22 ప్రధాన నగరాలలో డామినర్ 400 డెలివరీలను ప్రారంభించిన బజాజ్

Written By:

దేశీయ విపణిలో 500సీసీ సామర్థ్యంలోపు ఉన్న దాదాపు అన్ని బైకులకు పోటీని సృష్టిస్తూ బజాజ్ తమ డామినర్ 400 బైకును విడుదల చేసింది. సబ్ 500సీసీ మోటార్ సైకిల్ సెగ్మెంట్లో ఊహించని ధరతో డిసెంబర్ 2016 లో విడుదలైంది. అయితే 2017 జనవరి నుండి డెలివరీలను ప్రారంభిస్తామని ముందస్తుగా తెలిపిన సమాచారం మేరకు బజాజ్ వీటిని కస్టమర్లకు అందజేయడానికి సిద్దమైంది.

బజాజ్ సంస్థ ఈ గేమ్ చేంజర్ బైకు డామినర్ 400 ను 1.36 లక్షల ప్రారంభ ధరతో విడుదల చేసింది. దీని విడుదల అనంతరం బజాజ్ అధికారి ఒకరు మాట్లాడుతూ, దీని విడుదల సమయంలో ఔత్సాహికులు భారీ సంఖ్యలో వెబ్‌సైట్‌ను సందర్శించడం ద్వారా సైట్ స్తంభించిపోయిందని తెలిపాడు.

డిసెంబర్ 15, 2016 నుండి ఆన్‌లైన్ ద్వారా బుక్ చేసుకునే అవకాశాన్ని కల్పించింది. అప్పటి నుండి ఆన్‌లైన్ ద్వారా బుక్ చేసుకున్న వారికి ఏ విధమైన ఆలస్యం లేకుండా ప్రస్తుతం డెలివరీ ప్రారంభించింది బజాజ్.

సాంకేతికంగా బజాజ్ డామినర్ 400 బైకులో 373సీసీ సామర్థ్యం గల లిక్విడ్ కూల్డ్ సింగల్ సిలిండర్ ఇంజన్ కలదు, ఇది గరిష్టంగా 35బిహెచ్‌పి పవర్ మరియు 35ఎన్ఎమ్ గరిష్ట టార్క్ ఉత్పత్తి చేయును.

6-స్పీడ్ మ్యాన్యువల్ ట్రాన్స్‌మిషన్ అనుసంధానం గల ఇందులో యాంటిలాక్ బ్రేకింగ్ సిస్టమ్ కలదు(దీనిని ఆప్షనల్‌గా ఎంచుకునే అవకాశాన్ని అందించింది). మరియు ప్రస్తుతం మహీంద్రా మోజో మరియు రాయల్ ఎన్ఫీల్డ్ ఉత్పత్తులకు ఇది గట్టి పోటీనివ్వనుంది.

బడ్జెట్ ధరతో 2017 లో విడుదల కానున్న స్పోర్టివ్ బైకులు
2017 లో విడుదల కానున్న ఉత్తేజకరమైన బైకుల గురించి మరియు అంచనాతో విడుదల , ధర వివరాలు మీ కోసం....

500సీసీ లోపు సామర్థ్యం ఉన్న అనేక బైకులకు ప్రాణసంకటంగా మారిన డామినర్ 400 ఇప్పుడు యువతకు ఫేవరేట్‌గా మారిపోయింది. మరి ఇది ఎలా ఉందో చూద్దాం రండి...
 

Read more on: #బజాజ్ #bajaj
English summary
Bajaj Dominar 400 Deliveries Commence In 22 Indian Cities
Please Wait while comments are loading...

Latest Photos