పివో3 ఎలక్ట్రిక్ కాన్సెప్ట్‌ను ఆవిష్కరించిన నిస్సాన్

Nissan Pivo 3 EV
ఈ ఫోటో చూడగానే మీకు అర్థం అయిపోయి ఉంటుంది, ఇదేదో.. కాన్సెప్ట్ కారు అని. నిజమే..! ఇది నిస్సాన్ రూపొందించిన ఎలక్ట్రిక్ కాన్సెప్ట్ కారు. దీనిపేరు "నిస్సాన్ పివో 3 ఈవీ" ముగ్గురు ప్రయాణికులు కూర్చుని ప్రయాణించేలా రూపొందించిన ఈ నిస్సాన్ పివో సాధారణ ఎలక్ట్రిక్ కార్ల మాదిరిగా కాకుండా ఎన్నో విశిష్టమైన ఫీచర్లను కలిగి ఉంది.

ఎవరైనా సులువుగా డ్రైవింగ్ చేయగలగడం, చాలా సులువుగా కారు బ్యాటరీని ఛార్జింగ్ చేసుకోవడం ఇందులో ప్రత్యేకత. ఇందులో ఆటోమేటెడ్ వాలెట్ పార్కింగ్ (ఏవిపి) అనే సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించారు. ఈ సాంకేతి పరిజ్ఞానం కారణంగా, కారును పార్కింగ్ చేయడానికి స్థలాన్ని వెతుక్కోవడానికి పార్కింగ్ గ్యారేజ్ చుట్టూ చక్కర్లు కొట్టాల్సిన అవసరం లేకుండా పార్కింగ్ స్పాట్ కారే స్వయంగా గుర్తించి డ్రైవర్‌కు తెలియజేస్తుంది.

అంతేకాకుండా.. ఇది దానంతట అదే చార్జింగ్ చేసుకుంటుంది. డ్రైవర్ తన స్మార్ట్ ఫోన్ నుండి కాల్ చేసినప్పుడు జేమ్స్ బాండ్ చిత్రం క్యాసినో రాయల్‌లో ఉపయోగించిన ఆస్టన్ మార్టిన్ డిబి5 కారు మాదిరిగా దానంతట అదే ఇంజన్ ఆన్ చేసుకుని డ్రైవర్ వద్దకు వచ్చేస్తుంది. నిస్సాన్ ఇది వరకు ఆవిష్కరించిన పివో, పివో 2 మోడల్స్ మాదిరిగానే పివో 3 కూడా అర్బన్ డ్రైవింగ్‌కు చక్కగా సరిపోతుంది.

నిస్సాన్ పివో 3 ఎలక్ట్రిక్ వాహనం 100 అడుగులు పొడవు ఉండి కేవలం 13 అడుగులు స్థలంలోనే యూ టర్న్ తీసుకునే సౌకర్యం ఉంటుంది. ఇందులో డ్రైవర్‌కు ఇరువైపులా ఇద్దరు ప్యాసింజర్‌లు కూర్చునేలా దీని ఇంటీరియర్‌ను డిజైన్ చేశారు. మారుతిని ఓమ్నీ వ్యాన్ మాదిరిగానే పివో 3 ఎలక్ట్రిక్ కారు డోర్లు కూడా పక్కవైపు తెరుచుకునేలా అమర్చారు. టోక్యో మోటార్ షోలో నిస్సాన్ ఈ కారును ప్రదర్శించనుంది.

Most Read Articles

English summary
Japanese auto major Nissan has unveiled its futuristic Pivo 3 concept electric vehicle. This EVis a three-seater that expands on the Pivo and Pivo 2. Nissan has developed this Pivo 3 EV with latest technology called Automated Valet Parking (AVP), which allows the driver to park his car easily.
Story first published: Saturday, November 12, 2011, 12:09 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X