మారుతీ-800 స్థానంలో మరో కారు..!!

ఈ కారు గురించి మరిన్ని వివరాలు అందించేందుకు కంపెనీ వర్గాలు నిరాకరించాయి. కానీ విశ్వసనీయంగా అందిన సమాచారం ప్రకారం మారుతీ కంపెనీ మరో రెండు చిన్న కార్లను రూపొందించే పనిలో నిమగ్నమయినట్టు తెలిసింది. ఇందులో ఒకటి బహుళజనాధరణ పొందిన మారుతీ వ్యాగనర్ కు తాజాగా వెర్షన్ గా వస్తొందని, దీని పేరుని YR9 గా నిర్ణయించారని తెలిసింది. దీనితో పాటుగా మారుతీ కంపెనీలో మంచి ఆదరణ పొందిన చిన్న కారు మారుతీ-800 కు ప్రత్నామ్యాయంగా మరో చిన్న కారుని రూపొందించనున్నారు. దీని కోడింగ్ పేరును YE3 గా నిర్ణయించారు. కాగా భారత్-4 నియమనిబంధనల ప్రకారం మారుతీ-800 వాహనానికి కొన్ని మార్పులు చెయ్యవలసిన అవసరం వుందని లేకపోతే ఈ కారు ప్రొడక్షన్ ఆపివెయ్యాలని కంపెనీకి ఉత్తర్వులు అందిన సంగతి తెలిసిందే. కానీ ఈ ప్రక్రియ వల్ల ఉపయోగం తక్కవని భావించిన కంపెనీ యాజమాన్యం మరో చిన్న కారుని రూపొందించి, మారుతీ-800 స్థానంలో ఈ కారుని విడుదల చెయ్యాలనుకుంటున్నట్టు తెలిపారు.


Click it and Unblock the Notifications








