2013 సెమా ఆటో షో: అప్‌డేటెడ్ సివిక్ విడుదల

By Ravi

జపనీస్ ఆటోమొబైల్ దిగ్గజం హోండా మోటార్ కార్పోరేషన్ అందిస్తున్న సివిక్ కారును అప్‌డేట్ చేసింది. సరికొత్త డిజైన్, అధునాతన టెక్నాలజీ మరియు అబ్బురపరచే ఫీచర్లతో కొత్త 2014 ఎడిషన్ సివిక్‌ను అప్‌గ్రేడ్ చేశారు. ఈ కూపే (రెండు డోర్లు కలిగిన కారు) మరియు సెడాన్ (నాలుగు డోర్లు కలిగిన కారు) రూపంలో లభ్యం కానుంది.

అమెరికాలోని లాస్ వేగాస్ కన్వెన్షన్ సెంటర్‌లో జరుగుతున్న 2013 సెమా (స్పెషాలిటీ ఎక్విప్‌మెంట్ మార్కెట్ అసోషియేషన్) ఆటో షోలో హోండా ఈ కొత్త సివిక్‌ను ఆవిష్కరించింది. ఈ కొత్త 2014 హోండా సివిక్ కూపే స్పోర్టీ ఎక్స్టీరియర్ ప్రొఫైల్‌ను కలగి ఉంటుంది. ఇది రెండు వేరియంట్లలో (సివిక్ కూపే ఎస్ఐ, సివిక్ సెడాన్ ఎస్ఐ) లభిస్తుంది.

హాటో ఫొటోలు.. 2012 సెమా ఆటో షో గర్ల్స్


ఆకర్షనీయమైన గ్రిల్, కొత్త హెడ్‌లైట్స్ డిజైన్, కొత్త ఫ్రంట్ ఫెండర్స్, కొత్త సైడ్ మిర్రర్స్, స్టయిలిష్ అల్లాయ్ వీల్స్‌తో కొత్త సివిక్ సరికొత్త డిజైన్‌ను కలిగి ఉంటుంది. వెనుక వైపు డిజైన్‌లో కూడా మార్పులున్నాయి. డిజైన్ మార్పులను అటుంచితే, ఈ రెండు వేరియంట్లలో కూడా కొత్తగా రీ-ట్యూన్ చేసిన ఇంజన్లను ఉపయోగించారు. ఈ ఇంజన్ గరిష్టంగా 205 బిహెచ్‌పిల శక్తిని, 235 ఎన్ఎమ్‌ల టార్క్‌ను విడుదల చేస్తుంది.
Most Read Articles

English summary
Japanese carmaker Honda has revealed 2014 edition of Civic Coupe at the ongoing 2013 SEMA (Specialty Equipment Market Association) Auto Show.
Story first published: Friday, November 8, 2013, 11:07 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X