టీవీఎస్ అపాచే ఆర్‌టిఆర్ 160 4వి: మిడిల్ క్లాస్ రేసింగ్ ప్రియుల బెస్ట్ ఛాయిస్

Written By:

గత దశాబ్ద కాలం నుండి టీవీఎస్ అపాచే ఇండియన్ టూ వీలర్ల మార్కెట్లో ఉంది. టీవీఎస్ అపాచే ఇండియా లైనప్‌లో ఆర్‌టిఆర్ 160 మొట్టమొదటి మోటార్ సైకిల్. టీవీఎస్ ఇటీవల ఆర్‌టిఆర్ 160 4వి లాంచ్ చేసింది.

ఇవాళ్టి రివ్యూ కథనంలో టీవీఎస్ అపాచే ఆర్‌టిఆర్ 160 4వి బైకును కొనవచ్చో... కొనకూడదో... తెలుసుకుందాం రండి.

టీవీఎస్ ఆర్‌టిఆర్ 160 4వి రివ్యూ

ఇండియాలో గంటకు 0 నుండి 60కిలోమీటర్ల ల్యాప్ టైమర్ ఫీచర్‌ మరియు పెటల్ డిస్క్ బ్రేక్ వంటి ఫీచర్లతో వచ్చిన మొట్టమొదటి మోటార్‌సైకిల్ టీవీఎస్ అపాచే ఆర్‌టిఆర్. అప్పట్లో ఈ రెండు ఫీచర్లు ఆపాచే విజయానికి ఆజ్యం అయ్యాయి.

టీవీఎస్ ఆర్‌టిఆర్ 160 4వి రివ్యూ

ఇప్పటికీ ఎంతో మంది ఆర్‌టిఆర్ అంటే ఏంటి? అనే ఆలోచనలో ఉంటారు. ఆర్‌టిఆర్ అనగా, రేసింగ్ థ్రోటిల్ రెస్పాన్స్. డిజైన్ పరంగా రేసింగ్ లక్షణాలతో రూపొందించిన ఆపాచే ఆర్‌టిఆర్‌తో రాణించడానికి టీవీఎస్ ఎంతో కష్టపడింది. రేసింగ్ లక్షణాలను ఎప్పటికప్పుడు మెరుగుపరచడంతో అపాచే ఆర్‌టిఆర్ వరుసగా ఆరు నేషనల్ ఛాంపియన్‌షిప్స్ అవార్డులను సొంతం చేసుకుంది.

టీవీఎస్ ఆర్‌టిఆర్ 160 4వి రివ్యూ

టీవీఎస్ మోటార్ కంపెనీ, గత ఏడాది తమ ఫ్లాగ్‌షిప్ మోటార్ సైకిల్ - ఆర్ఆర్ 310 మరియు ఈ ఏడాది మరో రేసింగ్ మోటార్ సైకిల్ - అపాచే ఆర్‌టిఆర్ 160 4వి బైకును లాంచ్ చేసింది.

అపాచే ఆర్‌టిఆర్ 160 4వి ఎంట్రీ లెవల్ రేసింగ్ బైకును టెస్ట్ డ్రైవ్ చేసి, ఇందులోని మంచి చెడులను పాఠకులతో పంచుకునే అవకాశాన్ని టీవీఎస్ మోటార్ కంపెనీ డ్రైవ్‌స్పార్క్‌ బృందాన్ని హోసూరులోని కంపెనీ తయారీ ప్లాంటుకు ఆహ్వానించింది. ఇవాళ్టి రివ్యూ కథనంలో టీవీఎస్ అపాచే ఆర్‌టిఆర్ 160 4వి గురించి కంప్లీట్‌గా తెలుసుకుందాం రండి...

టీవీఎస్ ఆర్‌టిఆర్ 160 4వి రివ్యూ

డిజైన్ మరియు ఫీచర్లు

మొదట్లో ఆర్‌టిఆర్ 160 4వి బైకును చూడగానే అపాచే ఆర్‌టిఆర్ 200 4వి అనుకుని తికమక పడతారు. రెండు బైకులు ఒకే తరహా డిజైన్‌ కలిగి ఉండటం ఇందుకు ప్రధాన కారణం. కానీ దీని మీదున్న 160 4వి బ్యాడ్జ్ మీ అయోమయానికి పుల్‌స్టాప్ పెడుతుంది.

టీవీఎస్ ఆర్‌టిఆర్ 160 4వి రివ్యూ

ఇందులో అందించిన ఇంజన్‌ను కూడా అదే ఫ్లాట్‌ఫామ్ మీద ఆర్‌టిఆర్ 165 ప్రోటోటైప్‌గా అభివృద్ది చేశారు. ఇదే ఇంజన్ ఇండియన్ నేషనల్ మోటార్ రేసింగ్ ఛాంపియన్‌షిప్‌లో వరుసగా ఆరు అవార్డులను కొల్లగొట్టింది. టీవీఎస్ అపాచే ఆర్‌టిఆర్ 160 4వి బైకులో ఉన్న డబుల్-క్రాడిల్ స్ల్పిట్ సింక్రో స్టిఫ్ ఫ్రేమ్ ఇరుకైన మలుపుల్లో అత్యుత్తమ పనితీరును కనబరుస్తుంది.

టీవీఎస్ ఆర్‌టిఆర్ 160 4వి రివ్యూ

టీవీఎస్ అపాచే ఆర్‌టిఆర్ 160 4వి ఫ్రంట్ డిజైన్‌లో పగటి పూట వెలిగే ఎల్ఇడి లైట్ మరియు హ్యాలోజియన్ బల్బు గల అగ్రెసివ్ హెడ్ ల్యాంప్ క్లస్టర్ ఉంది. అంతే కాకుండా, ఇందులో ఆటోమేటిక్ హెడ్ ల్యాంప్ ఆన్ ఫీచర్ స్టాండర్డ్‌గా వచ్చింది.

టీవీఎస్ ఆర్‌టిఆర్ 160 4వి రివ్యూ

హెడ్ ల్యాంప్‌పై భాగంలో సింపుల్ డిజైన్‌లో ఉన్న ఫుల్లీ-డిజిటల్ రేసింగ్ కన్సోల్ కలదు. ఇది, 0 నుండి 60కిమీల వేగాన్ని అందుకునే సమయం, గేర్ షిఫ్ట్ ఇండికేటర్(ఫ్యూయల్ ఇంజెక్టెడ్ వేరియంట్లో మాత్రమే) వంటి వివరాలను డిస్ల్పే చేస్తుంది. కార్బోరేటర్ వేరియంట్లో డ్యూయల్ యెల్లో బ్లాక్‌లైట్, ఎలక్ట్రానిక్ ఫ్యూయల్ ఇంజెక్షన్ వేరియంట్ వైట్ కలర్ ఆప్షన్‌లో ఉంది.

Recommended Video - Watch Now!
TVS Apache RR 310 Launched In India | Specs | Top Speed | Mileage | Price
టీవీఎస్ ఆర్‌టిఆర్ 160 4వి రివ్యూ

టీవీఎస్ అపాచే ఆర్‌టిఆర్ 160 4వి బైకులో స్ట్రీమ్‌లైన్డ్ మస్కలర్ ఫూయల్ ట్యాంక్ కలదు, దీనిని గాలి నుండి కలిగే ఘర్షణను నివారించడానికి ఏరోడైనమికల్‌గా డిజైన్ చేశారు. ఈ డిజైన్ రైడింగ్‌లో మలుపులు ఎదురైనపుడు రైడర్‌కు మంచి సపోర్ట్ ఇస్తుంది. రేస్ ట్రాక్‌ను శాసించే మోటార్ సైకిల్ ఫ్యూయల్ ట్యాంక్ మీద ఫ్లాగ్ గ్రాఫిక్స్ ఉన్నాయి.

టీవీఎస్ ఆర్‌టిఆర్ 160 4వి రివ్యూ

మంచి పొడవు మరియు వెడల్పుతో అత్యంత సౌకర్యంగా, అత్యుత్తమ కుషినింగ్‌ గల సీటును (ఎత్తు 800ఎమ్ఎమ్‌) ట్యాంక్ తరువాత చక్కగా అమర్చారు. అన్నింటికీ మించి, పిలియన్ రైడర్‌ కోసం సౌకర్యవంతమైన సీటింగ్ మరియు రెండుగా విభజించిన గ్రాబ్ రెయిల్ ఉన్నాయి. దీని మీద లాంగ్ రైడ్ పెద్దగా ఇబ్బందేమీ కలిగించదు.

టీవీఎస్ ఆర్‌టిఆర్ 160 4వి రివ్యూ

అపాచే ఆర్‌టిఆర్ 160 4వి వెనుక వైపున సన్నగా, పదునైన ఆకృతిలో ఉన్న ఎల్ఇడి టెయిల్ ల్యాంప్ క్లస్టర్ కలదు. ఆర్‌టిఆర్ 200 4వి తరహా అదే రేసింగ్ డబుల్ బారెల్ ఎగ్జాస్ట్ సిస్టమ్ ఇందులో కూడా వచ్చింది.

టీవీఎస్ ఆర్‌టిఆర్ 160 4వి రివ్యూ

అత్యుత్తమ పనితీరు కోసం ఎగ్జాస్ సిస్టమ్‌ను మరింత మెరుగుపరిచారు. యాక్సిలరేషన్ పెంచే కొద్దీ వచ్చే శబ్దం ఆర్‌టిఆర్ 160 4వి మోటార్‌సైకిల్‌కు ప్రత్యేక ట్రేడ్‌మార్క్‌గా నిలిచింది. దీని శబ్దం ఆపాచే రేసింగ్ సిగ్నేచర్ సౌండ్‌ అని చెప్పవచ్చు.

టీవీఎస్ ఆర్‌టిఆర్ 160 4వి రివ్యూ

ఓవరాల్‌గా, మోటార్‌సైకిల్ డిజైన్ మరియు రూపం కళ్లకు ఎంతో అట్రాక్టివ్‌గా కనిపించింది. స్పెషల్ ఆర్ఆర్ రెడ్ కలర్‌లో ఎంతో ఆకర్షణీయంగా ఉంది. అపాచే ఆర్‌టిఆర్ 160 4వి బైకును ఆర్ఆర్ రెడ్ కలర్‌తో పాటు, మెటాలిక్ బ్లూ మరియు నైట్ బ్లాక్ రంగుల్లో కూడా ఎంచుకోవచ్చు.

టీవీఎస్ ఆర్‌టిఆర్ 160 4వి రివ్యూ

ఇంజన్ పనితీరు మరియు హ్యాండ్లింగ్

టీవీఎస్ అపాచే ఆర్‌టిఆర్ 160 4వి రెండు వేరిటయంట్లలో లభ్యమవుతోంది. అవి, కార్బోరేటర్ మరియు ఎలక్ట్రానిక్ ఫ్యూయల్ ఇంజెక్షన్(EFI). రెండు వేరియంట్లలో కూడా 159.7సీసీ కెపాసిటి గల ఆయిల్ కూల్డ్, 4-వాల్వ్ సింగల్ సిలిండర్ ఇంజన్ కలదు.

టీవీఎస్ ఆర్‌టిఆర్ 160 4వి రివ్యూ

ఏదేమైనప్పటికీ, రెండు వేరియంట్ల మధ్య పవర్ విషయంలో స్వల్ప తేడాను గుర్తించాము. కార్బోరేటర్ వేరియంట్ గరిష్టంగా 16.3బిహెచ్‌పి పవర్ ప్రొడ్యూస్ చేస్తే, EFI వేరియంట్ 16.6బిహెచ్‌పి పవర్ ఉత్పత్తి చేస్తుంది. అయితే, రెండు వేరియంట్లు కూడా 14.8ఎన్ఎమ్ టార్క్ ప్రొడ్యూస్ చేసాయి. బెస్ట్ పర్ఫామెన్స్ మరియు స్మూత్ గేర్ షిఫ్టింగ్ కోసం 6-స్పీడ్ గేర్‌బాక్స్ అనుసంధానం కలదు.

టీవీఎస్ ఆర్‌టిఆర్ 160 4వి రివ్యూ

సస్పెన్షన్ డ్యూటీ కోసం ఇందులో ముందు వైపున టెలిస్కోపిక్ ఫ్రంట్ ఫోర్క్స్ మరియు వెనుక వైపున మోనోషాక్ అబ్జార్వర్ ఉన్నాయి. ఇందులో ఆసక్తికరమైన నిజం ఏమింటే... సస్పెన్షన్ కంప్రెషన్ మరియు రీబౌండ్ డ్యాంపింగ్ కోసం జపాన్‌కు చెందిన షోవా కంపెనీ అనుభవజ్ఞులు వీటి సస్పెన్షన్ సిస్టమ్‌ను ప్రత్యేకంగా ట్యూనింగ్ చేసారు.

టీవీఎస్ ఆర్‌టిఆర్ 160 4వి రివ్యూ

ఇరుకైన మలుపుల్లో బైకును ఇబ్బందులకు గురి చేయకుండా ఇలాంటి సెటప్ రైడర్‌కు ఎంతగానో సహకరిస్తుంది. అత్యధిక వేగంతో ఉన్నపుడు, సడెన్‌గా వచ్చే మలుపుల్లో ఎదురయ్యే కుదుపులను ఎంతా సునాయసంగా ఎదుర్కుని రైడర్‌కు మంచి రైడింగ్ అనుభవాన్ని కల్పిస్తుంది.

టీవీఎస్ ఆర్‌టిఆర్ 160 4వి రివ్యూ

బ్రేకింగ్ విధులను నిర్వర్తించడానికి ముందు వైపున 200ఎమ్ఎమ్ చుట్టుకొలత గల పెటల్ డిస్క్ బ్రేక్ మరియు వెనుక వైపున 130ఎమ్ఎమ్ డిస్క్ బ్రేక్(EFI వేరియంట్లో మాత్రమే) ఉంది. అన్ని రకాల వేగం వద్ద మంచి బ్రేకింగ్ పవర్ అందుతుంది. కార్బోరేటర్ వేరియంట్లో ముందు డిస్క్, వెనుక వైపున డ్రమ్ బ్రేక్ ఉంది.

టీవీఎస్ ఆర్‌టిఆర్ 160 4వి రివ్యూ

టీవీఎస్ అపాచే ఆర్‌టిఆర్ 160 4వి లభించే రెండు వేరియంట్లు కూడా గంటకు 0 నుండి 60కిలోమీటర్ల వేగాన్ని కేవలం 5 సెకండ్ల వ్యవధిలోనే అందుకుంటాయి. అపాచే ఆర్‌టిఆర్ 160 4వి కార్బోరేటర్ వేరియంట్ టాప్ స్పీడ్ గంటకు 114కిలోమీటర్లు మరియు ఇఎఫ్ఐ వేరియంట్ టాప్ స్పీడ్ గంటకు 116కిలోమీటర్లుగా ఉంది.

టీవీఎస్ ఆర్‌టిఆర్ 160 4వి రివ్యూ

టీవీఎస్ తమ అపాచే ఆర్‌టిఆర్ 160 4వి బైకులో ముందు వైపున 90/90-17 కొలతలో ఉన్న ట్యూబ్ లెస్ టైరు మరియు వెనుక వైపున, డ్రమ్ వెర్షన్ 10/80-17 57P ట్యూబ్ లెస్ టైరు, డిస్క్ వెర్షన్ 130/70-17 MC 62P కొలతల్లో ఉన్న ట్యూబ్ లెస్ టైరు ఉంది. ఈ టైర్లు హై స్పీడ్ మరియు కఠినమైన మలుపుల్లో అత్యుత్తమ పటిష్టాన్ని కలిగి ఉంటాయి.

టీవీఎస్ ఆర్‌టిఆర్ 160 4వి రివ్యూ

టీవీఎస్ అపాచే ఆర్‌టిఆర్ 160 4వి 85కిలోమీటర్ల వేగం వరకు స్మూత్‌గా రన్ అవుతుంది. ఆ తరువాత, ఫుట్ పెడల్స్ నుండి స్వల్పంగా వైబ్రేషన్స్ వస్తున్నట్లు అనిపిస్తుంది. అయినప్పటికీ, వైబ్రేషన్స్ తగ్గించి స్మూత్ రైడింగ్ కల్పించడంలో టీవీఎస్ రేసింగ్ బృందం అద్భుతం చేసిందనే చెప్పాలి.

టీవీఎస్ ఆర్‌టిఆర్ 160 4వి రివ్యూ

అపాచే ఆర్‌టిఆర్ 160 4వి బైకులో 12-లీటర్ కెపాసిటి గల ఫ్యూయల్ ట్యాంక్ కలదు. ఇందులో రిజర్వ్ కెపాసిటి 2.5-లీటర్లుగా ఉంది. మేము చేసిన ఈ రైడ్ ఫస్ట్ రైడ్ కావడంతో మైలేజ్ లెక్కించలేకపోయాము. కానీ, లీటర్‌కు 40 నుండి 45 కిలోమీటర్ల మధ్య మైలేజ్ లభిస్తుంది.

టీవీఎస్ ఆర్‌టిఆర్ 160 4వి రివ్యూ

డ్రైవ్‌స్పార్క్ తెలుగు అభిప్రాయం!

టీవీఎస్ అపాచే ఆర్‌టిఆర్ 160 4వి ధర వివిధ వేరియంట్ల ఆధారంగా రూ. 81,490 నుండి రూ. 89,990ల మధ్య ఉంది. ఈ ధరల శ్రేణిలో లభించే వేరియంట్ల ఆధారంగా లభించే ఫీచర్ల మధ్య వత్యాసం ఉంటుంది. కానీ అన్ని వేరియంట్లను ధరకు తగ్గ విలువలతో అందివ్వడంలో టీవీఎస్ ప్రత్యేక బయటపడింది.

టీవీఎస్ ఆర్‌టిఆర్ 160 4వి రివ్యూ

పైన పేర్కొన్న అన్ని అంశాలను పరిగణలోకి తీసుకుంటే, ఎంట్రీ లెవల్ పర్ఫామెన్స్ మోటార్ సైకిల్ ఎంచుకోవాలనుకునే వారికి, మేము ఖచ్చితంగా టీవీఎస్ అపాచే ఆర్‌టిఆర్ 160 4వి బైకును సిఫారసు చేస్తాము.

English summary
Read In Telugu: TVS Apache RTR 160 4V Review — A True Entry-Level Race Machine
Story first published: Wednesday, March 28, 2018, 18:30 [IST]

Latest Photos

డ్రైవ్స్పార్క్ నుండి తాజా ఆటో అప్డేట్స్ పొందండి
Telugu Drivespark