నిస్సాన్ చిన్న కారు డిజైన్ అదిరిపోయింది

By

Nissan
జపాన్ కు చెందిన ఆటోమొబైల్ కంపెనీ నిస్సాన్ తాజా ఓ చిన్న కారు 'మైక్రా' ను రూపొందించే పనిలో వున్నట్టు మనకు తెలిసిందే. గ్లోబల్ స్మాల్ కారుగా దీన్ని రూపొందిస్తున్నట్టు కంపెనీ ప్రకటించిన విషయం తెలిసిందే. 2011 లో విడుదల కానున్న ఈ కారు పూర్తి డిజైన్ ను ఇటీవలే చెన్నైలోని ఈ కంపెనీ వర్గాలు విడుదలచేసాయి. ఇంతకు ముందు విడుదల చేసిన డిజైన్ల కన్నా ఇప్పుడు విడుదల చేసిన ఈ స్కెచ్ సంపూర్ణంగా వుందని అంటున్నారు ఆటోమొబైల్ నిపుణులు.

ఈ సందర్భంగా నిస్సాన్ డిజైన్ చీఫ్ షిరో నాకమురా మాట్లాడుతూ ఈ మైక్రా కారు డిజైను ఇప్పుడున్న కార్ల డిజైన్లకు భిన్నంగా వుందనీ, తప్పకుండా అందరినీ ఆకట్టుకుంటుందనే ఆశాభావాన్ని వ్యక్తం చేసారు. దీంతో నిస్సాన్ ఇండియాలో మంచి మార్కెట్ ను ఏర్పరచుకుంటుందని జోష్యం చెప్పారు. ఈ డిజైనుకు మంచి స్పందన రావడం చూస్తుంటే ఆయన ఆశ నిజమయ్యేలా వుందని అంటున్నారు నిపుణులు.

Most Read Articles

Story first published: Thursday, November 5, 2009, 16:58 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X