మారుతి సుజుకి ఆల్టో

మారుతి సుజుకి ఆల్టో
Style: హ్యాచ్‌బ్యాక్
3.15 - 4.82 లక్ష
జీఎస్టీ ఎక్స్-షోరూమ్ ధర

మారుతి సుజుకి ప్రస్తుతం 8 విభిన్న వేరియంట్లు మరియు 6 రకాల రంగుల్లో లభ్యమవుతోంది. మారుతి సుజుకి ఆల్టో ధరలు, సాంకేతిక వివరాలు మరియు మైలేజీతో పాటు మరిన్ని వివరాలు మీ కోసం. అంతే కాకుండా, మారుతి సుజుకి ఆల్టో ఆన్-రోడ్ ధర మరియు ఇఎంఐ తెలుసుకోవచ్చు. పూర్తి వివరణతో కూడిన పోలిక ద్వారా మారుతి సుజుకి ఆల్టో మరియు ఇతర ఎమ్‌యూవీ వాహనల గురించి సంక్షిప్త సమాచారాన్ని పొందవచ్చు. డ్రైవ్‌స్పార్క్ తెలుగు ప్రతి మారుతి సుజుకి ఆల్టో గురించి కావాల్సిన పూర్తి సమాచారాన్నిస్తుంది.

మారుతి సుజుకి ఆల్టో పెట్రోల్ మోడళ్లు

వేరియంట్లు ఎక్స్-షోరూమ్ ధర
హ్యాచ్‌బ్యాక్ | Gearbox
3,14,856
హ్యాచ్‌బ్యాక్ | Gearbox
3,20,845
హ్యాచ్‌బ్యాక్ | Gearbox
3,86,246
హ్యాచ్‌బ్యాక్ | Gearbox
3,92,230
హ్యాచ్‌బ్యాక్ | Gearbox
4,12,218
హ్యాచ్‌బ్యాక్ | Gearbox
4,25,783

మారుతి సుజుకి ఆల్టో సిఎన్‌జి మోడళ్లు

వేరియంట్లు ఎక్స్-షోరూమ్ ధర
హ్యాచ్‌బ్యాక్ | Gearbox
4,76,236
హ్యాచ్‌బ్యాక్ | Gearbox
4,82,095

మారుతి సుజుకి ఆల్టో మైలేజ్

గేర్ బాక్స్ ఇంధన రకం మైలేజ్
పెట్రోల్ 22.05
సిఎన్‌జి 31.59

మారుతి సుజుకి ఆల్టో రివ్యూ

Rating :
మారుతి సుజుకి ఆల్టో Exterior And Interior Design

మారుతి సుజుకి ఆల్టో ఎక్ట్సీరియర్ మరియు ఇంటీరియర్ డిజైన్

మారుతి సుజుకి కొత్త ఆల్టో 800 ని భారత మార్కెట్లో ప్రవేశపెట్టింది. కొత్త మారుతి సుజుకి ఆల్టో 800 మునుపటి మోడల్‌తో పోలిస్తే చిన్న కాస్మెటిక్ అప్‌డేట్స్‌ కలిగి ఉంటుంది. ఇందులో ఎక్స్టీరియర్ డిజైన్ విషయానికి వస్తే, ఇందులో కొత్త ఫ్రంట్ గ్రిల్ మరియు అప్డేటెడ్ ఫ్రంట్ బంపర్ ఉంటుంది. ఫ్రంట్ బంపర్ ఇప్పుడు పెద్ద సెంట్రల్ ఎయిర్ డ్యామ్‌తో వస్తుంది.

ఫ్రంట్ ఎండ్‌కు మాత్రమే అప్డేట్స్ కాకుండా, మిగిలిన భాగం ఎక్కువ మార్పు చెందదు. ఆల్టో 800 మార్కెట్లో మునుపటి మోడళ్ల మాదిరిగానే అదే సిల్హౌట్‌ను కలిగి ఉంది. మారుతి సుజుకి ఇప్పుడు '800' బ్యాడ్జింగ్‌ను తొలగించింది. కొత్త మారుతి ఆల్టో మునుపటి మోడల్ కంటే 15 మిమీ పొడవుగా ఉంటుంది.

మారుతి సుజుకి ఆల్టో డిజైన్ చాలా వరకు అదేవిధంగా ఉంది. కానీ దీహి ఇప్పటికి చాలా మంది వినియోగదారులను ఆకర్షించడానికి ఉపయోగపడుతుంది. ఇందులో మరొక ప్రధాన మార్పు కొత్త పెయింట్ స్కీమ్. ఇది కొత్త కలర్ తో పాటు, మారుతి సుజుకి మరో ఐదు స్టాండర్డ్ పెయింట్ ఆప్సన్స్ తో లభిస్తుంది. అవి మోజిటో గ్రీన్, సెరులియన్ బ్లూ, సిల్కీ సిల్వర్, సుపీరియర్ వైట్ మరియు గ్రానైట్ గ్రే.

మారుతి సుజుకి ఆల్టో ఇంజన్ మరియు పనితీరు

మారుతి సుజుకి ఆల్టో Engine And Performance

మారుతి సుజుకి ఆల్టోలో 800 సిసి ఇంజిన్‌ను అప్‌డేట్ చేసింది. కొత్త ఆల్టోలో కొత్త 800 సిసి పెట్రోల్ ఇంజన్ ఇప్పుడు బిఎస్-6 ఉద్గార ప్రమాణాలకు అనుకూలంగా అప్డేట్ చేయబడింది. ఈ ఇంజన్ 796 సిసి త్రీ సిలిండర్ పెట్రోల్ ఇంజన్ రూపంలో 48 బిహెచ్‌పి మరియు 69 ఎన్ఎమ్ టార్క్ ఉత్పత్తి చేస్తుంది. ఇంజిన్ స్టాండర్డ్ 5-స్పీడ్ మాన్యువల్ గేర్‌బాక్స్‌తో జతచేయబడుతుంది.

చిన్న ఇంజిన్ ఇప్పటికీ పెప్పీగా అనిపిస్తుంది మరియు నగర ట్రాఫిక్‌లో రోజువారీ వినియోగానికి చాలా అనుకూలంగా ఉంటుంది. ఇందులో ఉన్న ఇంజిన్ చాలా సమర్థవంతంగా ఉంటుంది. అంతే కాకుండా ఇది మంచి మైలేజ్ అందిస్తుంది. క్లచ్ తేలికగా ఉంటుంది, అయితే గేర్‌షిఫ్ట్‌లు మృదువుగా ఉంటాయి, కావున ఇవి చాలా సులభంగా అమల్లోకి వస్తాయి.

మారుతి సుజుకి ఆల్టో ఇంధన సామర్థ్యం

మారుతి సుజుకి ఆల్టో Fuel Efficiency

మారుతి సుజుకి ఆల్టో 35 లీటర్ల ఇంధన ట్యాంక్ కలిగి ఉంటుంది. మారుతి సుజుకి ఆల్టోకు BS-VI నవీకరణతో, ఎంట్రీ-లెవల్ హ్యాచ్‌బ్యాక్ ఇప్పుడు క్లెయిమ్ చేసిన ARAI- సర్టిఫైడ్ ఇంధన సామర్థ్య గణాంకాలను లీటరుకు 22.05 కి.మీ.

మారుతి సుజుకి ఆల్టో ముఖ్యమైన ఫీచర్లు

మారుతి సుజుకి ఆల్టో Important Features

కొత్త మారుతి సుజుకి ఆల్టో మంచి ఫీచర్స్ మరియు సేఫ్టీ ఫీచర్స్ కూడా కలిగి ఉంటుంది. మారుతి సుజుకి కొత్త భద్రతా నియమాన్ని పాటించేవిధంగా అప్డేట్ చేయబడింది.

కొత్త మారుతి సుజుకి ఆల్టో ఇప్పుడు ఎబిఎస్‌ విత్ ఈబిడి, డ్రైవర్ ఎయిర్‌బ్యాగులు, సీట్-బెల్ట్ రిమైండర్‌లు, హై-స్పీడ్ అలర్ట్ సిస్టమ్ మరియు రివర్స్ పార్కింగ్ సెన్సార్‌ వంటివి కలిగి ఉంటుంది.

ఎంట్రీ లెవల్ హ్యాచ్‌బ్యాక్‌లోని ఇతర ఫీచర్స్ విషయానికి వస్తే, ఇందులో కొత్త డ్యూయల్-టోన్ డాష్‌బోర్డ్, డబుల్ డిఎన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, యుఎస్‌బి, బ్లూటూత్ మరియు ఆక్స్-ఇన్ కనెక్టివిటీ. టాప్-స్పెక్ వేరియంట్లలో కీలెస్ ఎంట్రీ, సెంట్రల్ డోర్ లాకింగ్, ఫ్రంట్ పవర్ విండోస్ మరియు అంతర్గతంగా అడ్జస్టబుల్ ORVM లు కూడా ఉన్నాయి.

మారుతి సుజుకి ఆల్టో తీర్పు

మారుతి సుజుకి ఆల్టో Verdict

మారుతి సుజుకి ఆల్టో భారత మార్కెట్లో అత్యధికంగా అమ్ముడైన ఎంట్రీ లెవల్ హ్యాచ్‌బ్యాక్‌లలో ఒకటి. ఆల్టో కంపెనీకి వాల్యూమ్ అమ్మకాలను తెస్తుంది, కావున కంపెనీ ఈ మారుతి సుజుకి ఆల్టో ఉత్పత్తిని ఎప్పుడైనా ఆపే ఆలోచన లేదు.

మారుతి సుజుకి ఆల్టో మారుతి సుజుకి ఆల్టో కలర్లు


Granite Grey
Cerulian Blue
Mojito Green
Uptown Red
Silky Silver
Solid White

మారుతి సుజుకి ఆల్టో పెట్రోల్ కాంపిటీటర్స్

మారుతి సుజుకి ఆల్టో పెట్రోల్ మైలేజ్ కంపారిజన్

  • రెనాల్ట్ క్విడ్ రెనాల్ట్ క్విడ్
    local_gas_station పెట్రోల్ | 23
  • డాట్సన్ రెడీ గో డాట్సన్ రెడీ గో
    local_gas_station పెట్రోల్ | 20.71

మారుతి సుజుకి మారుతి సుజుకి ఆల్టో ఫోటోలు

మారుతి సుజుకి ఆల్టో Q & A

మారుతి సుజుకి ఆల్టోను సిఎన్‌జి వేరియంట్‌లో కూడా అందిస్తుందా?

లేదు, మారుతి సుజుకి ఆల్టో సిఎన్‌జి వేరియంట్లో అందుబాటులో లేదు.

Hide Answerkeyboard_arrow_down
మారుతి సుజుకి ఆల్టో భారతదేశంలో భద్రతా నిబంధనలను పాటిస్తుందా?

అవును, మారుతి సుజుకి ఏప్రిల్ 2019 యొక్క భద్రతా నిబంధనలను పాటిస్తుంది. అయితే, కంపెనీ అక్టోబర్ 2019 లో రాబోయే క్రాష్ టెస్ట్ నిబంధనలతో ఆల్టోను ఇంకా అప్‌డేట్ చేయలేదు.

Hide Answerkeyboard_arrow_down
మారుతి సుజుకి ఆల్టో లాంగ్ హైవే డ్రైవ్‌లలో ఎలా పని చేస్తుంది?

మారుతి సుజుకి ఆల్టో లాంగ్ హైవే డ్రైవ్‌లలో బాగా పనిచేస్తుంది. ఎక్కువసేపు అధిక వేగంతో నెట్టివేసినప్పుడు ఇది కొంత కష్టపడుతోంది.

Hide Answerkeyboard_arrow_down
మారుతి సుజుకి ఆల్టో మొదటిసారి కారు కస్టమర్ కి మంచి కొనుగోలుగా ఉందా?

అవును, మారుతి సుజుకి ఆల్టో భారత మార్కెట్లో మొదటిసారి కొనుగోలు చేసేవారికి ఖచ్చితంగా సరిపోతుంది. ఇది మంచి పనితీరు, మంచి మైలేజ్ మరియు మృదువైన మరియు సమర్థవంతమైన డ్రైవ్‌ను అందిస్తుంది.

Hide Answerkeyboard_arrow_down
భారతదేశంలో మారుతి సుజుకి ఆల్టోకు ప్రత్యర్థులు ఏవి?

మారుతి సుజుకి ఆల్టో భారత మార్కెట్లో రెనాల్ట్ క్విడ్ మరియు డాట్సన్ రెడి-గో వంటి వాటికి ప్రత్యర్థిగా ఉంటుంది.

Hide Answerkeyboard_arrow_down
భారతదేశంలో మారుతి సుజుకి ఆల్టో అమ్మకాల పనితీరు ఎలా ఉంది?

మారుతి సుజుకి ఆల్టో గత కొన్ని సంవత్సరాలుగా స్థిరంగా నెలవారీగా మార్కెట్లో అత్యధికంగా అమ్ముడవుతున్న కారు.

Hide Answerkeyboard_arrow_down
మారుతి సుజుకి ఆల్టో రెనాల్ట్ క్విడ్‌కు వ్యతిరేకంగా ఎలా వ్యవహరిస్తుంది?

మారుతి సుజుకి రెనాల్ట్ క్విడ్‌కు ప్రత్యక్ష ప్రత్యర్థి మరియు అనేక లక్షణాలు మరియు పరికరాలను అందిస్తుంది. అయితే ధరతో మాత్రమే రెనాల్ట్ క్విడ్ ఆల్టోతో పోలిస్తే మంచి ప్యాకేజీ.

Hide Answerkeyboard_arrow_down
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X