దక్షిణాదిలో రెండు బైకులను విడుదల చేసిన ఇండియన్ మోటార్‌సైకిల్

Written By:

అమెరికాకు చెందిన దిగ్గజ మోటార్ సైకిళ్ల తయారీ సంస్థ ఇండియా విభాగం, ఇండియన్ మోటార్‌సైకిల్ దక్షిణ భారత దేశంలోకి స్ప్రింగ్‌ఫీల్డ్ మరియు ఛీఫ్‌టెయిన్ డార్క్ హార్స్ అనే రెండు విలాసవంతమైన బైకులను విడుదల చేసింది. వీటి ధరలు వరుసగా రూ. 31.55 లక్షలు మరియు 33.07 లక్షలు ఎక్స్ షోరూమ్ (బెంగళూరు)గా ఉన్నాయి.

ఇండియన్ మోటార్‌సైకిల్ సంస్థ మొదటి సారిగా ప్రారంభించిన ప్రదేశం ఆధారంగా స్ప్రింగ్‌ఫీల్డ్ పేరును సేకరించారు. క్లాసిక్ డిజైన్‌ను కొనసాగిస్తూనే అత్యాధునిక ఫీచర్లను ఇందులో ప్రవేశపెట్టింది.

ఇండియన్ చీఫ్‌టెయిన్ డార్క్ హార్స్ ఎక్ట్సీరియర్‌ను మట్టీ బ్లాక్ కలర్‌లో ఫినిషింగ్ చేశారు. ప్రధాన బాగాలలో క్రోమ్ పరికరాలతో సొబగులద్దారు.

సాంకేతిక వివరాల పరంగా చూస్తే స్ప్రింగ్‌ఫీల్డ్ మరియు ఛీఫ్‌టెయిన్ డార్క్ హార్స్ రెండు బైకుల్లో కూడా 1811సీసీ సామర్థ్యం గల వి-ట్విన్, థండర్ స్ట్రోక్ 111 ఇంజన్ కలదు. దీనికి 6-స్పీడ్ మ్యాన్యువల్ ట్రాన్స్‌మిషన్ గల గేర్‌బాక్స్ అనుసంధానం చేయడం జరిగింది.

స్ప్రింగ్‌ఫీల్డ్ లోని ఫీచర్లు

 • నూతన విభిన్నమైన ఛాసిస్,
 • క్యాట్రిడ్జ్ ఫోర్క్స్,
 • ఎయిర్ అడ్జెస్టబుల్ రియర్ సస్పెన్షన్,
 • హీటెడ్ ప్యాసింజర్ మరియు రైడర్ సీట్,
 • 64.3-లీటర్ల సామర్థ్యం ఉన్న యాక్ససరీ ట్యాంకు,
 • హీటెడ్ గ్రిప్స్,
 • త్వరగా విచ్చుకుని మరియు ముడుచుకునే ఫీచర్ ఉన్న విండ్ షీల్డ్
 • మరియు సీటును మనకు తగిన విధంగా కస్టమైజ్ చేసుకునే అవకాశాన్ని కల్పించారు.

ఇండియన్ ఛీఫ్‌టెయిన్ డార్క్ హార్స్ లోని ఫీచర్లు

 • సింగల్ సీటు,
 • యాంటిలాక్ బ్రేకింగ్ సిస్టమ్, ఎలక్ట్రానిక్ క్రూయిజ్ కంట్రోల్,
 • ఆడియో సిస్టమ్,
 • కీలెస్ ఇగ్నిషన్, 
 • హెడ్రెస్ ఫోర్క్స్,
 • మిర్రర్లు,
 • టర్న్ సిగ్నల్స్, 
 • బ్లాక్ కలర్ లో ఉన్న ఎయిర్ బాక్స్ కవర్స్

ఇండియన్ మోటార్‌సైకిల్ విడుదల చేసిన ఈ రెండు బైకుల ఫోటోలను ఇంకా చూడాలంటే క్రింద ఉన్న గ్యాలరీ మీద ఓ లుక్కేయండి.

 

Click to compare, buy, and renew Car Insurance online

Buy InsuranceBuy Now

English summary
Indian Motorcycle Launches Springfield And Chieftain Dark Horse Baggers In Bangalore
Please Wait while comments are loading...

Latest Photos