అక్రమంగా రూపొందించడిన స్కార్పియో కారును జప్తు చేసిన ముంబైయ్ పోలీస్ అధికారులు

Written By:

పొరుగు దేశాల వారి ఆవిష్కరణలు చూసి ప్రేరేపించబడ్డ వ్యక్తి ఇతర దేశాలలో ఉండే అతి పొడవైన వాహనాలను కోరుకున్నాడు. కాని ఇది భారత దేశం ఇక్కడ అలాంటి కార్లు దొరకవు. అస్సలు మన వాళ్లు అనుమతి ఇస్తే కదా...! కాని అతనికి అలా పొడవుగా ఉండే కార్లో తిరగాలని కోరిక.

గుజరాత్‌కు చెందిన ఒక వ్యక్తి తన దగ్గర ఉన్న రెండు స్కార్పియో వాహనాలను ఎలా మార్చేసుకున్నాడో క్రింది కథనం ద్వారా మీ తెలుసుకోండి.

ముందుగా ఇవి ఎలా బయట పడ్డాయంటే, గుజరాత్ లోని వాషి ఆర్.టి.ఒ అధికారి ఆనంద్‌రామ్ రెక్కీ నిర్విహిస్తుండాగా. వీటి పట్టుకున్నారు. ఇవి ముందు నుండి చూడటానికి స్కార్పియో మాదిరిగానే ఉన్నప్పట్టికి వీటి కొలతలు మాత్రం పూర్తిగా మార్చేశారిని ఆ ఆర్.టి.ఒ అధికారి వివరించాడు.

భారత మోటార్ వాహన చట్టానికి విరుద్దంగా దాదాపుగా 1.6 మీటర్లు అధిక పొడవుతో వీటిని మోడిఫైడ్ చేశారు అని సంభందిత అధికారులు వెల్లడించారు.

సాధారణ వాహనాలను ఇలా ఎక్కువ పొడవు ఉండే విధంగా రూపొందించడానికి దాదాపుగా 25 నుండి 30 లక్షల వరకు డిమాండ్ చేస్తున్నట్లు తెలిసింది.

అంతే కాదండోయ్ గుజరాత్‌లోని లిమోస్ అనే సంస్థ ఇటువంటి మోడిఫైడ్ స్కార్పియో వాహనాలను గంటకు 10,000 రుపాయలతో అద్దెకు కూడా ఇస్తోంది.

ఇందులో ఉన్న ఫీచర్లు

అదనపు సీట్లు, 31-అగుళాల టివి మరియు యల్‌ఇడి లైట్లు, వ్యాగనార్ ఫ్రంట్ లైట్లు వంటి ఫీచర్లు ఇందులో ఉన్నాయి.

ఆర్.టి.వో అధికారుల వారి సమాచారం ప్రకారం ఇవి రెండు కూడా స్కార్పియోలని వీటిని వరుసగా 2011 మరియు 2012 లో రిజిస్ట్రేషన్ చేసుకున్నట్లు తెలిసింది.

అయితే మోడిఫైడ్ చేసిన తరువాత వీటికి చెందిన సరైన డాక్యుమెంట్లు అందివ్వనందున వీటిని జప్తు చేసినట్లు ఆ శాఖ అధికారి ఒకరు తెలిపాడు.

ఈ అత్యంత పొడవైన కార్లను సరఫరా చేసే సంస్థ ఒకటి ఇలాంటి కార్లను విమినాశ్రయ అవసరాలకు, వివాహాలు మరియు విహార యాత్రలకు వీటిని అందిస్తున్నట్లు గల విజిటింగ్ కార్డు ఈ కారును నడుపుతున్న డ్రైవర్ వద్ద లభించింది.

Click to compare, buy, and renew Car Insurance online

Buy InsuranceBuy Now

English summary
Mahindra Modified Scorpio limousines Sized In Mumbai
Please Wait while comments are loading...

Latest Photos