేరికతో ఈ మోడల్ మొత్తం కలర్ ఆప్షన్ల సంఖ్య మూడుకి చేరింది.

ఇప్పుడు రాయల్ ఎన్‌ఫీల్డ్ కాంటినెంటల్ జిటి రెడ్, యల్లో, బ్లాక్ కలర్లలో లభ్యం కానుంది. రాయల్ ఎన్‌ఫీల్డ్ తమ కాంటినెంటల్ జిటి మోటార్‌సైకిల్‌ని 1960వ దశకానికి చెందిన పురాతన బ్రిటీష్ జిటి బైక్‌ల నుంచి స్ఫూర్తి పొంది డిజైన్ చేసింది. కంపెనీ 60 ఏళ్ల చరిత్రలో ఇది తొలి కాంటినెంటల్ జిటి మోటార్‌సైకిల్ కావటం విశేషం.

బ్లాక్ కలర్ రాయల్ ఎన్‌ఫీల్డ్ కాంటినెంటల్ జిటి మోటార్‌సైకిల్ ధరలో ఎలాంటి మార్పు లేదు. ఇతర కలర్ మోడళ్ల మాదిరిగానే ఇది కూడా అదే ధరకు లభ్యం కానుంది. ఈ బైక్‌కి సంబంధించిన మరిన్ని వివరాలను ఈ కథనంలో తెలుసుకుందాం రండి..!

రాయల్ ఎన్‌ఫీల్డ్ కాంటినెంటల్ జిటి ఇప్పుడు నలుపు రంగులో లభ్యం

రాయల్ ఎన్‌ఫీల్డ్ కాంటినెంటల్ జిటి మోటార్‌సైకిల్‌‌లో 535సీసీ, సింగిల్ సిలిండర్, 4-స్ట్రోక్, ఎయిర్-కూల్డ్ ఇంజన్‌ను ఉపయోగించారు. ఈ ఇంజన్ 5100 ఆర్‌పిఎమ్ వద్ద 29.1 బిహెచ్‌పిల శక్తిని, 4000 ఆర్‌పిఎమ్ వద్ద 44 న్యూటన్ మీటర్ల టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఇది 5-స్పీడ్ మ్యాన్యువల్ ట్రాన్సిమిషన్‌తో అనుసంధానం చేయబడి ఉంటుంది.

రాయల్ ఎన్‌ఫీల్డ్ కాంటినెంటల్ జిటి ఇప్పుడు నలుపు రంగులో లభ్యం

ఇందులో కొత్త ట్విన్ డౌన్‌ట్యూబ్ ఫ్రేమ్‌ను (ఇంజన్‌ను అమర్చే ఫ్రేమ్)ను ఉపయోగించారు. ఈ ఫ్రేమ్‌తో తయారవుతున్న ఏకైక రాయల్ ఎన్‌ఫీల్డ్ బైక్ కూడా కాంటినెంటల్ జిటినే కావటం మరొక విశేషం. ఈ ఫ్రేమ్‌ను ప్రత్యేకించి కాంటినెంటల్ జిటి కోసం యూకెకు చెందిన హ్యారిస్ పెర్ఫామెన్స్ సహకారంతో కలిసి కంపెనీ తయారు చేశారు.

రాయల్ ఎన్‌ఫీల్డ్ కాంటినెంటల్ జిటి ఇప్పుడు నలుపు రంగులో లభ్యం

కెఫే రేసర్ స్టైల్‌లో కనిపించే ఈ బైక్‌‌లో స్లంగ్ క్లిప్-ఆన్ హ్యాండిల్‌బార్స్, స్ట్రైట్ సీట్, విశిష్టమైన 13.5 లీటర్ పెట్రోల్ ట్యాంక్‌తో ఇది కాంపాక్ట్ రైడింగ్ పొజిషన్‌లో కూర్చునేందుకు సహకరిస్తుంది. ఇందులోని 41 మి.మీ. ఫ్రంట్ ఫోర్క్ 110 మి.మీ. ట్రావెల్‌ను కలిగి ఉంటుంది. వెనుక వైపు 80 మి.మీ. ట్రావెల్‌తో కూడిన రెండు గ్యాస్ ఛార్జ్‌డ్ షాక్స్‌ను అమర్చారు. పైయోలీ నుంచి గ్రహించిన ఈ షాక్స్ ప్రీలోడ్ అడ్జస్ట్‌ను కలిగి ఉంటాయి.

రాయల్ ఎన్‌ఫీల్డ్ కాంటినెంటల్ జిటి ఇప్పుడు నలుపు రంగులో లభ్యం

ఈ బైక్‌లో ఉపయోగించిన బ్రేక్స్‌ను బ్రెమ్బూ నుంచి గ్రహించారు. ముందు వైపు రెండు 300 మి.మీ. డిస్క్ మరియు 2 పిస్టన్ కాలిపర్ అలాగే వెనుక వైపు 240 మి.మీ. డిస్క్ మరియు సింగిల్ కాలిపర్‌ను అమర్చారు. కాంటినెంటల్ జిటిలో ఉపయోగించిన టైర్లను పీరెల్లీ స్పోర్ట్ డెమాన్ నుంచి గ్రహించారు. పూర్తి ట్యాంకుతో కలిపి దీని బరువు 184 కేజీలు. రాయల్ ఎన్‌ఫీల్డ్ నుంచి లభ్యమవుతున్న 500సీసీ బైక్‌లలో కెల్లా ఇదే అత్యంత తేలికైనది.

రాయల్ ఎన్‌ఫీల్డ్ కాంటినెంటల్ జిటి ఇప్పుడు నలుపు రంగులో లభ్యం

భారత మార్కెట్లో రాయల్ ఎన్‌ఫీల్డ్ కాంటినెంటల్ జిటి మోటార్‌సైకిల్ ధర రూ.1.93 లక్షలు (ఎక్స్-షోరూమ్, ముంబై)గా ఉంది.

Most Read Articles

English summary
The Continental GT is one of the most popular and modern motorcycles from Royal Enfield. During its launch it was available in a single colour and a special colour was offered to international markets. Now the two-wheeler manufacturer will be offering three colours to Indian buyers Red, Yellow and Black.
Story first published: Friday, March 6, 2015, 14:11 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X