ఓలా ఎస్1 ప్రో కోసం మూవ్ ఓఎస్ 2.0 అప్‌డేట్ వచ్చేసింది.. ఇప్పుడు మరిన్ని కొత్త ఫీచర్లు మరియు అధిక రేంజ్‌తో..

ఇప్పుడు ఎలక్ట్రిక్ స్కూటర్ విభాగంలో అగ్రగామిగా ఉన్న బ్రాండ్ ఓలా ఎలక్ట్రిక్ (Ola Electric). భారతదేశంలో ఎక్కడ చూసినా మరియు ఎక్కడా విన్నా ఓలా ఎస్1 మరియు ఎస్1 ప్రో స్కూటర్ల గురించే మాట్లాడుకుంటున్నారు. ఓలా తమ ఎలక్ట్రిక్ స్కూటర్లను భారత మార్కెట్లో విడుదల చేసి దాదాపు 10 నెలలు పూర్తయింది. ఈ నేపథ్యంలో తమ స్కూటర్ల విషయంలో వచ్చిన సలహాలు, సూచనలు మరియు ఫిర్యాదులను కంపెనీ పరిగణలోకి తీసుకొని ఇప్పుడు తమ ఓలా ఎస్1 ప్రో స్కూటర్ యూజర్ల కోసం ఓ కొత్త సాఫ్ట్‌వేర్ అప్‌డేట్‌ని తీసుకువచ్చింది.

ఓలా ఎస్1 ప్రో కోసం మూవ్ ఓఎస్ 2.0 అప్‌డేట్ వచ్చేసింది.. ఇప్పుడు మరిన్ని కొత్త ఫీచర్లు మరియు అధిక రేంజ్‌తో..

స్మార్ట్‌ఫోన్‌లలో వచ్చే సాఫ్ట్‌వేర్ అప్‌డేట్ మాదిరిగానే, ఓలా ఎస్1 ప్రో (Ola S1 Pro) స్కూటర్ కోసం కూడా కంపెనీ ఓటిఏ (ఓవర్ ది ఎయిర్) ద్వారా ఓ కొత్త అప్‌డేటెడ్ ఓఎస్ (ఆపరేటింగ్ సిస్టమ్) ను అందుబాటులోకి తెచ్చింది. ఈ సాఫ్ట్‌వేర్ అప్‌డేట్‌ని ఇన్‌స్టాల్ చేసుకోవడం ద్వారా ప్రతిసారి ఓలా ఎస్1 ప్రో యొక్క రైడింగ్ అనుభవాన్ని మరింత మెరుగుపరచుకోవచ్చని కంపెనీ చెబుతోంది.

ఓలా ఎస్1 ప్రో కోసం మూవ్ ఓఎస్ 2.0 అప్‌డేట్ వచ్చేసింది.. ఇప్పుడు మరిన్ని కొత్త ఫీచర్లు మరియు అధిక రేంజ్‌తో..

మూవ్ ఓఎస్ 2.0 (Move OS 2.0) పేరుతో కంపెనీ ఓలా ఎస్1 ప్రో పనితీరును మెరుగుపరిచి మరియు రైడర్లకు అత్యుత్తమ రైడింగ్ అనుభవాన్ని అందించే అనేక ఫీచర్లతో ఈ అప్‌డేట్‌ను అందుబాటులోకి తెచ్చింది. మూవ్ ఓఎస్ 2.0 లో భాగంగా యూజర్లకు లభించే అన్ని కొత్త ఫీచర్ల వివరాలు ఇలా ఉన్నాయి:

ఓలా ఎస్1 ప్రో కోసం మూవ్ ఓఎస్ 2.0 అప్‌డేట్ వచ్చేసింది.. ఇప్పుడు మరిన్ని కొత్త ఫీచర్లు మరియు అధిక రేంజ్‌తో..

1. కొత్త ఎకో మోడ్.. ఇప్పుడు మరింత ఎక్కువ రేంజ్‌తో..

మూవ్ ఓఎస్ 2.0 సాఫ్ట్‌వేర్ అప్‌డేట్‌లో భాగంగా కంపెనీ ఓ కొత్త ఎకో మోడ్‌ను పరిచయం చేసింది. ఇది మునుపటి ఎకో మోడ్ స్థానాన్ని భర్తీ చేయడమే కాకుండా రైడర్లకు మరింత మెరుగైన రేంజ్ మరియు పనితీరు యొక్క సమతౌల్యను అందిస్తుంది. ఈ కొత్త ఎకో మోడ్ బ్యాటరీ డ్రాప్ సమస్యను పరిష్కరించడమే కాకుండా, రేంజ్ విషయంలో కస్టమర్లు చెందుతున్న ఆందోళనను కూడా తొలగిస్తుంది.

ఓలా ఎస్1 ప్రో కోసం మూవ్ ఓఎస్ 2.0 అప్‌డేట్ వచ్చేసింది.. ఇప్పుడు మరిన్ని కొత్త ఫీచర్లు మరియు అధిక రేంజ్‌తో..

ఏఆర్ఏఐ (ఆటోమోటివ్ రీసెర్చ్ అసోసియేషన్ ఆప్ ఇండియా) యొక్క టెస్టింగ్ కండిషన్స్ ప్రకారం, ఓలా ఎస్1 ప్రో ఎలక్ట్రిక్ స్కూటర్ పూర్తి చార్జ్ పై గరిష్టంగా 181 కిమీ సర్టిఫైడ్ రేంజ్‌ను అందిస్తుంది. అయితే, దీని వాస్తవ రేంజ్ సుమారు 135 కిమీ ఉంటుంది. కానీ, కంపెనీ ఈ కొత్త అప్‌డేట్‌లో చేసిన మార్పుల కారణంగా, కొత్త ఎకో మోడ్‌లో కస్టమర్లు ఇప్పుడు పూర్తి చార్జ్ పై గరిష్టంగా 170 కిమీల వరకూ రియల్ టైమ్ రేంజ్‌ని పొందవచ్చని చెబుతోంది.

ఓలా ఎస్1 ప్రో కోసం మూవ్ ఓఎస్ 2.0 అప్‌డేట్ వచ్చేసింది.. ఇప్పుడు మరిన్ని కొత్త ఫీచర్లు మరియు అధిక రేంజ్‌తో..

అంతేకాకుండా, ఈ కొత్త మూవ్ ఓఎస్ 2.0 అప్‌డేట్ ఇప్పటికే కస్టమర్‌లలో ఇప్పటికే 100 మందికి పైగా పూర్తి చార్జ్ పై 200 కిమీ రేంజ్ ని సాధించినట్లు కంపెనీ తెలిపింది. మరి ఈ కొత్త ఎకో మోడ్‌ని యాక్టివేట్ లేదా డీయాక్టివేట్ చేయడం ఎలా? ఓలా ఎస్1 ప్రో ఎలక్ట్రిక్ స్కూటర్ కుడిచేతి వైపు ఉన్న DPADలో ఎడమ ఎగువన ఉండే బటన్‌ను ఎక్కువసేపు నొక్కడం ద్వారా కొత్త ఎకో మోడ్‌ని యాక్టివేట్ చేయవచ్చు మరియు తిరిగి అదే బటన్‌ను లాంగ్ ప్రెస్ చేయడం ద్వారా ఎకో మోడ్‌ని డీయాక్టివేట్ చేయవచ్చు.

ఓలా ఎస్1 ప్రో కోసం మూవ్ ఓఎస్ 2.0 అప్‌డేట్ వచ్చేసింది.. ఇప్పుడు మరిన్ని కొత్త ఫీచర్లు మరియు అధిక రేంజ్‌తో..

2. క్రూయిజ్ కంట్రోల్.. ఇప్పుడు యాక్సిలరేటర్‌తో పనిలేకుండా రైడ్ చేయొచ్చు..

ఈ సాఫ్ట్‌వేర్ అప్‌డేట్‌లో భాగంగా కంపెనీ తమ ఓలా ఎస్1 ప్రో ఎలక్ట్రిక్ స్కూటర్‌లో తీసుకువచ్చిన మరొక ఇండస్ట్రీ ఫస్ట్ ఫీచర్ 'క్రూయిజ్ కంట్రోల్'. రద్దీ లేని మార్గాల్లో (హైవేలపై) గంటకు 20 కిమీ నుండి గంటకు 80 కిమీ మధ్య స్థిరమైన వేగంతో రైడ్ చేయాలనుకునే రైడర్‌లు ఏదైనా మోడ్‌లో (ఎకో మోడ్ మినహా) ఈ క్రూయిజ్ కంట్రోల్ ఫీచర్‌ను యాక్టివేట్ చేయవచ్చు. ఈ ఫీచర్ సాయంతో మరింత సౌకర్యవంతమైన మరియు సున్నితమైన రైడ్ అనుభవాన్ని పొందవచ్చు.

ఓలా ఎస్1 ప్రో కోసం మూవ్ ఓఎస్ 2.0 అప్‌డేట్ వచ్చేసింది.. ఇప్పుడు మరిన్ని కొత్త ఫీచర్లు మరియు అధిక రేంజ్‌తో..

మరి ఈ కొత్త అప్‌డేట్‌లో వచ్చిన క్రూయిజ్ కంట్రోల్ ఫీచర్‌ను ఆన్ చేయడం ఎలా..? సింపుల్, ఎడమవైపు చేతివైపు ఉన్న DPADలో కుడివైపు ఎగువన ఉండే క్రూయిజ్ కంట్రోల్/రివర్స్ ఐకాన్‌తో కూడిన బటన్‌ను ఎక్కువసేపు నొక్కడం ద్వారా 20 kmph మరియు 80 kmph మధ్య మీరు కోరుకున్న వేగం వద్ద క్రూయిజ్ కంట్రోల్‌ను యాక్టివేట్ చేయవచ్చు. క్రూయిజ్ కంట్రోల్ ఫీచర్‌ను నార్మల్, హైపర్ మరియు స్పోర్ట్స్ మోడ్‌లలో మాత్రమే యాక్టివేట్ చేయవచ్చు. కొత్త ఎకో మోడ్‌లో ఇది పనిచేయదు.

ఓలా ఎస్1 ప్రో కోసం మూవ్ ఓఎస్ 2.0 అప్‌డేట్ వచ్చేసింది.. ఇప్పుడు మరిన్ని కొత్త ఫీచర్లు మరియు అధిక రేంజ్‌తో..

అలాగే, ఈ కొత్త అప్‌డేట్‌లో వచ్చిన క్రూయిజ్ కంట్రోల్ ఫీచర్‌ను ఆఫ్ చేయడం ఎలా..? ఈ ఫీచర్‌ను ఆఫ్ చేయడానికి కూడా ఇదే పద్ధతిని అనుసరించాలి.ఎడమవైపు చేతివైపు ఉన్న DPADలో కుడివైపు ఎగువన ఉండే క్రూయిజ్ కంట్రోల్/రివర్స్ ఐకాన్‌తో కూడిన బటన్‌ను ఎక్కువసేపు నొక్కడం ద్వారా క్రూయిజ్ కంట్రోల్‌ని డీయాక్టివేట్ చేయవచ్చు. ఈ ఫీచర్ యొక్క భద్రతను మెరుగుపరచడానికి, రెండు బ్రేక్‌లలో దేనినైనా నొక్కినా లేదా రీజెనరేటివ్ బ్రేకింగ్ లేదా థ్రోటల్ ఇన్‌పుట్‌లలో మార్పు చేసిన కూడా క్రూయిజ్ కంట్రోల్‌ ఆగిపోతుంది.

ఓలా ఎస్1 ప్రో కోసం మూవ్ ఓఎస్ 2.0 అప్‌డేట్ వచ్చేసింది.. ఇప్పుడు మరిన్ని కొత్త ఫీచర్లు మరియు అధిక రేంజ్‌తో..

3. డిజిటల్ లాక్, అన్‌లాక్ ఫీచర్.. ఇప్పుడు మీ స్కూటర్‌ని మీ ఫోన్‌తోనే లాక్/ఆన్‌లాక్ చేయొచ్చు..

భవిష్యత్తులో ద్విచక్ర వాహనాలలో డిజిటల్ లాక్‌ అనేది ఓ గొప్ప టెక్నాలజీ ఫీచర్‌గా మారబోతోంది. ఓలా తమ ఎలక్ట్రిక్ స్కూటర్ కోసం ఈ కొత్త ఫీచర్‌ను అందుబాటులోకి తీసుకువచ్చింది. మూవ్ ఓఎస్ 2.0 అప్‌డేట్‌లో భాగంగా, కంపెనీ ఎస్1 ప్రో కోసం డిజిటల్ లాక్ మరియు అన్‌లాక్ ఫీచర్‌ను పరిచయం చేసింది. ఈ కంపానియన్ యాప్‌ ఇప్పుడు రిమోట్‌గా యూజర్ స్మార్ట్ ఫోన్ సాయంతో స్కూటర్‌ను లాక్ చేయడం లేదా అన్‌లాక్ చేయడంలో సహాయపడుతుంది మరియు బూట్‌కి యాక్సెస్ పాయింట్‌గా కూడా పనిచేస్తుంది.

ఓలా ఎస్1 ప్రో కోసం మూవ్ ఓఎస్ 2.0 అప్‌డేట్ వచ్చేసింది.. ఇప్పుడు మరిన్ని కొత్త ఫీచర్లు మరియు అధిక రేంజ్‌తో..

అంటే, కస్టమర్లు ఒకవేళ తమ ఎలక్ట్రిక్ స్కూటర్‌ను పార్క్ చేసి దానిని లాక్ చేయడం మర్చిపోయినట్లయితే, వారి స్మార్ట్ ఫోన్‌లో ఉండే యాప్ సాయంతో తమ స్కూటర్‌ను లాక్ చేయవచ్చు. అదే విధంగా, ఒకవేళ తమ స్కూటర్ సీట్ క్రింది భాగంలో చార్జర్ ఉండిపోయి మరియు బ్యాటరీ రీడింగ్ జీరో అయినట్లయితే, ఈ రిమోట్ యాప్ సాయంతోనే స్కూటర్ బూట్‌ను అన్‌లాక్ చేసి చార్జర్‌ను బయటకు తీయవచ్చు. అంతేకాకుండా, ఇది స్కూటర్ బ్యాటరీ యొక్క చార్జింగ్ స్థితి, వివిధ మోడ్‌లలో లభించే రేంజ్, ఓడోమీటర్ రీడింగ్ వంటి కొన్ని రకాల రియల్ టైమ్ గణాంకాలను కూడా అందిస్తుంది.

ఓలా ఎస్1 ప్రో కోసం మూవ్ ఓఎస్ 2.0 అప్‌డేట్ వచ్చేసింది.. ఇప్పుడు మరిన్ని కొత్త ఫీచర్లు మరియు అధిక రేంజ్‌తో..

4. నావిగేషన్.. ఇప్పుడు అడ్రస్‌లను వెతుక్కోవడానికి ఫోన్ తీయాల్సిన అవసరం లేదు..

నావిగేషన్ ఫీచర్ అనేది ఒకప్పుడు కార్లకు మరియు హై-ఎండ్ లగ్జరీ మోటార్‌సైకిళ్లకు మాత్రమే పరిమితమైన ఓ కాస్ట్లీ ఫీచర్. కానీ, ఇప్పుడు అది ఎంట్రీ-లెవల్ ద్విచక్ర వాహనాల్లోకి కూడా అందుబాటులోకి వచ్చింది. నిజానికి, ద్విచక్ర వాహనాలలో మ్యాప్‌లను ఉపయోగించడం అనేది ఎల్లప్పుడూ ఓ గమ్మత్తైన విషయంగా ఉంటుంది. సాధారణంగా, తమ టూవీలర్లలో ఈ ఫీచర్ లేని వారు, తమ స్మార్ట్ ఫోన్లను బయటకు తీసి, అడ్రస్ వెతుక్కోవడం కోసం నావిగేషన్ యాప్స్‌ని ఉపయోగిస్తుంటారు.

ఓలా ఎస్1 ప్రో కోసం మూవ్ ఓఎస్ 2.0 అప్‌డేట్ వచ్చేసింది.. ఇప్పుడు మరిన్ని కొత్త ఫీచర్లు మరియు అధిక రేంజ్‌తో..

అయితే, ఓలా ఎస్1 ప్రో ఎలక్ట్రిక్ స్కూటర్‌లో కంపెనీ ఇప్పుడు బిల్ట్-ఇన్ నావిగేషన్ ఫీచర్‌ను పరిచయం చేసింది. ఇది యూజర్ స్మార్ట్‌ఫాన్ మరియు జిపిఎస్ శాటిలైట్ సాయంతో పనిచేస్తుంది. రైడర్‌లు ఇప్పుడు ఏదైనా కొత్త లొకేషన్‌కు చేరుకోవాలంటే తమ స్మార్ట్‌ఫోన్‌ను బయటకు తీసి తంటాలు పడాల్సిన అవసరం లేదు. తాము చేరుకోవాల్సిన గమ్యాన్ని నేరుగా ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్ డ్యాష్‌బోర్డులోని నావిగేషన్ యాప్‌లో టైప్ చేస్తే చాలు, మిమ్మల్ని గమ్యం చేర్చే వరకూ అది టర్న్ బై టర్న్ డైరెక్షన్స్‌ను తెలియజేస్తుంది.

ఓలా ఎస్1 ప్రో కోసం మూవ్ ఓఎస్ 2.0 అప్‌డేట్ వచ్చేసింది.. ఇప్పుడు మరిన్ని కొత్త ఫీచర్లు మరియు అధిక రేంజ్‌తో..

ఒకవేళ మీ స్కూటర్‌లో నావిగేషన్ సరిగ్గా పనిచేయకపోయినా లేదా లైవ్ రూట్ మ్యాప్‌ను చూపడంలో సమస్యలు ఎదురైనా అది మీ ఇంటర్నెట్ కనెక్టివిటీలో సమస్య అయి ఉండొచ్చని కంపెనీ తెలిపింది. టర్న్ బై టర్న్ నావిగేషన్ కూడా ఇంటర్నెట్ మరియు జిపిఎస్ శాటిలైట్ కనెక్టివిటీపై పనిచేస్తుంది. ఒకవేళ ఈ ఫీచర్ పనిచేయలేదంటే మీ స్కూటర్ బేస్‌మెంట్ లేదా టన్నల్ లేదా ఫ్లైఓవర్స్ వంటి కవర్డ్ ప్రదేశాలలో ఉన్నట్లు అర్థం. అలాకాకుండా, సాధారణంగానే ఈ ఫీచర్ పనిచేయకపోయినట్లయితే మీరు ఓలా కస్టమర్ సపోర్ట్‌ని సంప్రదించవచ్చు.

ఓలా ఎస్1 ప్రో కోసం మూవ్ ఓఎస్ 2.0 అప్‌డేట్ వచ్చేసింది.. ఇప్పుడు మరిన్ని కొత్త ఫీచర్లు మరియు అధిక రేంజ్‌తో..

5. ప్రయాణంలో సంగీతం.. ఇప్పుడు పాటలు వింటూ ముందుకు సాగిపోండి..

హ్యార్లీ డేవిడ్సన్ వంటి ఖరీదైన ద్విచక్ర వాహనాలలో తయారీదారులు ఇలాంటి మ్యూజిక్ ఆన్ ది గో ఫీచర్‌ను అందించేవారు. అయితే, అలాంటి ఫీచర్ ఇప్పుడు ఓలా ఎస్1 ప్రో ఎలక్ట్రిక్ స్కూటర్‌లో కూడా అందుబాటులోకి వచ్చింది. కస్టమర్లు తమ స్మార్ట్ ఫోన్‌ను బ్లూటూత్ సాయంతో స్కూటర్‌కు కనెక్ట్ చేసుకోవడం ద్వారా మ్యూజిక్ ప్లేబ్యాక్ ఫీచర్‌ని యాక్సెస్ చేసుకోవచ్చు. రైడర్లు JioSaavn, Spotify వంటి యాప్‌ల ద్వారా ప్రయాణంలో తమకు ఇష్టమైన పాటలను వింటూ రైడ్ చేయవచ్చు. స్కూటర్‌లో అమర్చిన రెండు 10 వాట్ స్పీకర్ల సాయంతో సంగీతాన్ని వినొచ్చు.

ఓలా ఎస్1 ప్రో కోసం మూవ్ ఓఎస్ 2.0 అప్‌డేట్ వచ్చేసింది.. ఇప్పుడు మరిన్ని కొత్త ఫీచర్లు మరియు అధిక రేంజ్‌తో..

ఓలా ఎస్ 1 ప్రో గురించి క్లుప్తంగా..

ఓలా భారత మార్కెట్లో ఎస్1 మరియు ఎస్1 ప్రో అనే రెండు స్కూటర్లను విక్రయిస్తోంది. ఈ రెండింటిలో ఎస్1 ప్రో వేరియంట్ ఎక్కువగా అమ్ముడవుతోంది. కంపెనీ విడుదల చేసిన మూవ్ ఓఎస్ 2.0 ఓటిఏ అప్‌డేట్ కూడా ఈ ఎస్1 ప్రో మోడల్ కోసం మాత్రమే డిజైన్ చేయబడింది. ఓలా ఎస్ 1 ప్రో ఎలక్ట్రిక్ స్కూటర్ లోని ఎలక్ట్రిక్ మోటార్, స్కూటర్‌కు ఇరువైపులా అమర్చిన ఫిక్స్డ్ 3.97 కిలో వాట్ అవర్ బ్యాటరీ ప్యాక్‌‌తో పనిచేస్తుంది. ఈ ఎలక్ట్రిక్ మోటార్ గరిష్టంగా 8.5 కిలోవాట్ల శక్తిని ఉత్పత్తి చేస్తుంది. ఏఆర్ఏఐ సర్టిఫై చేసిన దాని ప్రకారం, ఈ మోడల్ పూర్తి చార్జ్ పై 181 కిమీ రేంజ్‌ను అందిస్తుంది.

ఓలా ఎస్1 ప్రో కోసం మూవ్ ఓఎస్ 2.0 అప్‌డేట్ వచ్చేసింది.. ఇప్పుడు మరిన్ని కొత్త ఫీచర్లు మరియు అధిక రేంజ్‌తో..

పెర్ఫార్మెన్స్ విషయానికి వస్తే, ఎస్1 ప్రో గరిష్టంగా గంటకు 0-60 కిమీ వేగాన్ని చేరుకోవడానికి నార్మల్ మోడ్‌‌లో 13.8 సెకన్లు, స్పోర్ట్స్ మోడ్‌లో 5.5 సెకన్లు మరియు హైపర్ మోడ్‌లో 3 సెకన్ల సమయం పడుతుంది. అదేవిధంగా టాప్ స్పీడ్ విషయానికి వస్తే, ఎకో మోడ్‌లో 40 కెఎంపిహెచ్, నార్మల్ మోడ్‌లో 80 కెఎంపిహెచ్, స్పోర్ట్స్ మోడ్‌లో 95 కెఎంపిహెచ్ మరియు హైపర్ మోడ్‌లో 116 కెఎంపిహెచ్ గా ఉంటుంది. ఇక చార్జింగ్ విషయానికి వస్తే, ఈ ఎలక్ట్రిక్ స్కూటర్‌ను 750 వాట్ ఆన్‌బోర్డ్ ఛార్జర్‌తో పూర్తిగా చార్జ్ చేయటానికి 6 గంటల 30 నిమిషాల సమయం పడుతుందని కంపెనీ పేర్కొంది. అదే ఫాస్ట్ చార్జర్‌తో అయితే, కేవలం 1 గంట కన్నా తక్కువ వ్యవధిలోనే పూర్తిగా చార్జ్ చేసుకోవచ్చు.

Most Read Articles

English summary
Ola electric releases move os 2 0 for s1 pro users with five exciting features details
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X