ఆటో ఎక్స్‌పో 2014: టెర్రా ఎలక్ట్రిక్ స్కూటర్ ఆవిష్కరణ

By Ravi

జపాన్‌కు చెందిన ప్రముఖ ఎలక్ట్రిక్ వాహనాల తయారీ సంస్థ టెర్రా మోటార్స్ గడచిన సంవత్సరం జులై నెలలో గ్లోబల్ మార్కెట్లలో ఆవిష్కరించిన 'టెర్రా ఏ4000ఐ' (Terra A4000i) అనే ఓ అధునాతన ఎలక్ట్రిక్ స్కూటర్‌ను కంపెనీ భారత్‌కు పరిచయం చేసింది. ఇటీవల ముగిసిన 2014 ఢిల్లీ ఆటో ఎక్స్‌పోలో కంపెనీ ఈ ఎలక్ట్రిక్ స్కూటర్‌ను ప్రదర్శించింది.

టెర్రా ఏ4000ఐ ఎలక్ట్రిక్ స్కూటర్‍‌తో పాటుగా కంపెనీ ఇటీవలే విడుదల చేసిన 'టెర్రా కివామీ' (Terra Kiwami) ఈ 1000సీసీ ఎలక్ట్రిక్ సూపర్‌బైక్‌ను మరియు ఓ ఎలక్ట్రిక్ త్రీవలర్‌ను కూడా కంపెనీ ఈ 125వ ఎడిషన్ ఆటో ఎక్స్‌పోలో ప్రదర్శనకు ఉంచింది. భారత్‌లో ఇదే మొట్టమొదటి 1000సీసీ ఎలక్ట్రిక్ సూపర్‌బైక్‌ కావటం విశేషం.

టెర్రా ఏ4000ఐ ఎలక్ట్రిక్ స్కూటర్‍‌కు సంబంధించిన మరింత సమాచారాన్ని క్రింది ఫొటో ఫీచర్‌లో పరిశీలించండి.

టెర్రా ఏ4000ఐ ఎలక్ట్రిక్ స్కూటర్‍

జపాన్‌కు చెందిన ప్రముఖ ఎలక్ట్రిక్ వాహనాల తయారీ సంస్థ టెర్రా మోటార్స్ తమ 'టెర్రా ఏ4000ఐ' (Terra A4000i) అనే ఓ అధునాతన ఎలక్ట్రిక్ స్కూటర్‌ను 2014 ఢిల్లీ ఆటో ఎక్స్‌పోలో ఆవిష్కరించింది.

టెర్రా ఏ4000ఐ ఎలక్ట్రిక్ స్కూటర్‍

ఈ స్కూటర్‌ను ఐఫోన్ సాయంతో కనెక్ట్ చేసుకోవచ్చు. ఇన్‌స్ట్రుమెంట్ కన్సోల్‌లో ఐఫోన్‌ను ఫిక్స్ చేయటం ద్వారా బ్యాటరీ స్టేటస్, బ్యాటరీ ఖర్చయ్యే రేటు, ప్రయాణించే వేగం, మిగిలి ఉన్న బ్యాటరీతో ఎంత దూరం ప్రయాణించవచ్చు వంటి అనేక సాంకేతిక వివరాలను ఐఫోన్ సాయంతో తెలుసుకోవచ్చు.

టెర్రా ఏ4000ఐ ఎలక్ట్రిక్ స్కూటర్‍

అంతేకాకుండా, టెర్రా ఏ4000ఐ స్కూటర్ ఇన్‌స్ట్రుమెంట్ ప్యానెల్‌లో అమర్చిన ఐఫోన్ జిపిఎస్ నావిగేటర్ మాదిరిగా కూడా పనిచేసి, దిశానిర్ధేశం చేస్తుంది.

టెర్రా ఏ4000ఐ ఎలక్ట్రిక్ స్కూటర్‍

ప్రస్తుతానికి ఈ స్కూటర్ ఐఫోన్లను మాత్రమే సపోర్ట్ చేస్తుంది. అయితే, త్వరలోనే అన్ని రకాల స్మార్ట్‌ఫోన్లతో పనిచేసేలా ఈ ఎలక్ట్రిక్ స్కూటర్‌ను అప్‌గ్రేడ్ చేయనున్నట్లు కంపెనీ పేర్కొంది.

టెర్రా ఏ4000ఐ ఎలక్ట్రిక్ స్కూటర్‍

త్వరలోనే టెర్రా ఏ4000ఐ ఎలక్ట్రిక్ స్కూటర్ మరియు టెర్రా కివామీ సూపర్‌బైక్‌లను భారత మార్కెట్లో వాణిజ్యం పరంగా విడుదల చేస్తామని కంపెనీ పేర్కొంది.

టెర్రా ఏ4000ఐ ఎలక్ట్రిక్ స్కూటర్‍

టెర్రా ఏ4000ఐ ఎలక్ట్రిక్ స్కూటర్‌ 48 వోల్ట్ లిథియం అయాన్ బ్యాటరీ సాయంతో నడుస్తుంది. ఈ బ్యాటరీ జీవిత కాలం 50,000 కి.మీ. ఇది కేవలం 4.5 గంటల సమయంలోనే పూర్తిగా చార్జ్ అవుతుంది.

టెర్రా ఏ4000ఐ ఎలక్ట్రిక్ స్కూటర్‍

పూర్తి చార్జ్‌పై 65 కి.మీ. దూరం ప్రయాణించవచ్చు. గరిష్ట వేగం గంటకు 65 కి.మీ., సగటు వేగం గంటకు 48 కి.మీ.

టెర్రా ఏ4000ఐ ఎలక్ట్రిక్ స్కూటర్‍

ఈ స్కూటర్‌కు ముందు, వెనుక వైపు డిస్క్ బ్రేక్‌లను అమర్చారు. దీని మొత్తం బరువు 118 కేజీలు (బ్యాటరీ బరువు 16 కేజీలు).

టెర్రా ఏ4000ఐ ఎలక్ట్రిక్ స్కూటర్‍

భారత మార్కెట్లో ఈ స్కూటర్ ధర సుమారు రూ.2 లక్షల వరకు ఉండొచ్చని అంచనా.

Most Read Articles

English summary
Japanese electric scooters manufacturer Terra Motors has unveiled its A4000i, an electric scooter at 2014 Auto Expo. This electric scooter can be connected to an iPhone, which will then serve navigation and scooter-status purposes.
Story first published: Thursday, February 13, 2014, 10:11 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X