వచ్చే ఏడాదిలో టీవీఎస్-బిఎమ్‌డబ్ల్యూ బైక్ విడుదల

Posted By:

ప్రముఖ దేశీయ ద్విచక్ర వాహన తయారీ దిగ్గజం టీవీఎస్ మోటార్ కంపెనీ, వచ్చే ఏడాదిలో జర్మన్ లగ్జరీ బ్రాండ్ బిఎమ్‌డబ్ల్యూ కోసం మోటార్‌సైకిళ్లను ఉత్పత్తి చేయనుంది. ఈ విషయాన్ని స్వయంగా కంపెనీ ఉన్నతాధికారి ఒకరు వెల్లడించారు.

ఇది కూడా చదవండి: టీవీఎస్ బిఎమ్‌డబ్ల్యూ మోటార్‌సైకిల్ ఒక 300సీసీ స్ట్రీట్ బైక్

టీవీఎస్ మోటార్ కంపెనీ, బిఎమ్‌డబ్ల్యూ మోటారాడ్ సంస్థల మధ్య కుదిరిన ఒప్పందంలో భాగంగా, తొలి ద్విచక్ర వాహనాన్ని 2015 ద్వితీయార్థం నాటికి అందుబాటులోకి తీసుకువస్తామని టీవీఎస్ మోటార్ కంపెనీ చైర్మన్ వేణు శ్రీనివాసన్ తెలిపారు.

గడచిన సంవత్సరం ఏప్రిల్ నెలలో ఈ మేరకు ఇరు కంపెనీల మధ్య ఓ ఒప్పందం కుదిరిన సంగతి తెలిసినదే. ఈ ఒప్పందం ప్రకారం, టీవీఎస్ రూ.150 కోట్ల పెట్టుబడిని వెచ్చిస్తుండగా, మోటార్‌సైకిళ్ల అభివృద్ధి, టెస్టింగ్ ఖర్చులను బిఎమ్‌డబ్ల్యూ భరించనుంది.

TVS Draken

ప్రస్తుతం బిఎమ్‌డబ్ల్యూ 500సీసీ కన్నా ఎక్కువ ఇంజన్ సామర్థ్యం కలిగిన బైక్‌లను మాత్రమే విక్రయిస్తోంది. ఈ నేపథ్యంలో, అభివృద్ధి చెందుతున్న భారత్ వంటి దేశాల కోసం బడ్జెట్‌లో ఉండే లగ్జరీ మోటార్‌సైకిల్ అందుబాటులోకి తీసుకురావాలనే ఉద్ధేశ్యంతో, బిఎమ్‌డబ్ల్యూ మోటారాడ్ ఈ ఒప్పందాన్ని కుదుర్చుకుంది.

ఇందులో భాగంగానే, టీవీఎస్ మోటార్ కంపెనీ, బిఎమ్‌డబ్ల్యూ కోసం ఓ సరికొత్త ప్లాట్‌ఫామ్‌ను తయారు చేస్తోంది. ఈ ప్లాట్‌ఫామ్‌ను ఆధారంగా చేసుకొని బిఎమ్‌డబ్ల్యూ కోసం 250సీసీ నుంచి 500సీసీ రేంజ్‌లో బైక్‌లను టీవీఎస్ తయారు చేసి ఇవ్వనుంది. ఈ బైక్‌లను చూడాలంటే, మరో ఏడాది పాటు ఆగాల్సిందే మరి.

English summary
Two- and three-wheeler maker TVS Motor Company will start rolling out bikes for German auto major BMW during the second half of next year, a top company official said Monday.

Latest Photos

డ్రైవ్స్పార్క్ నుండి తాజా ఆటో అప్డేట్స్ పొందండి
Telugu Drivespark