టీవీఎస్-బిఎమ్‌డబ్ల్యూ మోటార్‌సైకిల్ ఒక 300సీసీ స్ట్రీట్ బైక్!
చెన్నై కేంద్రంగా పనిచేస్తున్న టీవీఎస్ మోటార్ కంపెనీ మరియు జర్మనీకి చెందిన ప్రముఖ లగ్జరీ మోటార్‌సైకిళ్ల తయారీ కంపెనీ బిఎమ్‍డబ్ల్యూ మోటారాడ్‌లు కలిసి భారత్ వంటి అభివృద్ధి చెందుతున్న మార్కెట్ల కోసం ఓ లో-కాస్ట్ ప్రీమియం మోటార్‌సైకిల్‌ను తయారు చేస్తున్న సంగతి తెలిసినదే. ఈ మేరకు ఇప్పటికే ఇరు సంస్థల మధ్య ఓ ఒప్పందం కూడా కుదిరింది.
తాజాగా ఈ ఇరు కంపెనీల ప్రాజెక్ట్‌కు సంబంధించి ఓ రూమర్ గుప్పుమంది. టీవీఎస్-బిఎమ్డబ్ల్యూ సంస్థలు సంయుక్తంగా తయారు చేస్తున్నది ఓ 300సీసీ స్ట్రీట్ బైక్ అనే వార్తలు వినిపిస్తున్నాయి. ఈ టీవీఎస్-బిఎమ్‍డబ్ల్యూ జాయింట్ వెంచర్ నుంచి రానున్న తొలి మోటార్‌సైకిల్ టీవీఎస్ బ్యాడ్జింగ్‌తో లభ్యం కానున్నట్లు తెలుస్తోంది.

ఈ ఎంట్రీ లెవల్ ప్రీమియం బైక్‌లో 300సీసీ, సింగిల్ సిలిండర్, ఫోర్ స్ట్రోక్ ఇంజన్‌ను ఉపయోగించనున్నట్లు సమాచారం. ఈ బైక్ వచ్చే ఏడాది చివరి నాటికి కానీ లేదా 2016 ఆరంభంలో కానీ విడుదలయ్యే అవకాశాలున్నాయి. ఈ మోడల్‌ను భారత మార్కెట్లోనే కాకుండా, యూరప్ మార్కెట్లలో కూడా విడుదల చేయాలని ఇరు కంపెనీలు భావిస్తున్నాయి.
ప్రారంభంలో టీవీఎస్, బిఎమ్డబ్ల్యూ సంస్థలు తక్కువ ఇంజన్ సామర్థ్యం కలిగిన హీరో ఇంపల్స్ వంటి సెమీ ఆఫ్-రోడర్ బైక్‌లను తయారు చేయాలనుకున్నప్పటికీ, ఆ తర్వాత తమ నిర్ణయాన్ని మార్చుకొన్నట్లు తెలుస్తోంది. ఏదేమైనప్పటికీ, ఈ రెండు విభిన్న సంస్థల కలయిక నుండి రానున్న బైక్‌పై మార్కెట్లో భారీ అంచనాలు నెలకొని ఉన్నాయి.


Click it and Unblock the Notifications








