కాంపాక్ట్ హైబ్రిడ్ కారును విడుదల చేయనున్న టొయోటా

Toyota Hyundai Car
జపాన్ ఆటో దిగ్గజం టొయోటా మోటార్ కార్ప్ ఈ ఏడాది జనవరిలో ఓ కాంపాక్ట్ హైబ్రిడ్ కారును విడుదల చేయనున్నట్లు సమాచారం. ఇది లీటరుకు 40 కిలోమీటర్ల మైలేజీనిస్తుందని, పెట్రో-ఎలక్ట్రిక్ కార్లలో ఇది అత్యుత్తమ మైలేజ్ అని టొయోటాను ఉటంకిస్తూ జపాన్ వాణిజ్య పత్రిక నిక్కీ పేర్కొంది. వచ్చే ఏడాది జనవరిలో జరగనున్న ఢిల్లీ ఆటో ఎక్స్‌పోలో టొయోటా ఈ కారును విడుదల చేసే అవకాశం ఉంది.

టొయోటా విడుదల చేయనున్న కాంపాక్ట్ హైబ్రిడ్ కారు పేరు 'ఆక్వా'. ప్రస్తుతం టొయోటా ప్రయస్‌లో ఉపయోగించిన పవర్‌ట్రైన్ ఆధారంగానే ఆక్వాను కూడా డిజైన్ చేశారు. ప్రస్తుతం జపాన్‌లో ప్రయస్ హైబ్రిడ్ కారు లీటరుకు 32 కి.మీ. మైలేజీనిస్తుంది. అయితే, దీనిపై స్పందించేందుకు టొయోటా నిరాకరించినట్లు నిక్కీ పేర్కొంది.

దీని ధర సుమారు 22,000 అమెరికన్ డాలర్లు (మన కరెన్సీలో దాదాపుగా రూ. 10 లక్షల నుండి రూ.11 లక్షల మధ్యలో) ఉండొచ్చని అంచనా. యువ డ్రైవర్లు, మహిళలను లక్ష్యంగా చేసుకొని టొయోటా ఈ కాంపాక్ట్ కారును విడుదల చేయనున్నట్లు సదరు పత్రిక వెల్లడించింది. ఏదేమైనప్పటికీ.. పెట్రోల్ ధరలు మండిపోతున్న ఈ రోజుల్లో ఇలాంటి కార్ల అవసరం మనకు ఎంతైనా ఉంది. వీలైనంత త్వరగా ఆక్వా కారును భారత్‌లో విడుదల చేయాలని టొయోటాను కోరుకుందాం.

Most Read Articles

English summary
According to the recent reports from German media, Japanese auto major Toyota Motor Corp is planning to launch a compact hybrid car named as 'Aqua' for Indian market in next January. It is speculated that, Aqua will give the mileage of 40 km/litre.
Story first published: Wednesday, September 28, 2011, 14:04 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X