రాయల్ ఎన్‌ఫీల్డ్ మోటార్‌సైకిళ్లు ఇప్పుడు కొత్త కలర్లలో లభ్యం

By Ravi

ఐషర్ మోటార్స్‌కి చెందిన ప్రముఖ ద్విచక్ర వాహన తయారీ కంపెనీ రాయల్ ఎన్‌ఫీల్డ్ ఈ ఏడాది మే నెలలో తమ బ్రాండ్ లోగో, క్రెస్ట్, బ్యాడ్జ్ మరియు మోనోగ్రామ్‌లను మార్చిన సంగతి తెలిసినదే. ఆ సమయంలో కంపెనీ కొన్ని రాయల్ ఎన్‌ఫీల్డ్ మోటార్‌సైకిళ్ల కలర్లను కూడా మార్చడం జరిగింది. క్లాసిక్, థండర్‌బర్డ్ రేంజ్ మరియు బుల్లెట్ ఎలక్ట్రా మోటార్‌సైకిళ్లలో కంపెనీ కొత్త కలర్ ఆప్షన్లను పరిచయం చేసింది.

కాగా.. రాయల్ ఎన్‌ఫీల్డ్ తాజాగా మరికొన్ని మోడళ్లలో కొత్త కలర్ ఆప్షన్లను ప్రవేశపెట్టింది. రాయల్ ఎన్‌ఫీల్డ్ క్లాసిక్ 30 మోటార్‌సైకిల్ ఇప్పుడు కొత్త బ్లూ కలర్ షేడ్‌లో లభిస్తుంది. అలాగే క్లాసిక్ 500 మోడల్‌లో మెరూన్ స్ట్రైప్‌తో కూడిన వైట్ కలర్‌ను కూడా ప్రవేశపెట్టింది.

Bullet 500 Green

ఇకపోతే, రాయల్ ఎన్‌ఫీల్డ్ థండర్‌బర్డ్ 350 మరియు థండర్‌బర్డ్ 500 క్రూజర్ మోటార్‌సైకిళ్లు బ్లూ కలర్ షేడ్‌లో లభ్యం కానున్నాయి. రాయల్ ఎన్‌ఫీల్డ్ బుల్లెట్ 500లో కొత్త డార్క్ గ్రీన్ కలర్ ఆప్షన్‌ను కూడా ప్రవేశపెట్టారు.

కొత్త కలర్ల కోసం కస్టమర్లు ఎలాంటి అదనపు మొత్తాన్ని చెల్లించాల్సిన అవసరం లేదు. ఇదివరకటి ధరలకే ఇవి లభిస్తాయి. అలాగే, ఈ మోడళ్లలో కేవలం కలర్ మార్పు తప్ప ఇంజన్‌లో ఎలాంటి మార్పులు లేవు. ఇందులో ఇదివరకటి 350సీసీ, 500సీసీ యూనిట్ కన్సట్రక్షన్ ఇంజన్లనే ఉపయోగించారు. లేటెస్ట్ అప్‌డేట్స్ కోసం తెలుగు డ్రైవ్‌స్పార్క్‌ను గమనిస్తూ ఉండండి.

Most Read Articles

English summary
Royal Enfield recently gave itself a brand overhaul in the form of a new logo, crest, badges and monogram. The two-wheeler company clearly wasn't finished as it has now introduced its products in fresh new colours.
Story first published: Monday, September 22, 2014, 10:41 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X