ఆటో ఎక్స్‌పో 2014: టాప్ 5 కాన్సెప్ట్ బైక్స్

By Ravi

ఇటీవలే గ్రేటర్ నోయిడాలో జరిగిన 2014 ఆటో ఎక్స్‌పోలో పలు దేశీయ, అంతర్జాతీయ ద్విచక్ర వాహనా తయారీ సంస్థ తమ మోడ్రన్ కాన్సెప్ట్ బైక్‌లతో బైక్ ప్రియులను ఆకట్టుకున్నాయి. ఇందులో కొన్ని మాత్రమే చూపరుల దృష్టిని ఆకట్టుకోగలిగాయి.

ఈ కథనంలో ఆటో ఎక్స్‌పో 2014 నుంచి టాప్ 5 కాన్సెప్ట్ బైక్‌ల గురించి తెలుసుకుందాం రండి..!

(తయారీదారులు తమ టెక్నాలజీ మరియు డిజైన్ ప్లాన్‌ను పరిచయం చేసేందుకు పరిమిత సంఖ్యలో లేదా ఏకైక మోడల్‌గా తయారు చేసే ఉత్పత్తినే కాన్సెప్ట్ అంటాం. ఇందులో కొన్ని కాన్సెప్ట్‌లు ఉత్పత్తి దశకు చేరుకోవచ్చు, మరికొన్ని ఆ దశలోనే మిగిలిపోవచ్చు. కాన్సెప్ట్ మోడళ్లకు లభించే స్పందనను బట్టి, సదరు కాన్సెప్ట్‌లను ఉత్పత్తి దశకు తీసుకువెళ్లాలా వద్దా అని తయారీదారులు నిర్ణయం తీసుకుంటారు. అయితే, కాన్సెప్ట్‌లోని అన్ని ఫీచర్లు ప్రొడక్షన్ మోడల్‌లో ఉంటాయన్న గ్యారంటీ లేదు.)

నెం.1: హీరో హస్టర్

నెం.1: హీరో హస్టర్

బోరింగ్ స్ప్లెండర్, ప్యాషన్ వంటి బడ్జెట్ మోటార్‌సైకిళ్లే కాకుండా మోడ్రన్ బైక్‌లను సైతం కస్టమర్లకు ఆఫర్ చేయగలమని చెబుతూ, దేశపు అగ్రగామి టూవీలర్ కంపెనీ ఆవిష్కరించిన 620సీసీ ప్రీమియం మోటార్‌సైకిల్ కాన్సెప్ట్ 'హీరో హస్టర్' అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. ఎవ్వరూ ఊహించని రీతిలో హీరో మోటోకార్ప్ తయారు చేసిన ఈ బైక్ గరిష్ట వేగం గంటకు 240 కిలోమీటర్లు.

నేక్డ్ స్ట్రీట్ బైక్ స్టయిల్‌లో కనిపించే హీరో హస్టర్ బైక్‌లో 620సీసీ వాటర్-కూల్డ్ పారలల్ ట్విన్ ఇంజన్‌ను ఉపయోగించారు. ఈ ఇంజన్ గరిష్టంగా 9600 ఆర్‌పిఎమ్ వద్ద 80 పిఎస్‌ల శక్తిని ఉత్పత్తి చేస్తుంది. దీని మొత్తం బరువు 159.7 కేజీలు. ఇది కేవలం 3.8 సెకండ్ల వ్యవధిలోనే 0-100 కిలోమీటర్ల వేగాన్ని అందుకుటుంది.

నెం.2: యమహా ఆర్25

నెం.2: యమహా ఆర్25

స్పోర్ట్స్ బైక్‌ల విషయంలో యమహా ఎల్లప్పుడూ సర్‌ప్రైజ్‌లను ఇస్తూ ఉంటుంది. అలాంటి సర్‌ప్రైజే ఈ ఆర్25 కాన్సెప్ట్. ఇది ఉత్పత్తి దశకు చేరుకోవటానికి 2015 వరకు సమయం పట్టవచ్చు. ఇది చూడటానికి లొరెంజో మోటోజిపి బైక్‌కు స్మాలర్ వెర్షన్‌గా అనిపిస్తుంది. ఇందులో ట్విన్ సిలిండర్ ఇంజన్ ఉంటుంది. ఈ కాన్సెప్ట్ బైక్‌కు సంబంధించిన మరిన్ని వివరాలను కంపెనీ వెల్లడించలేదు.

నెం.3: టీవీఎస్ డ్రాకెన్

నెం.3: టీవీఎస్ డ్రాకెన్

స్ట్రీట్ ఫైటర్ స్టైల్‌లో టీవీఎస్ స్వంతంగా అభివృద్ధి చేసిన డ్రాకెన్ కాన్సెప్ట్ బైక్, ఆటో ఎక్స్‌పో 2014లోని టీవీఎస్ స్టాల్‌లో సెంటర్ ఆఫ్ అట్రాక్షన్‌గా నిలిచింది. దీనిని టీవీఎస్ గతంలో ఆవిష్కరించిన స్ట్రీట్ ఫైటర్ కాన్సెప్ట్ నుంచి స్ఫూర్తి పొంది తయారు చేసినట్లుగా అనిపిస్తుంది. ఇందులో 250సీసీ ఇంజన్‌ను ఉపయోగించనున్నారు. ఇంజన్ పెర్ఫామెన్స్ వివరాలను కంపెనీ వెల్లడించలేదు. భవిష్యత్తులోని అపాచే మోడళ్లలో కూడా ఇదే ఇంజన్‌ను ఉపయోగించవచ్చని సమాచారం.

నెం.4: హోండా సిఎక్స్-01

నెం.4: హోండా సిఎక్స్-01

ఆటో ఎక్స్‌పో 2014లో బైక్ ప్రియుల మది దోచుకున్న బైక్ 'హోండా సిఎక్స్-01 కాన్సెప్ట్'. కమ్యూటర్ బైక్‌ను, స్పోర్టీ ఆఫ్-రోడర్‌ను కలిపి తయారు చేసిన బైక్ ఇది. నేటి ఆధునిక యువతను దృష్టిలో ఉంచుకొని జపనీస్ మోటార్‌సైకిల్ కంపెనీ హోండా ఈ సరికొత్త హోండా సిఎక్స్-01 కాన్సెప్ట్‌ను అభివృద్ధి చేసింది.

ఇది కాంపాక్ట్ డిజైన్‌ను కలిగి ఉండి సిటీ ట్రాఫిక్‌లో చకచకా దూసుకుపోయేందుకు సహకరిస్తుంది. అలాగే దీని హై గ్రౌండ్ క్లియరెన్స్ నిర్మాణం మరియు సస్పెన్షన్ సిస్టమ్ వలన ఆఫ్-రోడ్లపై సైతం అడ్వెంచర్ల చేసేందుకు సహకరిస్తుంది. ఇందులో ఎల్ఈడి డిస్‌ప్లే, అప్‌సైడ్ డౌన్ ఫోర్క్స్, డ్యూయెల్ ఎగ్జాస్ట్ అవుట్‌లెట్స్, వెనుక వైపు మోనోషాక్ సస్పెన్షన్, ఫ్రంట్ అండ్ రియర్ డిస్క్ బ్రేక్స్‌ను జోడించారు.

నెం.5: పల్సర్ సిఎస్400

నెం.5: పల్సర్ సిఎస్400

స్ట్రీట్ ఫైటర్ లుక్‌ని కలిగి ఉండే ఈ సరికొత్త తరం పల్సర్‌లో 375సీసీ ఇంజన్‌ను ఉపయోగించారు. ఇది కంపెనీ యొక్క పాపులర్ ట్రిపుల్ స్పార్క్ టెక్నాలజీతో లభిస్తుంది. పల్సర్ సిఎస్400 పేరులో సిఎస్ అంటే క్రూజర్ స్పోర్ట్స్ అని అర్థం. కెటిఎమ్ 390లో ఉపయోగించిన కాంపోనెంట్లను ఇందులోను ఉపయోగించే ఆస్కారం ఉంది. దీని ధర రూ.2 లక్షలకు దిగువన ఉండొచ్చని అంచనా.

Most Read Articles

English summary
The recent Auto Expo was filled with launches and facelifts, however among all the ruckus there were concepts of the future.Here is our top 5 of the best concept bikes at Auto Expo 2014. We expect these bikes to come soon and hope they look identical as showcased here.
Story first published: Monday, February 17, 2014, 19:02 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X