రోడ్డు ప్రమాదాల కారణంగా ప్రతి గంటకు 15 మంది మృతి: రిపోర్ట్

Road Accidents
రోడ్డు ప్రమాదాల కారణంగా మృతి చెందుతున్న వారి సంఖ్య గణనీయంగా పెరుగుతోంది. 2009లో ప్రతి గంటకు 15 మంది మృతి చెందారని, అలాగే ప్రతి గంటకు 58 మంది గాయాలపాలయ్యారని రోడ్డు, రవాణా మరియు రహదారుల మంత్రిత్వ శాఖ విడుదల చేసిన నివేదికలు వెల్లడిస్తున్నాయి. ఈ గణాంకాలను బట్టి చూస్తుంటే.. రోడ్డు ప్రమాదాలపై అవగాహన కల్పించేందుకు రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలతో పాటు వివిధ స్వచ్ఛంద సంస్థలు చేపడుతున్న పథకాలు, ప్రచారాల ప్రభావం అంతత మాత్రంగానే ఉన్నట్లు తెలుస్తోంది.

గతేడాదిలో రోడ్డు ప్రమాదాలను రెండేళ్లలో 50 శాతానికి తగ్గిస్తామని సదరు మంత్రిత్వ శాఖ ప్రమాణం చేసింది. కాగా.. దేశవ్యాప్తంగా మొత్తం రోడ్డు ప్రమాదాలలో 50 శాతం మరణాలు ఆంధ్రప్రదేశ్, ఉత్తరప్రదేశ్, తమిళనాడు, మాహారాష్ట్ర మరియు కర్ణాటకలలోనే నమయోదయ్యాయి. గత రెండేళ్లుగా ఈ ఐదు రాష్ట్రాలు రోడ్డు ప్రమాదాలలో అగ్రస్థానంలో ఉన్నాయి. కార్లు, ద్విచక్రవాహనాల ద్వారా సంభవించిన ప్రమాదాలు 33 శాతంగా నమోదయ్యాయి. 70 శాతం రోడ్డు ప్రమాదాలు డ్రైవర్ల తప్పిదాల కారణంగానే సంభవిస్తున్నట్లు ఈ గణాంకాలు వెల్లడిస్తున్నాయి.

ట్రాన్స్‌పోర్ట్ రీసెర్చ్ విభాగం రూపొందించిన ఈ నివేదక ప్రకారం.. 2009లో రోడ్డు ప్రమాదాల కారణంగా 1,25,600 మంది మరణించారు. అంటే ఆ సంవత్సరంలో రోజుకు సగటున 344 మంది, అలాగే గంటకు 15 మంది చెందుతున్నారు. 2008లో కూడా అత్యధికంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 14,770 మంది మరణించగా, ఉత్తరప్రదేశ్‌లో 14,638 మంది మృతి చెందారు. ఇక మెట్రో నగరాల విషయానికి వస్తే.. ఢిల్లీలో అత్యధికంగా 2,325 మంది మరణించగా, బెంగుళూరులో 740 మంది, ముంబైలో 628 మంది మృత్యవాత పడ్డారు. ఈ గణాంకాలను బట్టి చూస్తుంటే రోడ్డు భద్రతపై ప్రజలకు, అధికారులకు అవగాహనా సామర్థ్యం ఇట్టే అర్థమవుతుంది. ప్రజలు, అధికారులు ఇకనైనా మేలుకోవాలి. ప్రాణం విలువ తెలుసుకోవాలి.

Most Read Articles

English summary
According to the latest figures released by Road, Transport and Highways Ministry, there has been a sharp rise in road deaths due to road accidents. In 2009, road accidents claimed at least 15 lives and injured another 58 every hour says the report.
Story first published: Friday, May 6, 2011, 12:34 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X