2013 టోక్యో మోటార్ షో: నిస్సాన్ బ్లేడ్‌గ్లైడర్ కాన్సెప్ట్

By Ravi

జపనీస్ కార్ కంపెనీ నిస్సాన్ మోటార్ కార్పేషన్, ప్రస్తుతం జపాన్‌లో జరుగుతున్న 2013 టోక్యో మోటార్ షోలో ఓ అద్భుతమైన కాన్సెప్ట్ వాహనాన్ని ఆవిష్కరించింది. నిస్సాన్ ప్రదర్శనకు ఉంచిన ఈ కాన్సెప్ట్ పేరు 'నిస్సాన్ బ్లేడ్‌గ్లైడర్' (Nissan BladeGlider).

భవిష్యత్ ప్రజా రవాణా అవసరాలను దృష్టిలో ఉంచుకొని అధునాతన సాంకేతిక పరిజ్ఞానంతో తయారు చేసిన వాహనం ఇది. నిస్సాన్ బ్లేడ్‌గ్లైడర్ ఒక ఎలక్ట్రిక్ వాహనం. నిస్సాన్ బ్లేడ్‌గ్లైడర్ డెల్టా షేపులో డిజైన్ చేయబడిన ఎలక్ట్రిక్ కారు.

నిస్సాన్ బ్లేడ్‌గ్లైడర్ ముందు వైపు సన్నటి డిజైన్‌ను వెనుక వైపు వెడల్పాటి డిజైన్‌ను కలిగి ఉంటుంది. లో డ్రాగ్, టైమ్ జెనరేషన్ రోడ్ హగ్గింగ్ డౌన్‌ఫోర్స్ లను దృష్టిలో ఉంచుకొని దీని ఏరోడైనమిక్స్‌ను డిజైన్ చేశారు. ఈ కారుకు సంబంధించి మరింత సమాచారాన్ని క్రింది ఫొటో ఫీచర్‌‌లో పరిశీలిద్దాం రండి.

నిస్సాన్ బ్లేడ్‌గ్లైడర్ కాన్సెప్ట్

బ్లేడ్‌గ్లైడర్ ప్రొడక్షన్ దశకు చేరుకుంటే, ఇన్-వీల్ మోటార్లను, ఇండిపెండెంట్ మోటార్ మేనేజ్‌మెంట్ సిస్టమ్‌లను ఉపయోగించుకొని తయారైన మొట్టమొదటి కారుగా ఇది నిలుస్తుందని నిస్సాన్ పేర్కొంది.

నిస్సాన్ బ్లేడ్‌గ్లైడర్ కాన్సెప్ట్

నిస్సాన్ బ్లేడ్‌గ్లైడర్‌లోని ఇన్‌-వీల్ మోటార్లు నిస్సాన్ లిథియం-ఐయాన్ బ్యాటరీ సాయంతో పనిచేసే ఎలక్ట్రిక్ మోటార్లపై ఆధారపడి నడుస్తాయి. నిస్సాన్ ఇప్పటికే ఈ తరహా బ్యాటరీలను తమ లీఫ్ ఎలక్ట్రిక్ కారులో ఉపయోగిస్తోంది.

నిస్సాన్ బ్లేడ్‌గ్లైడర్ కాన్సెప్ట్

బ్లేడ్‌గ్లైడర్ ఏరోడైనమిక్స్‌ను లైట్ వెయిట్ కార్బన్ ఫైబర్ రీఇన్‌ఫోర్స్డ్ ప్లాస్టిక్‌తో తయారు చేశారు కాబట్టి ఇది చాలా తేలికగా ఉంటుంది. ఈ ప్లాస్టిక్ ప్యానెళ్లను పెరల్‌ఎసెంట్ వైట్ కలర్‌లో పెయింట్ చేశారు.

నిస్సాన్ బ్లేడ్‌గ్లైడర్ కాన్సెప్ట్

నిస్సాన్ బ్లేడ్‌గ్లైడర్ ఒక త్రీసీటర్ కారు. ఇందులో డ్రైవర్ సీటు కారుకు మధ్య భాగంలో ఉంటుంది. డ్రైవర్ సీటుకు వెనుక రెండు ఇండివిడ్యువల్ సీట్లు ఉంటాయి. ఎయిర్-క్రాఫ్ట్ స్టయిల్, ఫ్యూచరిస్టిక్ ఇన్‌స్ట్రుమెంటేషన్ ఇందులో ప్రధాన ఆకర్షణగా నిలుస్తాయి. ఈ కారు డోర్లను ఓపెన్ చేయగానే డ్రైవర్ సీటు ఆటోమేటిక్‌గా ముందుకు జరిగి వెనుక ప్యాసింజర్లు ఎక్కడానికి, దిగటానికి వీలుగా ఉంటుంది.

Most Read Articles

English summary
Japanese auto major Nissan has showcased its futuristic BladeGlider electric car concept at 2013 Tokyo Motor Show in Japan. The Nissan BladeGlider Concept is a delta shaped electric sportscar with a narrow front track and wide rear, designed with major focus on aerodynamics giving it a low drag and at the same time generating road-hugging downforce.
Story first published: Saturday, November 9, 2013, 15:48 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X