ఇండియన్ స్కౌట్ సిక్ట్సి రివ్యూ: ధర, ఇంజన్, పనితీరు మరియు ఫోటోలు

Written By:

పొలారిస్ ఇండియాకు చెందిన ఇండియన్ మోటార్‌సైకిల్ కంపెనీ దేశీయ క్రూయిజ్ బైకుల సెగ్మెంట్లోకి స్కౌట్ సిక్ట్సి మిడ్ లెవల్ క్రూయిజ్ బైక్‌ను గత ఏడాది జూలైలో మార్కెట్లోకి విడుదల చేసింది. రూ. 14 లక్షలు (ఆన్ రోడ్) విలువైన ఈ బైకును టెస్ట్ డ్రైవ్ చేసి తెలుగులో రివ్యూ చేయడానికి ఇండియన్ మోటార్‌సైకిల్ కంపెనీ డ్రైవ్‌స్పార్క్‌ తెలుగుకు అవకాశం ఇచ్చింది.

ఇండియన్ స్కౌట్ సిక్ట్సి క్రూయిజర్ బైక్ యొక్క ఆఫ్ రోడ్ మరియు ఆన్ రోడ్ సామర్థ్యాలను పరీక్షించడానికి బెంగళూరు నుండి హార్స్‌లీ హిల్స్ వరకు రైడింగ్ చేయడం జరిగింది. నేటి కథనంలో స్కౌట్ సిక్ట్సి కంప్లీట్ రివ్యూ...

సీటింగ్ పొజిషన్ మరియు కంఫర్ట్

సీటింగ్ పొజిషన్ మరియు కంఫర్ట్

క్రూయిజ్ సెగ్మెంట్ బైకులకు ఉండాల్సిన ప్రధాన లక్షణాల్లో సౌకర్యవంతమైన సీట్ మరియు సౌలభ్యమైన రైడింగ్ పొజిషన్. ఇండియన్ స్కౌట్ సిక్ట్సి మిడ్ సైజ్ క్రూయిజ్ బైకు అయినప్పటికీ, 642ఎమ్ఎమ్ ఎత్తుల్లో సీట్ ఉంది. ఐదు నుండి 10 అడుగులు ఎత్తున్న రైడర్ల వరకు కాళ్లను చాపుకుని మరీ రైడ్ చేయవచ్చు.

ఇండియన్ స్కౌట్ సిక్ట్సి రివ్యూ

రైడ్ లేఔట్ విషయానికి వస్తే, పొట్టిగా ఉన్న రైడర్లకు దీనిని హ్యాండిల్ చేయడం కాస్త కష్టమే. వెడల్పాటి హ్యాండిల్ బార్, సీటు నుండి దూరంగా ఉన్న హ్యాండిల్ మరియు బ్రేక్, గేర్ పెడల్స్ ఉన్నాయి. కాళ్లు నేలకు తాకడంలో ఎలాంటి ఇబ్బందులు ఉండవు.

రూట్ (రివ్యూ చేయడానికి ఎంచుకున్న మార్గం)

రూట్ (రివ్యూ చేయడానికి ఎంచుకున్న మార్గం)

క్రూయిజ్ బైకుని నాలుగైదు కిలోమీటర్లు మాత్రమే నడిపి రివ్యూ చేయలేం. కాబట్టి బెంగళూరు నుండి ఆంధ్రప్రదేశ్‌లోని చిత్తూరు జిల్లాలో మదనపల్లికి సమీపంలో ఉన్న హార్స్‌లీ హిల్స్‌ మార్గాన్ని రివ్యూ కోసం ఎంచుకోవడం జరిగింది. సముద్ర మట్టానికి 1,265 మీటర్ల ఎత్తులో ఉన్న ఈ ప్రాంతాన్ని చేరుకోవడానికి బెంగళూరు నుండి 150కిమీలు మరియు చెన్నై నుండి 274కిమీలు ప్రయాణించాల్సి ఉంటుంది.

ఇండియన్ స్కౌట్ సిక్ట్సి రివ్యూ

ఇండియన్ స్కౌట్ సిక్ట్సి మీద బెంగళూరు నుండి హార్స్‌లీ హిల్స్‌కు రైడ్ స్టార్ట్ చేశాక కొన్ని కిలోమీటర్ల మేర ఎలాంటి మలుపులు లేకుండా పొడవాటి రోడ్ల మీద సాఫీగా సాగిపోయాము. అయితే హార్స్‌లీ హిల్స్‍కు చేరువలో ఉన్నపుడు భారీ మలుపులను ఎదుర్కోవలసి వచ్చింది. మలుపుల్లో కూడా ఎలాంటి ఒడిదుడుకులు లేకుండా దూసుకెళ్లింది స్కౌట్ సిక్ట్సి.

ఇంజన్

ఇంజన్

ఇండియన్ స్కౌట్ సిక్ట్సి రైడ్‌లో ఎక్కువగా ఆకట్టుకున్న అంశం ఇంజన్. ఇందులో 999సీసీ సామర్థ్యం గల లిక్విడ్ కూల్డ్ వి-ట్విన్ స్మూత్ ఇంజన్ కలదు. ఎలాంటి వేగం వద్దనైనా యాక్సిలరేట్ చేసే తీరుకు అద్బుతమైన ప్రతిస్పందన కనబరిచింది.

ఇండియన్ స్కౌట్ సిక్ట్సి రివ్యూ

గతంలోని ఇండియన్ స్కౌట్ సిక్ట్సి వద్ద ఉన్న 1133సీసీ ఇంజన్ ఆధారంగా ఈ 999సీసీ ఇంజన్‌ను అభివృద్ది చేయడం జరిగింది. ఈ శక్తివంతమైన వి-ట్విన్ ఇంజన్ గరిష్టంగా 78బిహెచ్‌పి పవర్ మరియు 88.8ఎన్ఎమ్ టార్క్ ఉత్పత్తి చేయగలదు.

ఇండియన్ స్కౌట్ సిక్ట్సి రివ్యూ

కొన్ని మైళ్ల పాటు ఉన్న పొడవాటి మరియు మలుపులున్న రహదారిని ఛేదించి మొత్తానికి హార్స్‌లీ హిల్స్ అంచులను చేరుకున్నాము. మలుపుల్లో గరిష్టంగా 31 డిగ్రీల కోణం వరకు వంపి మరీ డ్రైవ్ చేశాము. వెనుక వైపున లిమిటెడ్ ట్రావెల్ సస్పెన్షన్ ఉన్నప్పటికీ అత్యుత్తమ సస్పెన్షన్ మరియు నాణ్యమైన స్టాపింగ్ పవర్ కనబరిచింది.

ఇండియన్ స్కౌట్ సిక్ట్సి రివ్యూ

999సీసీ ఇంజన్‌కు అనుసంధానం చేయబడి 5-స్పీడ్ గేర్‌బాక్స్ మరియు రైడ్ బై వైర్ ఫ్యూయల్ ఇంజెక్షన్ సిస్టమ్ ద్వారా కేవలం 2,000ఆర్‌పిఎమ్(ఇంజన్ వేగం) వద్ద అత్యుత్తమ టార్క్ ఉత్పత్తి అయ్యింది, మరియు గంటకు 120కిలోమీటర్ల వేగాన్ని చాలా సులువుగా అందుకోవడం జరిగింది. అయితే వేగం పెరిగే కొద్దీ వచ్చిన చిన్నపాటి వైబ్రేషన్ దీనికి సెట్ అవలేదు.

ఇండియన్ స్కౌట్ సిక్ట్సి రివ్యూ

అదనంగా, అన్ని రోడ్లను చీల్చుకుంటూ, దూసుకెళ్లేందుకు 16-అంగుళాల టైరును ముందువైపున అందివ్వడం జరిగింది. అయితే తక్కువ ఇంజన్ కెపాసిటీ ఉన్న బైకులతో సర్రుమని దూసుకెళ్లినట్లు ఇందులో ఏ మాత్రం కుదరదు. స్కౌట్ సిక్ట్సి వేగాన్ని పెంచే కొద్దీ, రైడింగ్ పట్ల మీలో ఏకాగ్రత పెరుగుతుంది.

ఇండియన్ స్కౌట్ సిక్ట్సి గురించి!

ఇండియన్ స్కౌట్ సిక్ట్సి గురించి!

  • ధర: రూ. 14 లక్షలు (ఆన్ రోడ్)
  • ఫ్యూయల్ ట్యాంక్ కెపాసిటి: 12.5 లీటర్లు
  • మైలేజ్: లీటర్‌కు 15 కిలోమీటర్లు (అంచనా)
  • ఫ్యూయల్ రేంజ్: ట్యాంప్ ఫుల్ చేస్తే 200కిలోమీటర్లు ప్రయాణించవచ్చు(అంచనా)
  • పవర్: 7,300ఆర్‌పిఎమ్ వద్ద 78బిహెచ్‌పి
  • టార్క్: 5,800ఆర్‌పిఎమ్ వద్ద 88.8ఎన్ఎమ్
  • గరిష్ట వేగం గంటకు: 180కిలోమీటర్లు
చివరగా...

చివరగా...

క్రూయిజర్ బైకులను ఇష్టపడే ఇండియన్స్‌కు అనుగుణంగా ఇండియన్ మోటార్‌సైకిల్ తమ స్కౌట్ సిక్ట్సిను అభివృద్ది చేసింది. ప్రతి ఇండియన్ రైడర్ అంగీకరించే బ్రాండ్ ఇండియన్ మోటార్‌సైకిల్ అమెరికన్ మోటార్‌సైకిల్స్ బ్రాండ్, ఇది 1901లో ప్రారంభమైంది.

డ్రైవ్‌స్పార్క్ తెలుగు అభిప్రాయం!

డ్రైవ్‌స్పార్క్ తెలుగు అభిప్రాయం!

ఎలాంటి దూరమైనా... సాధారణంగా లేదంటే బ్యాడ్ బాయ్ స్టైల్లో ఎలా డ్రైవ్ చేసినా మీలోని రైడింగ్ స్టైల్‌ను ఆవిష్కరిస్తుంది ఇండియన్ స్కౌట్ సిక్ట్సి. ప్రయాణంలో భద్రత పరంగా రాజీపడిని సాంకేతిర పరిజ్ఞానాన్ని ఇందులో అందివ్వడం జరిగింది.

పది లక్షల పైన ధరతో మిడ్ సైజ్ క్రూయిజర్ ఎంచుకోవాలనుకునే వారికి ఇండియన్ స్కౌట్ సిక్ట్సి బెస్ట్ ఛాయిస్...

ఇవి తెలుసా ?

ఇవి తెలుసా ?

ఇండియన్ స్కౌట్ సిక్ట్సి పేరు ఎలా వచ్చిందో తెలుసా ? ఇండియన్ స్కౌట్‌లోని సిక్ట్సిని ఇంజన్ యొక్క సామర్థ్యం 60 క్యూబిక్ ఇంచులలో కొలిచే అమెరికా పద్దతి నుండి వచ్చింది. ఇది 999సీసీ కు సమానం.

ఇండియన్ మోటార్‌సైకిల్

ఇండియన్ మోటార్‌సైకిల్

1887లో సైకిళ్లను తయారు చేసే హెండీ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీగా ప్రారంభమయ్యింది. సిల్వర్ కింగ్, సిల్వర్ క్వీన్ మరియు అమెరికన్ ఇండియన్ అనే బ్రాండ్ ఉత్పత్తులను తయారుచేసేది. 1901లో మొదటిసారిగా గ్యాసోలీన్ ఇంజన్‌తో నడిచే మోటార్ సైకిళ్లను తయారు చేసే మొదటి ప్రొడక్షన్ ప్లాంటును ఏర్పాటు చేసింది. 1928 నాటికి ఇండియన్ అనే బ్రాండ్ పేరుగా రూపాంతరం చెందింది.

పొలారిస్ ఇండస్ట్రీస్

పొలారిస్ ఇండస్ట్రీస్

1953లో ఇండియన్ మోటార్‌సైకిల్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ కార్యకలాపాలను పూర్తిగా నిలిపివేసింది. అనేక కంపెనీలు దీనిని సొంతం చేసుకోవాలని ప్రయత్నించాయి. మంచు మీద నడిచే వెహికల్స్, ఆఫ్ రోడింగ్ మరియు ఎలక్ట్రిక్ వాహనాల తయారీ సంస్థ పొలారిస్ ఇండస్ట్రీస్ ఇండియన్ మోటార్‌సైకిల్‌ను సొంతం చేసుకుంది. 2014 లో పొలారిస్ ఇండియా విభాగం, ఇండియన్ మోటార్‌సైకిల్ బ్రాండ్‌ను దేశీయంగా పరిచయం చేసింది.

ఇండియన్ స్కౌట్ సిక్ట్సి రివ్యూ

ఇండియన్ మోటార్‌సైకిల్ మరియు రాయల్ ఎన్ఫీల్డ్ మధ్య అనుబంధం: 1953లో ఇండియన్ మోటార్‌సైకిల్ పూర్తిగా కార్యకలాపాలు నిలిపివేసిన తరువాత, ఇండియన్ మోటార్‌సైకిల్ పేరును ఉపయోగించుకునే హక్కులను 1955లో బ్రోక్ హౌస్ ఇంజనీరింగ్ కొనుగోలు చేసింది. 1960 నుండి రాయల్ ఎన్ఫీల్డ్ బైకులను దిగుమతి చేసుకుని ఇండియన్ మోటార్‌సైకిల్ బ్రాండ్ పేరుతో విక్రయించడం చేసింది బ్రోక్ హౌస్ ఇంజనీరింగ్ సంస్థ.

English summary
Read In Telugu: Indian Scout Sixty Review
Story first published: Friday, June 16, 2017, 12:43 [IST]

Latest Photos

డ్రైవ్స్పార్క్ నుండి తాజా ఆటో అప్డేట్స్ పొందండి
Telugu Drivespark