మహీంద్రా అల్టురాస్ జి 4

మహీంద్రా అల్టురాస్ జి 4
Style: ఎస్‌యూవీ
28.77 - 31.77 లక్ష
జీఎస్టీ ఎక్స్-షోరూమ్ ధర

మహీంద్రా ప్రస్తుతం 2 విభిన్న వేరియంట్లు మరియు 4 రకాల రంగుల్లో లభ్యమవుతోంది. మహీంద్రా అల్టురాస్ జి 4 ధరలు, సాంకేతిక వివరాలు మరియు మైలేజీతో పాటు మరిన్ని వివరాలు మీ కోసం. అంతే కాకుండా, మహీంద్రా అల్టురాస్ జి 4 ఆన్-రోడ్ ధర మరియు ఇఎంఐ తెలుసుకోవచ్చు. పూర్తి వివరణతో కూడిన పోలిక ద్వారా మహీంద్రా అల్టురాస్ జి 4 మరియు ఇతర ఎమ్‌యూవీ వాహనల గురించి సంక్షిప్త సమాచారాన్ని పొందవచ్చు. డ్రైవ్‌స్పార్క్ తెలుగు ప్రతి మహీంద్రా అల్టురాస్ జి 4 గురించి కావాల్సిన పూర్తి సమాచారాన్నిస్తుంది.

మహీంద్రా అల్టురాస్ జి 4 డీజిల్ మోడళ్లు

వేరియంట్లు ఎక్స్-షోరూమ్ ధర
ఎస్‌యూవీ | Gearbox
28,76,986
ఎస్‌యూవీ | Gearbox
31,76,984

మహీంద్రా అల్టురాస్ జి 4 మైలేజ్

గేర్ బాక్స్ ఇంధన రకం మైలేజ్
డీజిల్ 12.03

మహీంద్రా అల్టురాస్ జి 4 రివ్యూ

Rating :
మహీంద్రా అల్టురాస్ జి 4 Exterior And Interior Design

మహీంద్రా అల్టురాస్ జి 4 ఎక్ట్సీరియర్ మరియు ఇంటీరియర్ డిజైన్

మహీంద్రా అల్టురాస్ జి 4 బోల్డ్ స్టైలింగ్‌లో వస్తుంది. అంతే కాకుండా ఇది చూడటానికి రహదారిపై భారీ ఉనికిని కలిగి ఉంది. ఇది నాల్గవ తరం సాంగ్‌యాంగ్ రెక్స్టన్‌తో సమానంగా కనిపిస్తుంది. ముందు వైపు, మహీంద్రా అల్టురాస్ జి 4 యొక్క 6-స్లాట్ గ్రిల్ బదులుగా షార్ప్ డిజైన్ ఎలిమెంట్స్ పై ఆధిపత్యం చెలాయిస్తుంది. ఇందులో హెడ్‌ల్యాంప్‌లు కోణీయంగా ఉంటాయి, మరియు క్రోమ్ ఎలిమెంట్స్ కూడా పరిమితం చేయబడి ఉంటాయి.

మహీంద్రా అల్టురాస్ జి 4 కొంత ఎత్తుగా ఉంటుంది. సైడ్ ప్రొఫైల్ కూడా చాలా ఆకర్షణీయమాగా ఉంటుంది. 18 ఇంచెస్ ఫైవ్ స్పోక్ అల్లాయ్ వీల్స్ సొగసైనవిగా కనిపిస్తాయి, గ్లోబల్-స్పెక్ రెక్స్టన్ పెద్ద చక్రాల ఆప్సన్స్ పొందుతుంది.

మహీంద్రా అల్టురాస్ జి 4 యొక్క రియర్ ప్రొఫైల్ విషయానికి వస్తే, ఇది ఎస్‌యూవీ-స్టైలింగ్ కలిగి ఉంటుంది. షార్ప్ కట్ టెయిల్ లాంప్స్ మరియు సన్నని క్రోమ్ స్ట్రిప్ వీటిని కలుపుతాయి. ఎగువన చక్కగా-ఇంటిగ్రేటెడ్ స్పాయిలర్ ఉంది మరియు బంపర్ యొక్క దిగువ భాగంలో స్కిడ్ ప్లేట్ కూడా ఉంది.

మహీంద్రా అల్టురాస్ జి 4 లోపలి భాగంలో, లెదర్,మెటల్ మరియు మంచి-నాణ్యమైన ప్లాస్టిక్ మిశ్రమం ఉంది. పెద్ద టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ మధ్యలో చక్కగా ఉంచి, బ్రౌన్ లెదర్ ప్యానెల్ దాని దిగువ బౌండరీ సెట్ చేస్తుంది. సీట్లు కూడా బాగా డిజైన్ చేయబడ్డాయి. ఇవి చాలా సౌకర్యవంతంగా ఉంటాయి.

మహీంద్రా అల్టురాస్ జి 4 ఇంజన్ మరియు పనితీరు

మహీంద్రా అల్టురాస్ జి 4 Engine And Performance

మహీంద్రా అల్టురాస్ జి 4 లో 2.2-లీటర్ ఫోర్ సిలిండర్ ఇంజన్ తో పనిచేస్తుంది, ఇది 178 బిహెచ్‌పి మరియు 420 ఎన్ఎమ్ టార్క్ ఉత్పత్తి చేస్తుంది. పవర్ ప్లాంట్ 7-స్పీడ్ ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ తో జతచేయబడుతుంది, ఇది నాలుగు చక్రాలకు (`4WD` వేరియంట్లో) శక్తిని పంపుతుంది.

అల్టురాస్ జి 4 దాని పరిమాణానికి ప్రశంసనీయమైన పనితీరును ప్రదర్శిస్తుంది. చాలా తక్కువ-ముగింపు నుండి తగినంత టార్క్ ఉత్పత్తి చేస్తుంది. అంతే కాకుండా ఇది మెర్సిడెస్ సోర్స్డ్ ట్రాన్స్మిషన్ సున్నితమైన షిఫ్టులను అందిస్తుంది. 4WD వేరియంట్ మూడు మోడ్లను పొందుతుంది. అవి 2డబ్ల్యుడి లో, 4డబ్ల్యుడి లో మరియు 4డబ్ల్యుడి హై మోడ్స్.

ఇది ఫోర్-వీల్-డ్రైవ్ ఎస్‌యూవీ కావడంతో, మహీంద్రా అల్టురాస్ జి 4 తగినంత ఆఫ్-రోడింగ్ సామర్థ్యాలను కలిగి ఉంది. అధిక గ్రౌండ్ క్లియరెన్స్ కలిగి ఉండటం వల్ల ఇది వాహనదారునికి చాలా అనుకూలంగా ఉంటుంది.

మహీంద్రా అల్టురాస్ జి 4 ఇంధన సామర్థ్యం

మహీంద్రా అల్టురాస్ జి 4 Fuel Efficiency

మహీంద్రా అల్టురాస్ జి 4 మైలేజ్ విషయానికి వస్తే, ఇది ఒక లీటరుకు సుమారు 12 కి.మీ దగ్గరగా ఉన్న మైలేజ్ సంఖ్యను అందిస్తుంది. ఇది 70 లీటర్ల ఫ్యూయెల్ ట్యాంక్ సామర్థ్యంతో వస్తుంది. కావున మంచి పరిధిని అందిస్తుంది.

మహీంద్రా అల్టురాస్ జి 4 ముఖ్యమైన ఫీచర్లు

మహీంద్రా అల్టురాస్ జి 4 Important Features

మహీంద్రా అల్టురాస్ జి 4 చాలా సౌకర్యంగా మరియు సౌలభ్యంగా ఉంటుంది. ఇందులో మంచి సేఫ్టీ ఫీచర్స్ ఉంటాయి. ఇందులో తొమ్మిది ఎయిర్‌బ్యాగులు, ఇఎస్‌పి, ఎఆర్‌పి, హెచ్‌డిసి వంటి వాటితో పాటు డ్యూయల్-జోన్ క్లైమేట్ కంట్రోల్, 360-డిగ్రీ కెమెరా మరియు యాంబియంట్ లైటింగ్ వంటి ఫీచర్స్ ఉన్నాయి.

మహీంద్రా అల్టురాస్ జి 4 తీర్పు

మహీంద్రా అల్టురాస్ జి 4 Verdict

మహీంద్రా అల్టురాస్ జి 4 చాలా సౌకర్యంగా మరియు సౌలభ్యంగా ఉండి, మంచి ఫీచర్స్ తో వాహనదారునికి చాలా అనుకూలంగా ఉంటుంది. ఇది టయోటా ఫార్చ్యూనర్, ఫోర్డ్ ఎండీవర్ మరియు కొత్తగా ప్రారంభించిన హోండా సిఆర్-వి వంటి ప్రత్యర్థిగా ఉంటుంది.

మహీంద్రా అల్టురాస్ జి 4 మహీంద్రా అల్టురాస్ జి 4 కలర్లు


Napoli Black
Regal Blue
D Sat Silver
Pearl White

మహీంద్రా అల్టురాస్ జి 4 డీజిల్ కాంపిటీటర్స్

మహీంద్రా అల్టురాస్ జి 4 డీజిల్ మైలేజ్ కంపారిజన్

  • ఇసుజు ఎమ్‍‌యు-ఎక్స్ ఇసుజు ఎమ్‍‌యు-ఎక్స్
    local_gas_station డీజిల్ | 0
  • ఎంజి గ్లోస్టర్ ఎంజి గ్లోస్టర్
    local_gas_station డీజిల్ | 0
  • సిట్రన్ సి 5 ఎయిర్‌క్రాస్ సిట్రన్ సి 5 ఎయిర్‌క్రాస్
    local_gas_station డీజిల్ | 18.6

మహీంద్రా మహీంద్రా అల్టురాస్ జి 4 ఫోటోలు

మహీంద్రా అల్టురాస్ జి 4 Q & A

ఫ్రంట్-వీల్-డ్రైవ్ ఎస్‌యూవీ అయిన అల్టురాస్ జి 4 యొక్క 2WD వేరియంట్ ఉందా?

లేదు, మహీంద్రా అల్టురాస్ జి 4 2 డబ్ల్యుడి రియర్ వీల్ డ్రైవ్ మరియు దాని ప్రాథమిక రూపంలో చాలా సామర్థ్యం కలిగి ఉంది.

Hide Answerkeyboard_arrow_down
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X