నేటి వీడియో: హోండా ఆవిష్కరించిన 2014 మోడళ్లు ఇవే!

By Ravi

జపనీస్ టూవీలర్ కంపెనీ హోండా, కొత్త సంవత్సరంలో సరికొత్త ఉత్పత్తులను మార్కెట్లో విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తుంది. ఇందులో భాగంగానే, మిలాన్‌లో జరుగుతున్న ఈఐసిఎమ్ఏ అంతర్జాతీయ మోటార్‌సైకిల్ షోలో హోండా 2014 సంవత్సరానికి గాను ప్రవేశపెట్టనున్న కొత్త మోడళ్లను ఆవిష్కరించింది.

హోండా ఆవిష్కరించిన 2014 మోడళ్లలో నాలుగు సరికొత్త మోడళ్లు, రెండు కొత్త స్టయిలిష్ 650సీసీ మోడళ్లు, ఓ సిటిఎక్స్1300 క్రూయిజర్, ఎన్‌సి సిరీస్ నెక్స్ట్ ఎవల్యూషన్ మరియు విఎఫ్ఆర్800ఎఫ్, సిబిఆర్1000ఆర్ఆర్ ఫైర్‌బ్లేడ్ మోడళ్లు ఉన్నాయి. ప్రత్యేకించి యువ కస్టమర్లను లక్ష్యంగా చేసుకొని హోండా ఈ సరికొత్త మరియు అప్‌గ్రేడెడ్ మోడళ్లను అభవృద్ధి చేసింది.

ఈఐసిఎమ్ఏ మోటార్‌లో హోండా ప్రదర్శించిన ఉత్పత్తులలో కొన్ని మోడళ్లు భారత మార్కెట్‌కు కూడా రానున్నాయి. వాటి వివరాలేంటో తెలుసుకుందాం రండి. (చివరి స్లైడ్‌లో వీడియోను వీక్షించండి).

హోండా సిటిఎక్స్1300

హోండా సిటిఎక్స్1300

ఇదొక కస్టమ క్రూయిజర్ బైక్. ద్విచక్ర వాహనాలపై లాంగ్ ట్రిప్‌లు వెళ్లే వారిని దృష్టిలో ఉంచుకొని దీనిని డిజైన్ చేశారు. అధునాత టెక్నాలజీ మరియు కంఫర్టబిలిటీల కాంబినేషన్‌తో ఈ బైక్‌ను తీర్చిదిద్దారు.

హోండా సిబిఆర్650ఎఫ్

హోండా సిబిఆర్650ఎఫ్

ఇది ప్రస్తుతం కంపెనీ అందిస్తున్న 650సీసీ సిబిఆర్650ఎఫ్ వెర్షన్‌కు అప్‌గ్రేడెడ్ మోడల్. ఈ స్టయిలిష్ మిడిల్‌వెయిట్ బైక్‌లో కొత్తగా ఇన్-లైన్ 4 సిలిండర్ ఇంజన్‌ను ఉపయోగించారు. దీంతో ఇది హోండా యొక్క ఫోర్ సిలిండర్ ఇంజన్ రేంజ్‌లో కొత్తగా వచ్చి చేరింది. ఇది ఫుల్లీ ఫెయిర్డ్ వెర్షన్.

హోండా సిబి650ఎఫ్

హోండా సిబి650ఎఫ్

ఇది ప్రస్తుతం కంపెనీ అందిస్తున్న 650సీసీ సిబి650ఎఫ్ వెర్షన్‌కు అప్‌గ్రేడెడ్ మోడల్. ఈ స్టయిలిష్ మిడిల్‌వెయిట్ బైక్‌లో కొత్తగా ఇన్-లైన్ 4 సిలిండర్ ఇంజన్‌ను ఉపయోగించారు. దీంతో ఇది హోండా యొక్క ఫోర్ సిలిండర్ ఇంజన్ రేంజ్‌లో కొత్తగా వచ్చి చేరింది. ఇది నేక్డ్ వెర్షన్.

సిబిఆర్100ఆర్ఆర్ ఫైర్‌బ్లేడ్, సిబిఆర్100ఆర్ఆర్ ఫైర్‌బ్లేడ్ ఎస్‌పి

సిబిఆర్100ఆర్ఆర్ ఫైర్‌బ్లేడ్, సిబిఆర్100ఆర్ఆర్ ఫైర్‌బ్లేడ్ ఎస్‌పి

ఈ రెండు హోండా పవర్‌ఫుల్ సిబిఆర్100ఆర్ఆర్ ఫైర్‌బ్లేడ్, సిబిఆర్100ఆర్ఆర్ ఫైర్‌బ్లేడ్ ఎస్‌పి (సూపర్ స్పోర్ట్స్) బైక్‌లలోని ఇంజన్‌ను అప్‌గ్రేడ్ చేశారు. కొత్త స్పెషల్ ఎడిషన్‌లో ఓహ్లిన్స్ సస్పెన్షన్, బ్రెమ్బూ బ్రేక్స్ లభ్యం కానున్నాయి.

హోండా సిబిఆర్300ఆర్

హోండా సిబిఆర్300ఆర్

ప్రస్తుతం మార్కెట్లో లభిస్తున్న హోండా సిబిఆర్250ఆర్ బైక్‌ను రీప్లేస్ చేసేందుకు గాను, కొత్త మెరుగైన ఇంజన్‌తో ఫైర్‌బ్లేడ్ బైక్ స్టైల్ నుంచి స్ఫూర్తి పొంది ఈ హోండా సిబిఆర్300ఆర్ బైక్‌ను తయారు చేశారు. ఈ బైక్‌కు సంబంధించిన పూర్తి సమాచారం కోసం ఈ లింక్‌పై క్లిక్ చేయండి.

హోండా ఇంటెగ్రా

హోండా ఇంటెగ్రా

ఈదొక కాన్సెప్ట్ వాహనం. స్కూటర్ స్టైల్‌లో ఉండేలా దీనిని తీర్చిదిద్దారు. 2011లోనే హోండా ఆవిష్కరించిన ఇంటెగ్రా మోడల్‌కు అప్‌డెటెడ్ వెర్షనే ఇది. దీనిలో ఇంజన్ సామర్థ్యాన్ని పెంచారు. అలాగే యుటిలిటీ సదుపాయలను కూడా మెరుగుపరచారు.

హోండా ఎన్‌సి750ఎక్స్

హోండా ఎన్‌సి750ఎక్స్

ఇది కూడా కాన్సెప్ట్ వాహనమే. ఆఫ్-రోడ్ స్టైల్ బైక్‌ను తలపించేలా దీనిని డిజైన్ చేశారు. 2011లోనే హోండా ఆవిష్కరించిన ఎన్‌సి750ఎక్స్ మోడల్‌కు ఇది అప్‌డెటెడ్ వెర్షన్. దీనిలో ఇంజన్ సామర్థ్యాన్ని, యుటిలిటీ సదుపాయలను కూడా మెరుగుపరచారు.

హోండా ఎన్‌సి750ఎస్

హోండా ఎన్‌సి750ఎస్

హోండా ఎన్‌సి750ఎక్స్ బైక్‌కు టూరింగ్ వెర్షనే ఈ హోండా ఎన్‌సి750ఎస్. ఇది కూడా కాన్సెప్ట్ వాహనమే. 2011లోనే హోండా ఆవిష్కరించిన ఎన్‌సి750ఎఎస్ మోడల్‌కు ఇది అప్‌డెటెడ్ వెర్షన్. దీనిలో ఇంజన్ సామర్థ్యాన్ని, యుటిలిటీ సదుపాయలను కూడా మెరుగుపరచారు.

హోండా విఎఫ్ఆర్800ఎఫ్

హోండా విఎఫ్ఆర్800ఎఫ్

హోండా వి4 మోడళ్లలో ఒకటైన హోండా విఎఫ్ఆర్800ఎఫ్ మోడల్‌ను 2014 వెర్షన్‌కు అనుగుణంగా కొద్దిపాటి మార్పుల చేర్పులతో అప్‌గ్రేడ్ చేశారు. దీనికి పూర్తిగా కొత్త లుక్‌ని కల్పించారు.

హోండా క్రాస్‌టూరర్

హోండా క్రాస్‌టూరర్

హోండా వి4 మోడళ్లలోని మరో బైక్ హోండా క్రాస్‌టూరర్ మోడల్‌ను కూడా కొద్దిపాటి మార్పుల చేర్పులతో అప్‌గ్రేడ్ చేశారు. ఇందులో టెక్లనాజీ అప్‌గ్రేడ్స్ ఉన్నాయి.

వీడియో

మిలాన్‌లో జరుగుతున్న 2014 ఈఐసిఎమ్ఏ అంతర్జాతీయ మోటార్‌సైకిల్ షోలో హోండా ఆవిష్కరించిన సరికొత్త ఉత్పత్తులకు సంబంధించిన వీడియోను ఈ స్లైడ్‌లో వీక్షించండి.

Most Read Articles

English summary
Honda reveals its new motorcycle line-up for 2014, expanding its uniquely wide and varied range with eleven new or upgraded machines. New for 2014 are the CBR1000RR Fireblade SP, CB650F, CBR650F and CTX1300. A further seven machines are significantly upgraded for 2014: VFR800F, Crosstourer, CBR1000RR Fireblade, Integra, NC750X, NC750S and CBR300R.
Story first published: Thursday, November 7, 2013, 12:57 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X