రైడింగ్‌కి సరైన బైక్ 'Yezdi Roadster': ఫస్ట్ రైడ్ రివ్యూ

భారతదేశంలో ప్రస్తుతం విక్రయించబడుతున్న ఐకానిక్ మోటార్‌సైకిళ్ల గురించి ఆలోచించేటప్పుడు 'యెజ్డీ రోడ్‌కింగ్' (Yezdi Roadking) అనేది తప్పకుండా టాప్ 5 మోటార్‌సైకిళ్ల జాబితాలో ఒకటిగా ఉండాలి. మోటారుసైకిల్ ఐకానిక్ అని చెప్పడం సులభమే అయినప్పటికీ స్టైల్ వంటి వాటిని తప్పకుండా దృష్టిలో ఉంచుకోవాలి.

రైడింగ్‌కి సరైన బైక్ 'Yezdi Roadster': ఫస్ట్ రైడ్ రివ్యూ

భారతీయ మార్కెట్లో 90 ల చివరి రోజుల్లోనే యెజ్డీ రోడ్‌కింగ్ ఉత్పత్తి ఆగిపోయింది. అయితే కంపెనీ దాదాపు చాలా సంవత్సరాల తరువాత ఇప్పుడు 2022 లో కంపెనీ తన 'యెజ్డీ రోడ్‌స్టర్' (Yezdi Roadster) ను తిరిగి దేశీయ విఫణిలో విడుదల చేసింది. దీనితో పాటు కంపెనీ మరో రెండు బైకులను కూడా ఇదే రోజు మార్కెట్లో విడుదల చేసింది.

ఇటీవల మేము 'యెజ్డీ రోడ్‌స్టర్' బైక్ రైడ్ చేసాము.. కావున ఈ బైక్ యొక్క డిజైన్, ఫీచర్స్ మరియు పర్ఫామెన్స్ వంటి వివరాలను మాత్రమే కాకుండా దేశీయ మార్కెట్లో ఎలాంటి ప్రత్యర్థులను ఎదుర్కుంటోంది అనే మరిన్ని విషయాలను ఈ రివ్యూలో తెలుసుకుందాం.. రండి.

రైడింగ్‌కి సరైన బైక్ 'Yezdi Roadster': ఫస్ట్ రైడ్ రివ్యూ

Yezdi Roadster డిజైన్ అండ్ స్టైల్:

దేశీయ మార్కెట్లో అందుబాటులో ఉన్న కొత్త 'యెజ్డీ రోడ్‌స్టర్' డిజైన్ 'యెజ్డీ రోడ్‌కింగ్' నుండి తీసుకోబడింది. ఈ బైక్ యొక్క ముందు భాగంలో రౌండ్ హెడ్‌ల్యాంప్ ఉంది. ఇది లో బీమ్ మరియు హై బీమ్ వేరుచేసే డివిజన్‌లో విలీనం చేయబడిన Yezdi లోగోతో కూడిన LED యూనిట్. ఇందులోని హ్యాండిల్‌బార్ కొంత పైకి ఉంటుంది.

రైడింగ్‌కి సరైన బైక్ 'Yezdi Roadster': ఫస్ట్ రైడ్ రివ్యూ

ఈ బైక్ యొక్క డిజైన్ గమనించినట్లతే డిజైనర్లు పాత రోడ్‌కింగ్ యొక్క రైడింగ్ పొజిషన్‌ను మళ్ళీ పునరావృతం చేయడానికి ప్రయత్నిస్తున్నారని చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ఈ బైక్ యొక్క హెడ్‌ల్యాంప్ పైన క్రోమ్ సరౌండ్‌తో రౌండ్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్ ఉంది.

రైడింగ్‌కి సరైన బైక్ 'Yezdi Roadster': ఫస్ట్ రైడ్ రివ్యూ

ఇందులోని ఫ్యూయెల్ ట్యాంక్ దాదాపు పాత రోడ్‌కింగ్ నుండి తీసుకున్నట్లు కనిపిస్తుంది. దీని గుండ్రని అంచులు మరియు విలాసవంతమైన డిజైన్‌తో, ఇది దాని మునుపటి బైకుల ఫ్యూయెల్ ట్యాంక్‌తో అద్భుతమైన పోలికను కలిగి ఉంది. అయినప్పటికీ, ఇది ఇప్పుడు రెండు వైపులా ట్యాంక్ ప్యాడ్‌లను పొందుతుంది, ఇది మరింత మెరుగ్గా కనిపించేలా చేస్తుంది.

రైడింగ్‌కి సరైన బైక్ 'Yezdi Roadster': ఫస్ట్ రైడ్ రివ్యూ

సైడ్ ప్యానెల్‌లు కూడా విలాసవంతమైన, రౌండెడ్-ఆఫ్ డిజైన్ కలిగి ఉంటాయి. మిగిలిన మోటార్‌సైకిల్ రెట్రో టచ్‌తో మరింత లేటెస్ట్ గా ఉటుంది. ఇందులోని రేడియేటర్ చాలా పెద్దదిగా కనిపిస్తుంది, కావున చూడగానే మీ దృష్టిని ఆకర్షిస్తుంది. Yezdi రోడ్‌స్టర్ తక్కువ సీటింగ్ పొజిషన్‌ను అనుమతించడానికి రైడర్ బిట్ కేవ్‌తో సింగిల్-పీస్ సీటును కలిగి ఉంది. ఇది రైడర్ మరియు పిలియన్ కి చాలా సౌకర్యవంతంగా ఉంటుంది.

రైడింగ్‌కి సరైన బైక్ 'Yezdi Roadster': ఫస్ట్ రైడ్ రివ్యూ

యెజ్డీ రోడ్‌స్టర్ యొక్క రెట్రో స్టైలింగ్‌ను విస్తరించే మరో అంశం ఇందులోని రియర్ ఫెండర్. టెయిల్ ల్యాంప్, ఇండికేటర్ మరియు నంబర్ ప్లేట్ ఈ ఫెండర్‌పై అమర్చబడి ఉంటాయి. స్టైలింగ్ విభాగంలో ఇంజిన్ ప్రధాన పాత్ర పోషిస్తుంది. ఇది పాత టూ-స్ట్రోక్ ఇంజిన్‌ను పోలి ఉంటుంది. ఇది లిక్విడ్-కూల్డ్ ఇంజిన్ అయినప్పటికీ, సిలిండర్ మరింత రెట్రోగా కనిపించేలా కూలింగ్ వింగ్స్ కలిగి ఉంటుంది.

రైడింగ్‌కి సరైన బైక్ 'Yezdi Roadster': ఫస్ట్ రైడ్ రివ్యూ

యెజ్డీ రోడ్‌స్టర్‌లో ట్విన్ ఎగ్జాస్ట్ అవుట్‌లెట్‌లు ఉన్నాయి, అంతే కాకుండా ఇందులోని ఎగ్జాస్ట్ పైపులు యెజ్డీ రోడ్‌కింగ్‌లో ఉన్న విధంగానే రూపొందించబడ్డాయి. మీరు ఇందులో బార్-ఎండ్ మిర్రర్‌లను కూడా పొందుతారు. కంపెనీ విడుదల చేసిన మూడు బైకులలో అల్లాయ్ వీల్స్‌ను ఉపయోగించుకునే ఏకైక మోటార్‌సైకిల్ ఈ రోడ్‌స్టర్. మొత్తానికి ఇది ఆధునిక డిజైన్ కలిగి ఉండి చూడచక్కగా ఉంటుంది.

రైడింగ్‌కి సరైన బైక్ 'Yezdi Roadster': ఫస్ట్ రైడ్ రివ్యూ

Yezdi Roadster ఫీచర్స్:

Yezdi Roadster బైక్ అనేది లేటెస్ట్ Yezdi లైనప్‌లో ఎంట్రీ-లెవల్ మోడల్. అందువల్ల ఇందులో అవసరమైనా ఫీచర్స్ అందుబటులో ఉంటాయి. ఇందులో స్మార్ట్ ఫోన్ ఛార్జింగ్ స్లాట్స్ అనేవి ఆప్సనల్ గా ఉంటుంది. చుట్టూ LED లైటింగ్ కూడా పొందుతారు.

Yezdi Roadster బైక్ లో రౌండ్ LCD ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ ఇన్‌స్ట్రుమెంటేషన్ విధులను నిర్వహిస్తుంది. ఇది బైక్ గురించి చాలా సమాచారాన్ని అందిస్తుంది. ఇది గేర్ పొజిషన్ ఇండికేటర్, డిస్టెన్స్-టు-ఖాళీ, రీడౌట్, మల్టిపుల్ ట్రిప్ మీటర్లు, స్పీడోమీటర్, ఓడోమీటర్, టాకోమీటర్ మొదలైన వాటిని కలిగి ఉంది.

రైడింగ్‌కి సరైన బైక్ 'Yezdi Roadster': ఫస్ట్ రైడ్ రివ్యూ

ఈ బైక్ లోని స్విచ్ గేర్ కొత్తగా ఉంటుంది, అదే సమయంలో మంచి అనుభూతిని కలిగిస్తుంది. బటన్‌లు మరియు స్విచ్‌లు ఉపయోగించడానికి చాలా అనుకూలంగా ఉంటాయి. కావున వాహన వినియోగదారులకు రైడింగ్ సమయంలో ఉపయోగించడానికి అనువుగా ఉంటాయి.

రైడింగ్‌కి సరైన బైక్ 'Yezdi Roadster': ఫస్ట్ రైడ్ రివ్యూ

Yezdi Roadster ఇంజిన్ పర్ఫామెన్స్ మరియు రైడింగ్ ఇంప్రెషన్స్:

Yezdi Roadster బైక్ ఇతర రెండు Yezdi మోటార్‌సైకిల్స్ (Yezdi Scrambler, Yezdi Adventure) మాదిరిగానే లిక్విడ్-కూల్డ్ 334 సిసి సింగిల్-సిలిండర్ ఇంజన్‌తో పనిచేస్తుంది. ఇది 7,300 ఆర్‌పిఎమ్ వద్ద 29.3 బిహెచ్‌పి పవర్ మరియు 6,500 ఆర్‌పిఎమ్ వద్ద 29 ఎన్ఎమ్ టార్క్ అందిస్తుంది. ఇది 6-స్పీడ్ గేర్‌బాక్స్ కి జతచేయబడి ఉంటుంది.

రైడింగ్‌కి సరైన బైక్ 'Yezdi Roadster': ఫస్ట్ రైడ్ రివ్యూ

రెండు ఇతర Yezdi మోటార్‌సైకిళ్లతో పోలిస్తే, Yezdi రోడ్‌స్టర్‌లో గరిష్ట శక్తి కొద్దిగా తక్కువ ఇంజిన్ వేగంతో వస్తుంది. అయినప్పటికీ, ఇది చాలా ఉత్సాహంగా అనిపిస్తుంది. ఇది 100-110km/h వేగంతో సులభంగా ప్రయాణించగలదు. ఈ వేగంతో కొన్ని వైబ్రేషన్‌లను గమనించవచ్చు, కానీ ఇవి పెద్దగా ఇబ్బంది పెట్టవు.

రైడింగ్‌కి సరైన బైక్ 'Yezdi Roadster': ఫస్ట్ రైడ్ రివ్యూ

మొత్తం మీద, ఇంజిన్ ఫీచర్స్ యెజ్డీ స్క్రాంబ్లర్ మరియు అడ్వెంచర్‌ల మాదిరిగానే ఉంటాయి. అయితే, ఈ ఇంజన్ రోడ్‌స్టర్‌కి ఖచ్చితంగా సరిపోయే విధంగా ఉంటుంది. కావున మంచి పనితీరుని అందిస్తుంది.

ఈ బైక్ తక్కువ సమయం మాత్రమే మా వద్ద ఉండటం వల్ల దాని పూర్తి సామర్థ్యాలను పరీక్షించలేకపోయాము. కానీ మేము దానిని కొన్ని మలుపుల్లో మరియు హైవే మీద రైడ్ చేసాము. ఇది మంచి రైడింగ్ అనుభూతిని అందించింది.

రైడింగ్‌కి సరైన బైక్ 'Yezdi Roadster': ఫస్ట్ రైడ్ రివ్యూ

ఇందులోని సస్పెన్షన్ డ్యూటీలు టెలిస్కోపిక్ ఫోర్క్ ద్వారా 135 మిమీ ట్రావెల్ అప్ ఫ్రంట్ మరియు వెనుక వైపు 100 మిమీ ట్విన్ షాక్‌లను కలిగి ఉంటుంది. సస్పెన్షన్ చాలా సమతుల్యంగా ఉంటది, కావున మిమ్మల్ని రిలాక్స్డ్ పద్ధతిలో రైడ్ చేయడానికి అనుమతిస్తుంది.

రైడింగ్‌కి సరైన బైక్ 'Yezdi Roadster': ఫస్ట్ రైడ్ రివ్యూ

ఇక ఇందులోని బ్రేకింగ్ విషయానికి వస్తే, ఈ బైక్ ముందు భాగంలో 320 మిమీ డిస్క్ మరియు వెనుక 240 మిమీ డిస్క్ ఉంటుంది. మీరు స్టాండర్డ్ ఫిట్‌మెంట్‌గా డ్యూయల్-ఛానల్ ABSని పొందుతారు. అయితే, ఇతర రెండు Yezdi మోటార్‌సైకిళ్ల మాదిరిగా కాకుండా, మీరు ABS మోడ్‌లను పొందలేరు.

రైడింగ్‌కి సరైన బైక్ 'Yezdi Roadster': ఫస్ట్ రైడ్ రివ్యూ

ఈ బైక్ పెద్ద రేడియేటర్‌ను పొందుతుంది, అయితే రేడియేటర్ లోపల ఉండే కూలింగ్ పైపులు వర్టికల్ గా కాకూండా హారిజాంటల్ గా ఉంటాయి. ఇది కూలింగ్ కెపాసిటీని మరింత పెంచుతుంది. మొత్త మీద యెజ్డీ రోడ్‌స్టర్‌ అద్భుతమైన రైడింగ్ అనుభూతిని అందిస్తుందని ఖచ్చితమైన చెప్పవచ్చు.

రైడింగ్‌కి సరైన బైక్ 'Yezdi Roadster': ఫస్ట్ రైడ్ రివ్యూ

Yezdi Roadster కలర్స్ మరియు ప్రైస్:

Yezdi Roadster ఐదు కలర్ ఆప్షన్‌లలో అందుబాటులో ఉంది. ధరలు కూడా ఎంచుకునే కలర్ ఆప్సన్ మీద ఆధారపడి ఉంటుంది.

  • యెజ్డీ రోడ్‌స్టర్ డార్క్ - స్మోక్ గ్రే (Yezdi Roadster Dark - Smoke Grey): రూ. 1,98,142
  • యెజ్డీ రోడ్‌స్టర్ డార్క్ - స్టీల్ బ్లూ (Yezdi Roadster Dark - Steel Blue): రూ. 2,02,142
  • యెజ్డీ రోడ్‌స్టర్ డార్క్ - హంటర్ గ్రీన్ (Yezdi Roadster Dark - Hunter Green): రూ. 2,02,142
  • యెజ్డీ రోడ్‌స్టర్ క్రోమ్ - గాలంట్ గ్రే (Yezdi Roadster Chrome - Gallant Grey): రూ. 2,06,142
  • యెజ్డీ రోడ్‌స్టర్ క్రోమ్ - సిన్ సిల్వర్ (Yezdi Roadster Chrome - Sin Silver): రూ. 2,06,142
  • రైడింగ్‌కి సరైన బైక్ 'Yezdi Roadster': ఫస్ట్ రైడ్ రివ్యూ

    ప్రత్యర్థులు:

    Yezdi Roadster భారతీయ మార్కెట్లో రాయల్ ఎన్‌ఫీల్డ్ మీటియార్, జావా 42, జావా వంటి వాటికి మాత్రమే కాకుండా రాయల్ ఎన్‌ఫీల్డ్ క్లాసిక్ 350 వంటి వాటికి ప్రత్యర్థిగా ఉంటుంది.

    రైడింగ్‌కి సరైన బైక్ 'Yezdi Roadster': ఫస్ట్ రైడ్ రివ్యూ

    డ్రైవ్‌స్పార్క్ అభిప్రాయం:

    దేశీయ మార్కెట్లో అందుబాటులో ఉన్న యెజ్డీ రోడ్‌స్టర్ దాని యెజ్డీ రోడ్‌కింగ్‌కు తగిన వారసుడు. యెజ్డీ రోడ్‌కింగ్‌ లాంటి ఆకర్షణ మరియు సౌండ్‌ట్రాక్ యెజ్డీ రోడ్‌స్టర్ కి ఉండకపోవచ్చు. కానీ ఇది థ్రిల్‌ను రైడర్ కి అందిస్తుంది. అంతే కాకుండా ఇది అద్భుతమైన పర్ఫామెన్స్ కూడా అందిస్తుంది. అయితే ఇది దేశీయ మార్కెట్లో ఎలాంటి ఆదరణ పొందుతుంది అనే విషయం తెలియరావాలి.

Most Read Articles

English summary
Yezdi roadster review riding impressions engine performance features details
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X