డెట్రాయిట్ ఆటో షో ప్రారంభం..!!

By

Detroit Auto Show 2010
ఉత్తర అమెరికాలో జరిగే అంతర్జాతీయ ఆటో షో, డెట్రాయిట్ ఆటో షోగా కూడా పిలువబడుతున్న ఆ ఆటో షో గత 12వ తేదీన మొదలయిన సంగతి తెలిసిందే. సుమారు 700 వాహనాలను ప్రదర్శనకు రానున్న ఈ ఆటో షోలో నేటి నుండీ సందర్శకులను అనుమతించనున్నారు. మొదటి మూడు రోజులూ మీడియా వారిని మాత్రమే అనుమతించి, ఆ తర్వాత సందర్శకులను అనుమతించడం ఆటో షోల్లో ఆనవాయితి. జనరల్ మోటార్స్, ఫోర్డ్, టయోటా, హోండా, మెర్సిడెస్ లాంటి ఆటో కంపెనీలు సరికొత్త కార్లను ఆవిష్కరించనున్నారు.

ఈ ఆటో షోలో ఎలక్ట్రిక్ వాహనాలు ప్రత్యేక ఆకర్షణగా నిలువనున్నాయి. చెవీ వోల్ట్, నిస్సాన్ లీఫ్, వోల్వో సి30, ఫియెట్ 500, బియండబ్యు 1-సీరీస్ లాంటి కార్ల ప్రత్యేక ఆకర్షణ కానున్నాయి. ఫెరారీ సంస్థ కూడా ఈ ఆటో షోలో పాలుపంచుకోనుంది. కాగా సాబ్, హమ్మర్, సుజుకి మరియు పోర్ష్ వంటి కంపెనీలు ఈ ఆటో షోలో పాల్గొనట్లేదు. అమెరికా అద్యక్షుడు బరాక్ ఒబామా కూడా ఈ ఆటో షోను వీక్షించునున్నారని సమాచారం.

Most Read Articles

Story first published: Friday, January 15, 2010, 14:37 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X