YouTube

కొత్త బైక్ అయినా రైడింగ్‌లో చిత్తు చిత్తు చేస్తుంది.. Moto Morini X-Cape 650X రివ్యూ

భారతీయ మార్కెట్లో ఎక్కువ మందికి తెలిసిన టూవీరల్ కంపెనీలు వేళ్ళమీద లెక్కపెట్టేయొచ్చు. అయితే కొన్ని కంపెనీల వాహనాలే కాదు, ఆ కంపెనీల పేర్లు కూడా చాలా మందికి తెలియదు అంటే అది ఏ మాత్రం అతిశయోక్తి కాదు. ఇందులో ఒకటి 'మోటో మోరిని' (Moto Morini). ఈ పేరు దేశీయ మార్కెట్లో చాలామందికి తెలియదు.

కొత్త బైక్ అయినా రైడింగ్‌లో చిత్తు చిత్తు చేస్తుంది.. Moto Morini X-Cape 650X రివ్యూ

నిజానికి 'మోటో మోరిని' అనేది ఇటాలియన్ కంపెనీ. ఈ కంపెనీ 350 సీసీ మరియు 500 సిసి బైకులకు ప్రసిద్ధి చెందింది. అయితే మన దేశంలో హైదరాబాద్ కు చెందిన 'ఆదీశ్వర్ ఆటో రైడ్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్' (Adishwar Auto Ride India Pvt Ltd) తో కలిసి మార్కెట్లోకి ప్రవేశించింది.

కొత్త బైక్ అయినా రైడింగ్‌లో చిత్తు చిత్తు చేస్తుంది.. Moto Morini X-Cape 650X రివ్యూ

ఇటీవల మోటో మోరిని విడుదల చేసిన కొత్త బైకుల్లో ఒకటి 'మోటో మోరిని ఎస్-కేప్ 650ఎక్స్' (Moto Morini X-Cape 650X). మేము ఈ కొత్త బైకుని హైదరాబాద్ నగరంలో టెస్ట్ చేసాము. కావున ఈ కొత్త కంపెనీ యొక్క కొత్త బైక్ ఎలాంటి డిజైన్ కలిగి ఉంది, ఫీచర్స్ ఏమిటి? రైడ్ చేయడానికి ఎలా ఉంది అనే మరిన్ని వివరాలు ఈ రివ్యూలో చూసేద్దాం.. రండి.

కొత్త బైక్ అయినా రైడింగ్‌లో చిత్తు చిత్తు చేస్తుంది.. Moto Morini X-Cape 650X రివ్యూ

Moto Morini X-Cape 650X డిజైన్ & ఫీచర్స్:

మోటో మోరిని పేరు వినగానే ఆ కంపెనీ బైక్ ఎలాంటి డిజైన్ కలిగి ఉంటుంది అనే ప్రశ్న చాలా మంది మనసులో పుట్టే ఉంటుంది. అయితే మీ ప్రశ్నకు ఒక మంచి సమాచారం ఇక్కడ చూసేయొచ్చు..

Moto Morini X-Cape 650X బైక్ చాలా స్టైలిష్ లుక్ కలిగి చాలా గంభీరంగా కనిపిస్తుంది. ఇందులో యాంగ్యులర్ ట్విన్ హెడ్‌ల్యాంప్‌ కలిగి హై-సెట్ ఫెయిరింగ్ మరియు దాని పైన కూర్చున్న కేప్ లాంటి అడ్జస్టబుల్ విండ్‌స్క్రీన్ ఫ్రంట్ ఎండ్‌లో చూడచక్కగా ఉంటుంది. ఇందులోని ఫ్యూయెల్ ట్యాంక్ కూడా దీనికి మరింత ఆకర్షణను తీసుకువస్తుంది. అంతే కాకూండా సైడ్ ఎగ్జాస్ట్, వైడ్ స్ప్లిట్ సీట్, స్పోక్డ్ వీల్స్ మొదలైనవన్నీ కూడా చాలా అట్రాక్టివ్ గా ఉంటాయి.

కొత్త బైక్ అయినా రైడింగ్‌లో చిత్తు చిత్తు చేస్తుంది.. Moto Morini X-Cape 650X రివ్యూ

ఇక ఫీచర్స్ విషయానికి వస్తే, ఇందుల 7 ఇంచెస్ TFT డిస్ప్లే ఉంటుంది. ఇది బ్లూటూత్ కనెక్టివిటీని పొందుతుంది. అదే సమయంలో ఈ TFT డిస్ప్లే చాలా స్పష్టంగా కనిపించడమే కాకుండా వినియోగించడానికి మరింత అనుకూలంగా ఉంటుంది. ఇందులో ఇంకో ముఖ్యమైన విషయం ఏమిటంటే ఇందులో డ్యూయల్ USB ఛార్జింగ్ పోర్ట్‌లు అందుబాటులో ఉన్నాయి.

కొత్త బైక్ అయినా రైడింగ్‌లో చిత్తు చిత్తు చేస్తుంది.. Moto Morini X-Cape 650X రివ్యూ

మోటో మోరిని ఎస్-కేప్ 650ఎక్స్ గురించి ఇంకా చెప్పాలంటే ఇందులో స్విచ్‌గేర్‌లు కూడా రైడర్ కి అనుకూలంగా ఉన్నాయి. సైడ్ ప్రొఫైల్ లో మోరిని మరియు ఎక్స్-కేప్ వంటి బ్యాడ్జెస్ చూడవచ్చు. ఇవన్నీ కూడా బ్రాండ్ ను గుర్తుకి తీసుకురావడంలో సహాయపడతాయి.

కొత్త బైక్ అయినా రైడింగ్‌లో చిత్తు చిత్తు చేస్తుంది.. Moto Morini X-Cape 650X రివ్యూ

Moto Morini X-Cape 650X ఇంజిన్ & స్పెక్స్:

ఏ వాహనంలో అయినా ప్రధానంగా చెప్పుకోదగ్గది ఇంజిన్. కావున ఈ Moto Morini X-Cape 650X బైకులో లిక్విడ్ కూల్డ్ 649 సిసి ట్విన్-సిలిండర్ ఇంజన్ ఉపయోగించారు. ఇది 8,250 ఆర్‌పిఎమ్ వద్ద 59 బిహెచ్‌పి పవర్‌ మరియు 7,000 ఆర్‌పిఎమ్ వద్ద 54 ఎన్ఎమ్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. ఇది 6-స్పీడ్ గేర్‌బాక్స్ కి జతచేయబడి ఉంటుంది. కావున మంచి పనితీరుని అందిస్తుంది.

కొత్త బైక్ అయినా రైడింగ్‌లో చిత్తు చిత్తు చేస్తుంది.. Moto Morini X-Cape 650X రివ్యూ

Moto Morini X-Cape 650X పరిమాణం పరంగా కూడా చాలా అనుకూలంగా ఉంది. ఈ బైక్ పొడవు 2,200 మిమీ, వెడల్పు 900 మిమీ మరియు ఎత్తు 1,390 మిమీ వరకు ఉంటుంది. కాగా ఈ బైక్ యొక్క వీల్ బేస్ విషయానికి వస్తే ఇది 1,490 మిమీ వరకు ఉంటుంది మరియు గ్రౌండ్ క్లియరెన్స్ 650X 175 మిమీ ఉంటుంది.

కొత్త బైక్ అయినా రైడింగ్‌లో చిత్తు చిత్తు చేస్తుంది.. Moto Morini X-Cape 650X రివ్యూ

ఈ బైక్ యొక్క ఫ్యూయెల్ కెపాసిటీ 18 లీటర్ల వరకు ఉంటుంది, కావున లాంగ్ రైడ్ చేయడానికి కూడా ఈ బైక్ ఉపయోగకరంగా ఉంటుంది. మొత్తం మీద ఈ బైక్ బరువు కేవలం 215 కేజీలు మాత్రమే. కావున రైడర్ కి మంచి రైడింగ్ అనుభూతిని అందిస్తుంది.

కొత్త బైక్ అయినా రైడింగ్‌లో చిత్తు చిత్తు చేస్తుంది.. Moto Morini X-Cape 650X రివ్యూ

ఇక బ్రేకింగ్ విషయానికి వస్తే, ఈ బైక్ యొక్క ముందు భాగంలో ఫోర్ పిస్టన్ కాలిపర్‌లతో డ్యూయల్ 298 మిమీ ఫ్లోటింగ్ డిస్క్‌లు మరియు వెనుక భాగంలో టు పిస్టన్ కాలిపర్‌లతో ఒకే 255 మిమీ డిస్క్ బ్రేక్ ఉంటుంది. ఇవి డ్యూయెల్ ఛానల్ ఏబీఎస్ కి కూడా సఫోర్ట్ చేస్తాయి.

కొత్త బైక్ అయినా రైడింగ్‌లో చిత్తు చిత్తు చేస్తుంది.. Moto Morini X-Cape 650X రివ్యూ

సస్పెన్సన్ విషయానికి వస్తే, ఇందులో ఫుల్లీ అడ్జస్టబుల్ మార్జోచి అప్‌సైడ్-డౌన్ ఫోర్క్ మరియు ప్రీ-లోడ్ అండ్ రీబౌండ్ అడ్జస్ట్‌మెంట్ రెండింటితో కూడిన కయాబా మోనో-షాక్‌ ఉన్నాయి. అదే సమయంలో ఈ బైక్ ముందు వైపు 19 ఇంచెస్ వీల్ మరియు వెనుక వైపు 17 ఇంచెస్ వీల్స్ ఉన్నాయి. వీల్స్ రెండూ కూడా పిరెల్లి స్కార్పియన్ STR ట్యూబ్‌లెస్ టైర్‌లను పొందుతాయి. కావున రైడింగ్ చేయడానికి అనుకూలంగా ఉంటుంది.

కొత్త బైక్ అయినా రైడింగ్‌లో చిత్తు చిత్తు చేస్తుంది.. Moto Morini X-Cape 650X రివ్యూ

Moto Morini X-Cape 650X రైడింగ్ ఇంప్రెషన్స్:

ఇప్పుడు అందరూ అందరూ చూస్తున్న ఈ కొత్త బైక్ రైడింగ్ చేయడానికి ఎలా ఉంటుంది అనే ప్రశ్నకు సమాధానం తెలుసుకునే సమయం ఆసన్నమైంది.

ఇది వరకు చెప్పుకున్నట్లుగానే ఈ బైకులోని 649 సిసి ఇంజిన్ 59 బిహెచ్‌పి పవర్‌ మరియు 54 ఎన్ఎమ్ టార్క్ అందిస్తుంది. అయితే ఇది కంపెనీ అందించిన గణాంకాలు మాత్రమే. నిజానికి ఇది మరింత ఎక్కువ పర్ఫామెన్స్ మరియు ఎక్కువ అవుట్‌పుట్ అందిస్తున్నట్లు అనిపిస్తుంది.

కొత్త బైక్ అయినా రైడింగ్‌లో చిత్తు చిత్తు చేస్తుంది.. Moto Morini X-Cape 650X రివ్యూ

ఈ కొత్త బైక్ లో రేవ్స్ వద్ద ఇంజిన్ అంత ఎక్కువ టార్క్‌ చూపించదు. ఆ సమయంలో బైక్ నెమ్మదిగా ఉన్నట్లు అనిపిస్తుంది. కాగా రెవ్స్ పెరిగికొద్దీ బైక్ వేగం కూడా పెరుగుతుంది, అదే విధంగా ఇది టాప్ ఎండ్ చేరుకుంటుంది. ఆ సమయంలో మీ రైడింగ్ చాలా హుందాగా అనిపిస్తుంది.

కొత్త బైక్ అయినా రైడింగ్‌లో చిత్తు చిత్తు చేస్తుంది.. Moto Morini X-Cape 650X రివ్యూ

మీరు రైడింగ్ ప్రారంభించిన తక్కువ కాలంలోనే ఇది అద్భుతమైన బైక్ అని తప్పకుండా గుర్తిస్తారు. ట్రిబుల్ డిజిట్ వద్ద కూడా మీరు మంచి వేగంతో ముందుకు వెళ్ళగలరు. బైక్ మీకు అన్ని విధాలుగా సహకరిస్తుంది.

కొత్త బైక్ అయినా రైడింగ్‌లో చిత్తు చిత్తు చేస్తుంది.. Moto Morini X-Cape 650X రివ్యూ

ఇక రైడింగ్ పొజిషన్ విషయానికి వస్తే, ఇది కూడా రైడర్ కి అనుకూలంగా ఉంటుందనే చెప్పాలి. ముందు భాగంలోమీకు ఒక విండ్‌స్క్రీన్ కూడా లభిస్తుంది. ఈ బైక్ లో మీరు నిలబడి రైడ్ చేయడానికి కూడా ఏ మాత్రం ఎక్కువ కష్టపడాల్సిన పనిలేదు. ఇది మీకు ఒక అద్భుతమైన అనుభవాన్ని కలిగిస్తుంది, ఫ్యూయెల్ ట్యాంక్ కూడా నిలబడి రైడ్ చేసే సమయంలో సహాయం చేస్తుంది.

కొత్త బైక్ అయినా రైడింగ్‌లో చిత్తు చిత్తు చేస్తుంది.. Moto Morini X-Cape 650X రివ్యూ

ఈ బైకులో అద్భుతమైన సస్పెన్షన్ సెటప్ ఉండటం వల్ల ఎలాంటి రోడ్డులో (గుంతలు & స్పీడ్‌బంప్‌) అయినా కూడా సులభంగా ముందుకు సాగవచ్చు. మొత్తం మీద ఈ బైక్ ఆఫ్ రోడింగ్ లో చాలా అద్భుతమైన పర్ఫామెన్స్ అందించింది. ఇది ఆఫ్ రోడింగ్ సమయంలో మమ్మల్ని ఎంతగానో ఆకట్టుకుంది.

కొత్త బైక్ అయినా రైడింగ్‌లో చిత్తు చిత్తు చేస్తుంది.. Moto Morini X-Cape 650X రివ్యూ

మొత్తం మీద ఈ Moto Morini X-Cape 650X బైక్ రైడింగ్ చేయడానికి అనుకూలంగా ఉంది, కానీ ఇంజిన్ త్వరగా వేడెక్కుతోంది. ఈ వేడి ట్రాఫిక్‌లో రైడర్ ని కొంత ఇబ్బందిపెట్టే అవకాశం ఉంటుంది. అయితే ఇందులో చాలా తక్కువ వైబ్రేషన్‌లు ఉన్నాయి. ఇవన్నీ కూడా రైడర్ కి ఎక్కువ ఇబ్బంది కలిగించే అవకాశం ఏ మాత్రం లేదని చెప్పవచ్చు.

కొత్త బైక్ అయినా రైడింగ్‌లో చిత్తు చిత్తు చేస్తుంది.. Moto Morini X-Cape 650X రివ్యూ

డ్రైవ్‌స్పార్క్ అభిప్రాయం:

ఆధునిక కాలంలోని విడుదలైన ఈ లేటెస్ట్ Moto Morini X-Cape 650X బైక్ రైడింగ్ చేయడానికి చాలా అద్భుతంగా అనిపిస్తుంది. కానీ ఈ బైకుని మేము ఎక్కువ సమయం రైడ్ చేయలేకపోయాము. అయినప్పటికీ ఇది అతి తక్కువ కాలంలోనే మమ్మల్ని ఎంతగానో ఆకర్శించింది. ఈ బైక్ దేశీయ మార్కెట్లో కవాసకి Versys 650, సుజుకి వి-స్ట్రామ్ 650XT మరియు ట్రయంఫ్ టైగర్ 660 వంటి వాటికి ప్రత్యర్థిగా ఉంటుంది.

Most Read Articles

English summary
New moto morini x cape 650x first ride review riding impressions specs and features details
Story first published: Friday, October 14, 2022, 15:15 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X