ఇన్నోవా, ఫార్చ్యూనర్ దెబ్బకు రికార్డులు బద్ధలు..7-సీటర్ కార్ల కోసం షోరూంల ముందు జనం క్యూ
భారతీయ ఆటోమొబైల్ మార్కెట్లో టయోటా (Toyota) బ్రాండ్ అంటేనే ఒక నమ్మకం. క్వాలిటీ, కంఫర్ట్, ఇంజన్ లైఫ్ విషయంలో టోయోటాకు సాటి మరెవరూ లేరని కార్ లవర్స్ నమ్ముతుంటారు. ఆ నమ్మకమే ఇప్పుడు విక్రయాల రూపంలో కనిపిస్తోంది. ఫిబ్రవరి 2026 నెల టయోటా కిర్లోస్కర్ మోటార్స్ (TKM) పాలిట ఒక అద్భుతమైన వరంగా మారింది. ఈ ఏడాది ఫిబ్రవరి నెలలో కంపెనీ ఏకంగా 34,034 యూనిట్ల మొత్తం అమ్మకాలను నమోదు చేసి సరికొత్త రికార్డు సృష్టించింది. గత ఏడాది ఫిబ్రవరి 2025లో నమోదైన 28,414 యూనిట్లతో పోలిస్తే, ఈసారి కంపెనీ దాదాపు 20 శాతం వృద్ధిని సాధించి మార్కెట్లో తన పట్టును మరింత బిగించింది.
ముఖ్యంగా భారతీయ కుటుంబాలు టయోటా అందించే 7-సీటర్ (7-Seater) కార్ల మీద విపరీతమైన ఆసక్తిని చూపిస్తున్నాయి. టయోటా ఇన్నోవా క్రిస్టా, ఇన్నోవా హైక్రాస్, ఫార్చ్యూనర్ వంటి మోడళ్లు అమ్మకాల్లో దుమ్మురేపుతున్నాయి. ఫిబ్రవరి నెలలో కేవలం 28 రోజులే ఉన్నప్పటికీ, రోజుకు సగటున వెయ్యికి పైగా కార్లను విక్రయించడం అంటే టయోటా క్రేజ్ ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు.

దేశీయ మార్కెట్లోనే కాకుండా, విదేశాలకు కార్లను ఎగుమతి చేయడంలో కూడా టయోటా దూసుకుపోతోంది. ఈ ఏడాది ఎగుమతుల్లో ఏకంగా 65 శాతం వృద్ధిని నమోదు చేయడం ద్వారా గ్లోబల్ మార్కెట్లో కూడా భారతీయ తయారీ కార్లకు మంచి గిరాకీ ఉందని నిరూపించింది.
టయోటా కార్లకు ఇంతటి ఆదరణ దక్కడానికి గల ప్రధాన కారణాలను విశ్లేషిస్తే, అందులో మొదటిది వాటి రీసేల్ వాల్యూ (Resale Value). టయోటా కారును ఐదేళ్లు వాడి అమ్మినా, మంచి ధర వస్తుందనే నమ్మకం కస్టమర్లలో బలంగా ఉంది. దీనికి తోడు కంపెనీ తన కార్లలో నిరంతరం చేస్తున్న మార్పులు కూడా తోడవుతున్నాయి. ఇటీవల టయోటా తన పాపులర్ ఎస్‌యూవీ అర్బన్ క్రూజర్ హైరైడర్ కోసం ప్రత్యేకంగా టెక్ ప్యాకేజీ (Tech Package)ను పరిచయం చేసింది.

ఈ ప్యాకేజీ ద్వారా కారు లోపల మరిన్ని అడ్వాన్స్‌డ్ ఫీచర్లు, విలాసవంతమైన ఇంటీరియర్స్ అందుబాటులోకి వచ్చాయి. ఈ కొత్త అప్‌డేట్‌కు కస్టమర్ల నుంచి అద్భుతమైన స్పందన లభిస్తోంది. కేవలం ఫీచర్లు మాత్రమే కాకుండా, టయోటా అందిస్తున్న స్ట్రాంగ్ హైబ్రిడ్ టెక్నాలజీ (Hybrid Technology) కూడా మైలేజ్ విషయంలో కస్టమర్లను ఆకట్టుకుంటోంది.
కంపెనీ ప్రతినిధులు తెలిపిన వివరాల ప్రకారం, ఫిబ్రవరి నెలలో సాధించిన ఈ విజయం కస్టమర్ల నమ్మకానికి నిదర్శనం. విక్రయాల్లో కేవలం దేశీయంగా 30,737 యూనిట్లను అమ్ముడుపోగా, మిగిలిన 3,297 యూనిట్లు విదేశాలకు ఎగుమతి అయ్యాయి. టయోటా ఇప్పుడు కేవలం కార్లను అమ్మడమే కాకుండా, కస్టమర్ల మారుతున్న అవసరాలకు అనుగుణంగా వాల్యూ-డ్రివెన్ మొబిలిటీ సొల్యూషన్స్ అందించడంపై దృష్టి పెట్టింది.

గ్లాంజా వంటి చిన్న కార్ల నుంచి రూమియన్, ఇన్నోవా వంటి ఫ్యామిలీ కార్ల వరకు అన్ని విభాగాల్లోనూ టయోటా తన ఆధిపత్యాన్ని ప్రదర్శిస్తోంది. ముఖ్యంగా గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో సర్వీస్ నెట్‌వర్క్‌ను బలోపేతం చేయడం వల్ల కస్టమర్లకు మరింత చేరువయ్యింది.
భారతీయ రోడ్లపై ఇప్పుడు ఇన్నోవా, ఫార్చ్యూనర్ వంటి కార్లు ఒక హోదాకు చిహ్నంగా మారిపోయాయి. టయోటా అందించే నమ్మకమైన ఇంజన్ పనితీరు వల్ల వేల కిలోమీటర్లు ప్రయాణించినా కారు కొత్తదనం కోల్పోదని వినియోగదారులు చెబుతుంటారు. ఫిబ్రవరి 2026 విక్రయాల జోరు చూస్తుంటే, రాబోయే నెలల్లో టయోటా మరిన్ని సంచలనాలు సృష్టించే అవకాశం ఉంది.
ఎలక్ట్రిక్ వాహనాల (EV) దిశగా కూడా అడుగులు వేస్తున్న టోయోటా, ఇప్పటికే హైబ్రిడ్ కార్లతో పర్యావరణ హితమైన ప్రయాణాన్ని కస్టమర్లకు చేరువ చేస్తోంది. సేఫ్టీ, క్వాలిటీ, బ్రాండ్ వాల్యూ అనే మూడు సూత్రాలతో టయోటా దూసుకుపోతోంది.


Click it and Unblock the Notifications








