భారతదేశపు బెస్ట్ సెల్లింగ్ స్కూటర్ ఆక్టివా కు బ్రేకులు వేయనున్న హోండా నవీ

Written By:

ప్రతి ఒక్క విభాగంలో కూడా బెస్ట్ అనేది ఒకటి ఉంటుంది. ఇలా దేశ వ్యాప్తంగా గల స్కూటర్లలో ఉన్న ఏకైక స్కూటర్ హోండా ఆక్టివా. ఇవి మా మాటలు కాదు ప్రతి నెల కూడా లక్షకు పైగా దీనిని కొనుగోలు చేస్తున్న వినియోగదారుల నిర్ణయం ఇది. పదుల సంఖ్యలో పోటి ఉన్నప్పటికీ ఏ మాత్రం జంకు లేకుండా స్కూటర్ల మార్కెట్లో ఓ వెలుగు వెలుగుతోంది. ఎందుకంటే స్మూత్ రైడింగ్, చక్కటి బాడీ డిజైన్, స్కూటర్ల సెగ్మెంట్లో ఉత్తమ పనితీరు కనబరచడం మరియు ఎంతో సులభంగా రైడింగ్ చేయగలగడం ఈ కారణాలే దీనిని బెస్ట్ సెల్లింగ్ స్కూటర్‌గా ఎంపిక కావడానికి కారణం అయ్యాయి.

Also Read: చచ్చే లోపు ఇలాంటి వాటిని చూడగలరా...?

అయితే హోండా టూ వీలర్స్ అండ్ స్కూటర్స్ ఇండియా గత వారంలో జరిగిన 2016 ఇండియన్ ఆటో ఎక్స్ పో వేదిక మీద ఆకర్షణీయమైన ధరకు కళ్లుచెదిరే స్కూటర్‌ను ప్రదర్శించింది. దీనిని స్కూటర్ అని పిలవాలా లేదా బైకు అని సంభోదించాలా అనే సందేహంలో ఎంతో మంది ఉన్నారు. అయితే దీనిని స్కూటర్ల విభాగంలోకి చేర్చినట్లు హోండా తెలిపింది.

Also Read: దీని రాకతో మారుతి సుజుకి డిజైర్ ప్రక్కకు తప్పుకుంటోందా...?

డిజైన్, పనితీరు మరియు ధర విషయంలో ఆక్టివా కన్నా నవీ స్కూటర్‌ ఎంతో బాగుందని సందర్శకుల విమర్శ అందుకోసం రెండింటికి చెందిన పూర్తి వివరాలు ఇవ్వడం జరిగింది ఇందులో ఏది బెస్ట్ స్కూటరో మీరే చెప్పండి....

ధర వివరాలు:

 • హోండా నవీ ధర రూ. 46,000
 • హోండా ఆక్టివా ధర రూ. 53,000

రెండు ధరలు కూడా దాదాపుగా ఆన్-రోడ్ (ఢిల్లీ)గా ఇవ్వడం జరిగింది.

Also Read: 1.49 లక్షలతో ముచ్చటగా మూడు బైకులు విడుదల, వీటి దెబ్బతో రాయల్ ఎన్ఫీల్డ్ ఇంటికే

హోండా నవీ డిజైన్:

To Follow DriveSpark On Facebook, Click The Like Button
హోండా నవీ

హోండా నవీ టూవీలర్‌ను బైకుకు తక్కువ మరియు స్కూటర్‌కు ఎక్కువ అని చెప్పవచ్చు. ఇది చూడటానికి మోడరన్ రాజ్‌ధూత్‌ను పోలి ఉంటుంది. దీని ఎత్తును ఇష్టపడే వారు ఉంటారు మరియు దీని డిజైన్‌ను చూసి చీదరించుకునే వారు ఉంటారు. అయితే దీనిని చక్కగా మినీ బైకు అని పిలవవచ్చు. ప్రస్తుతం మార్కెట్లో దీనికి డిజైన్ పరంగా పోటి పడటానికి ఎటువంటి ఉత్పత్తులు లేవు.

హోండా ఆక్టివా డిజైన్:

హోండా ఆక్టివా

స్కూటర్లు ప్రారంభంలో లేడీస్ కోసం మాత్రమే విడుదల అయ్యాయి. కాని ఇప్పుడు స్త్రీ పురుష భేదం లేకుండా అందరూ ఎంచుకుంటున్నారు. హోండా వారి ఆక్టివా డిజైన్ తమ నవీ స్కూటర్ ముందు వెలవెలబోతోంది అని చెప్పవచ్చు. ఎందుకంటే అన్ని స్కూటర్లలా సాధారణ డిజైన్‌తో దర్శనం ఇస్తున్నట్లు ఉంటుంది. ముఖ్యంగా హోండా వారు ఈ మద్యనే విడుదల చేసిన రీడిజైన్డ్ ఆక్టివా మహిళలకోసమే అన్నట్లుగా ఉంది.

సాంకేతిక వివరాలు:

హోండా నవీ

హోండా నవీ ప్రస్తుతం 109సీసీ కెపాసిటి గల గాలితో చల్లబడే సింగిల్ సిలిండర్ ఇంజన్‌ను కలిగి ఉంది. ఇది దాదాపుగా 8 బిహెచ్‌పి పవర్ మరియు 8.8 ఎన్ఎమ్ టార్క్‌ను ఉత్పత్తి చేయును. ఇంజన్‌ విడుదల చేసే పవర్ వెనుక చక్రానికి ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌ ద్వారా అందుతుంది.

హోండా ఆక్టివా

హోండా ఆక్టివా ఐ మరియు 3జి రెండు వేరియంట్లలో కూడా 109సీసీ కెపాసిటి గల గాలితో చల్లబడే సింగిల్ సిలిండర్ ఇంజన్ కలదు. ఇది కూడా నవీ స్కూటర్‌ పవర్ మరియు టార్క్‌ను విడుదల చేయును. ఈ రెండు వేరియంట్లు ఆటోమేటిక్ గేర్ బాక్స్‌ను కలిగి ఉన్నాయి.

హోండా నవీ ఫీచర్లు:

హోండా నవీ
 • టెలిస్కోపిక్ ఫ్రంట్ ఫోర్క్స్
 • వెనుకవైపున మోనో షాక్ అబ్జార్వర్
 • రెండు వైపులా డ్రమ్ బ్రేకులు
 • అనలాగ్ మీటర్ కన్సోల్
 • ఎక్ట్సర్నల్ ఫ్యూయల్ ఫిల్లర్ క్యాప్
 • ఎలక్ట్రిక్ స్టార్ట్
 • ఇంధన ట్యాంక్ క్రింది వైపున స్టోరేజ్ స్పేస్
 • మొత్తానికి హోండా వారు తమ నవీ స్కూటర్‌లో ఆధునిక అవసరాలకు తగ్గట్లుగా ఫీచర్లు అందించారు.

  హోండా ఆక్టివా ఫీచర్లు:

   హోండా ఆక్టివా
 • రెండు వైపులా డ్రమ్ బ్రేకులు
 • అనలాగ్ స్పీడో మీటర్ కన్సోల్
 • ఎలక్ట్రిక్ స్టార్ట్
 • సీటు క్రింది వైపున ఇంధన ట్యాంకు
 • సీటు క్రింద గల స్టోరేజ్ స్పేస్
 • ట్యూబ్ లెస్ టైర్లు

భద్రత :

హోండా నవీ

భద్రత ఫీచర్ల విషయంలో హోండా నవీ మరియు హోండా ఆక్టివా రెండింటిలో కూడా కాంబి బ్రేక్ సిస్టమ్ (సిబిఎస్) కలదు. అంటే మీరు వెనుక బ్రేకును ఉపయోగిస్తే ఆటోమేటిక్‌గా ముందు బ్రేకు కూడా అప్లయ్ అవుతుంది. సిబియు తప్పితే ఈ రెండింటిలో ఎటువంటి భద్రత ఫీచర్లు లేవు.

తీర్పు:

హోండా నవీ

మీరు గుడ్డిగా ఏదో ఒక స్కూటర్‌ను ఎంచుకోవాలి అనుకుంటే హోండా ఆక్టివాను ఎంచుకోవచ్చు. ఎందుకంటే ఒక స్కూటర్‌కు ఉండవలసిన డిజైన్ మరియు ఫీచర్లు ఇందులో ఉన్నాయి.

కాని మీరు నూతనత్వాన్ని, అతి తక్కువ ధరలో ఎక్కువ ఫన్ పొందాలంటే నవీ స్కూటర్ కమ్ బైకును ఎంచుకోవచ్చు. ముఖ్యంగా దేశ వ్యాప్తంగా ఉన్న యువతను దృష్టిలో ఉంచుకుని దీనిని తయారు చేశారు మరియు ఇది సిటీ మరియు అన్ని రోడ్ల మీద చక్కటి రైడింగ్ అనుభూతిని ఇస్తుంది.

హోండా ఆక్టివా ఫోటోలు

హోండా నవీ కు చెందిన మరిన్ని ఫోటోల కోసం క్రింద గల ఇమేజ్‌లను క్లిక్ చేయండి.

English summary
Honda Navi vs Honda Activa Comparison
Please Wait while comments are loading...

Latest Photos

డ్రైవ్స్పార్క్ నుండి తాజా ఆటో అప్డేట్స్ పొందండి
Telugu Drivespark

X