టోక్యో మోటార్ షో: జాగ్వార్ ఎఫ్-టైప్ కూపే విడుదల

By Ravi

బ్రిటీష్ లగ్జరీ కార్ బ్రాండ్ జాగ్వార్ ఇటీవల ఆవిష్కరించిన కన్వర్టిబల్ వెర్షన్ ఎఫ్-టైప్ స్పోర్ట్స్ కారుకు కొనసాగింపుగా, పర్మినెంట్ హార్డ్ రూఫ్ కలిగిన ఎఫ్-టైప్ కూపేను కంపెనీ విడుదల చేసింది. ప్రస్తుతం జపాన్‌లో జరుగుతున్న 43వ అంతర్జాతీయ టోక్యో మోటార్ షోలో జాగ్వార్ తమ అధునాతన ఎఫ్-టైప్ కూపే బాడీ స్టైల్ స్పోర్ట్స్ కారును ప్రదర్శనకు ఉంచింది.

జాగ్వార్ ఇప్పటికే భారత్‌తో కలిపి ఇతర గ్లోబల్ మార్కెట్లలో కన్వర్టిబల్ వెర్షన్ ఎఫ్-టైప్‌ను విక్రయిస్తోన్న సంగతి తెలిసినదే. 2011 ఫ్రాంక్‌ఫర్ట్ ఆటో షోలో జాగ్వార్ ఆవిష్కరించిన సి-ఎక్స్16 కాన్సెప్ట్ కారుకు ప్రొడక్షన్ వెర్షనే ఈ ఎఫ్-టైప్ కూపే. త్వరలోనే ఈ మోడల్ కూడా భారత మార్కెట్‌కు రానుంది.

జాగ్వార్ ఎఫ్-టైప్ కూపే వేరియంట్లు, ఇంజన్ ఆప్షన్లు, ధరలు మరియు ఇతర వివరాలను క్రింది ఫొటో ఫీచర్‌లో తెలుసుకుందాం రండి..!

జాగ్వార్ ఎఫ్-టైప్ కూపే

జాగ్వార్ ఎఫ్-టైప్ కూపే కూడా కన్వర్టిబల్ మాదిరిగా మొత్తం మూడు వేరియంట్లలో లభిస్తుంది. అందులో రెండు వి6 సూపర్‌ఛార్జ్డ్ మోడళ్లు, ఒకటి వి8 సూపర్‌ఛార్జ్డ్ మోడల్. కేవలం వి8 కూపేను మాత్రమే ఎఫ్-టైప్ ఆర్ కూపేగా పిలువనున్నారు (ఇది హైపెర్ఫామెన్స్ వెర్షన్).

జాగ్వార్ ఎఫ్-టైప్ కూపే

ఎంట్రీ లెవల్ వేరియంట్ ఎఫ్-టైప్ కూపేలో 3.0 లీటర్ సూపర్‌ఛార్జ్డ్ వి6 ఇంజన్‌ను ఉపయోగించారు. ఇది గరిష్టంగా 340 హెచ్‌పిల శక్తిని ఉత్పత్తి చేస్తుంది. ఇది కేవలం 5.1 సెకండ్ల వ్యవధిలోనే 0-60 మైళ్ల వేగాన్ని అందుకోగలదు (కన్వర్టిబల్ మాదిరిగానే). దీని గరిష్ట వేగం గంటకు 259 కి.మీ.

జాగ్వార్ ఎఫ్-టైప్ కూపే

మిడ్ లెవల్ వేరియంట్ ఎఫ్-టైప్ ఎస్ కూపేలో 3.0 లీటర్ సూపర్‌ఛార్జ్డ్ వి6 ఇంజన్‌ను ఉపయోగించారు. ఇది గరిష్టంగా 380 హెచ్‌పిల శక్తిని ఉత్పత్తి చేస్తుంది. ఇది కేవలం 4.8 సెకండ్ల వ్యవధిలోనే 0-60 మైళ్ల వేగాన్ని అందుకోగలదు (కన్వర్టిబల్ మాదిరిగానే). దీని గరిష్ట వేగం గంటకు 275 కి.మీ.

జాగ్వార్ ఎఫ్-టైప్ కూపే

టాప్ ఎండ్ వేరియంట్ ఎఫ్ టైప్ ఆర్ కూపేలో 5.0 లీటర్ సూపర్‌ఛార్జ్డ్ వి8 ఇంజన్‌ను ఉపయోగించారు. ఇది గరిష్టంగా 550 హెచ్‌పిల శక్తిని (కన్వర్టిబల్ కన్నా 55 హెచ్‌పిలు అదన) ఉత్పత్తి చేస్తుంది. ఇది కేవలం 4.0 సెకండ్ల వ్యవధిలోనే 0-60 మైళ్ల వేగాన్ని అందుకోగలదు దీని గరిష్ట వేగం గంటకు 300 కి.మీ.

జాగ్వార్ ఎఫ్-టైప్ కూపే

ఈ మూడు వేరియంట్లు కూడా జెడ్ఎఫ్ 8-స్పీడ్ 'క్విక్‌షిఫ్ట్' ట్రాన్సిమిషన్‌తో లభిస్తాయి. ఈ గేర్లను ప్యాడెల్ షిఫ్టర్స్ ద్వారా ఫుల్ మ్యాన్యువల్ సీక్వెన్షనల్ కంట్రోల్‌తో కానీ లేదా సెంట్రల్ 'స్పోర్ట్‌షిఫ్ట్' లివర్ ద్వారా కానీ మార్చుకోవచ్చు.

జాగ్వార్ ఎఫ్-టైప్ కూపే

ఈ ఎఫ్-టైప్ కూపే మోడళ్లు సెకండ్ జనరేషన్ ఎలక్ట్రానిక్ యాక్టివ్ డిఫరెన్షియల్ మరియు కొత్త టార్క్ వెక్టరింగ్ సిస్టమ్‌లతో లభిస్తాయి. ఇవి మంచి హ్యాండ్లింగ్‌ను ఆఫర్ చేస్తాయి.

జాగ్వార్ ఎఫ్-టైప్ కూపే

ఇది కూపే బాడీ టైప్ కావటంతో, కారు పైభాగం అల్యూమినియంతో కానీ లేదా గ్లాస్ రూఫ్‌తో కానీ లభిస్తుంది.

జాగ్వార్ ఎఫ్-టైప్ కూపే

ఎఫ్-టైప్ కూపే‌ వెనుక వైపు బూట్ స్పేస్ కూడా ఉంటుంది. కన్వర్టిబల్ మాదిరిగా కాకుండా ఇది మరింత ఎక్కువ స్పేస్‌ను కలిగి ఉంటుందని, ఇందులో రెండు పెద్ద గోల్ఫ్ కిట్లను ఉంచవచ్చని కంపెనీ పేర్కొంది.

జాగ్వార్ ఎఫ్-టైప్ కూపే

ఈ కారులో మరో ప్రత్యేకత ఏంటంటే, కారు బూట్‌పై ఓ యాక్టివ్ స్పాయిలర్ ఉంటుంది. గంటకు 112 కి.మీ. పైగా వేగంతో వెళ్తున్నప్పుడు ఇది ఆటోమేటిక్‌గా బయటకు వస్తుంది. అలాగే గంటకు 80 కి.మీ. కన్నా తక్కువ వేగంతో వెళ్తున్నప్పుడు లోపలికి వెళ్లిపోతుంది. ఈ స్పాయిలర్ వెనుక వైపు 120 కేజీల డౌన్‌ఫోర్స్‌ను అప్లయ్ చేస్తుంది.

జాగ్వార్ ఎఫ్-టైప్ కూపే

అధిక ఛాస్సిస్ ధృఢత్వం, తక్కువ బరువు కారణంగా ఇది కన్వర్టిబల్ వెర్షన్ మంచి డ్రైవింగ్ అనుభూతిని అందిస్తుంది. (కన్వర్టిబల్ క్నా ఎఫ్-టైప్ వి6 కూపే దాదాపు 50 పౌండ్లు తక్కువ బరువును కలిగి ఉంటుంది. ఎఫ్-టైప్ ఆర్ కూపే బరువు మాత్రం వి8 కన్వర్టిబల్‌తో సమానంగా ఉంటుంది).

జాగ్వార్ ఎఫ్-టైప్ కూపే

ఎఫ్-టైప్ ఆర్ కూపే బరువు కన్వర్టిబల్ వెర్షన్‌తో సమానంగా ఉంటుంది కాబట్టి, దీని సస్పెన్షన్‌ను రీట్యూన్ చేశారు. అలాగే అడాప్టివ్ డ్యాంపింగ్ సాఫ్ట్‌వేర్ సెట్టింగ్స్‌ను కూడా మార్చారు. ఫలితంగా ఇది మరింత మెరుగైన పెర్ఫామెన్స్‌ను ఆఫర్ చేస్తుంది.

జాగ్వార్ ఎఫ్-టైప్ కూపే

ధరలు:

ఎఫ్-టైప్ కూపే - 65,000 డాలర్లు

ఎఫ్-టైప్ ఎస్ కూపే - 77,000 డాలర్లు

ఎఫ్-టైప్ ఆర్ కూపే - 99,000 డాలర్లు

జాగ్వార్ ఎఫ్-టైప్ కూపే

వచ్చే ఏడాది ఫిబ్రవరి నెలలో ఢిల్లీలో జరగనున్న 2014వ అంతర్జాతీయ మోటార్ షోలో జాగ్వార్ ఈ కొత్త ఎఫ్-టైప్ కూపే మోడళ్లను ఆవిష్కరించే అవకాశం ఉంది.

వీడియో

కొత్త జాగ్వార్ ఎఫ్-టైప్ కూపే అఫీషియల్ వీడియోను ఈ స్లైడ్‌లో వీక్షించండి.

Most Read Articles

English summary
One of the most beautiful car of our times has just got a permanent roof. Its the Jaguar F-Type Coupe that we have all been waiting for ever since the British automaker revealed the F-Type convertible last year. And its looks like everything we had hoped for. Jaguar F-Type Coupe is the production version of the C-X16 concept car that was first previewed at the 2011 Frankfurt Auto Show.
Story first published: Thursday, November 21, 2013, 13:03 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Drivespark sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Drivespark website. However, you can change your cookie settings at any time. Learn more