పియోజియోట్‌కు ఎకరా రూపాయికే ఆఫర్ చేసిన ఏపి సర్కార్

ఈ ఫ్రెంచ్ కంపెనీ భారత్‌లో తమ ప్లాంటు ఏర్పాటు చేయాలని భావిస్తోంది. ఈ విషయం తెలుకున్న ఆంధ్రప్రదేశ్ సర్కారు సదరు కంపెనీకు ఈ బంపర్ ఆఫర్‌ను ప్రకటించింది. మా రాష్ట్రంలో ప్లాంటు స్థాపిస్తే స్థలాన్ని చవకగా ఇవ్వడమే కాకుండా అదనపు రాయితీలు కూడా ఉంటాయని పేర్కొంది. ఈ ప్లాంటు స్థాపన కోసం పియోజియోట్ దాదాపు ఆరు వేల కోట్ల రూపాయలను పెట్టుబడులుగా పెట్టనుందని అంచనా. కానీ కంపెనీ మాత్రం దీనిపై ఇంకా ఎలాంటి నిర్ణయాన్ని తీసుకోలేదు.
కానీ.. కంపెనీ మాత్రం ముఖ్యంగా తమిళనాడు, గుజరాత్ రాష్ట్రాలపై దృష్టి సారించింది. ఇందుకు చాలానే కారణాలున్నాయి. తమిళనాడులో ఈ ఫ్యాక్టరీని ఏర్పాటు చేస్తే ఎన్నూర్‌లోని ఓడ రేవుల నుంచి కార్లను ఎగుమతి చేయవచ్చు. అంతేకాకుండా చెన్నై నగరం ఇప్పటికే ఆటోమోటివ్ హబ్ ఏర్పడి, విడిభాగాలను సరఫరా చేసే వారు కూడా అందుబాటులో ఉన్నారు. అయితే భూమిని చౌకగా ఇస్తే ఈ ఫ్రెంచ్ కంపెనీ మనవైపుకు మొగ్గవచ్చునని ఆంధ్రప్రదేశ్ ఈ ఆఫర్ ఇచ్చినట్లు తెలుస్తుంది.
అలాగే గుజరాత్‌లోని నానో ప్లాంటుకు సమీపంలో ఉన్న భూములను కంపెనీ పరిశీలిస్తున్నట్లు సమాచారం. తక్షణమే పనులు ప్రారభించడానికి 150 ఎకరాల భూమి సరిపోతుందని కంపెనీ భావిస్తోంది. పియోజియోట్ గనుక భారత్‌లో కార్యకలాపాలు ప్రారంభిస్తే.. ఇప్పటికే భారత మార్కెట్లో ఉన్న 700 ఫ్రెంచ్ కంపెనీలలో పియోజియోట్ తనదైన ప్రాముఖ్యతను చాటుకోనుంది. ఏదేమైనప్పటి కంపెనీ ఆంధ్రప్రదేశ్ ఆఫర్‌వైపు మొగ్గు చూపితే రూపాయికే ఎకరా భూమి ఏంటి ప్రభుత్వం విమర్శలు ఎదుర్కునే ఆస్కారం ఉంది.


Click it and Unblock the Notifications








