సన్ ఫిల్మ్ తీయకపోతే డ్రైవింగ్ లైసెన్స్ రద్దు చేయరట!

వాహనాల అద్దాలకు నల్లటి ఫిల్ములను ఉపయోగించడాన్ని సప్రీం కోర్టు నిషేధించినప్పటి నుంచి, ట్రాఫిక్ పోలీసులు దీనిపై విస్తృత స్థాయిలో సోదాలు నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. పరిమితులకు మించి వాహనాల్లో ఉపయోగించే అద్దాలకు టింట్ చేయబడి ఉంటే (నల్లటి సన్ ఫిల్ములు అంటించబడడినట్లయితే) దానిని ట్రాఫిక్ నిబంధన ఉల్లంఘనగా పరిగణించి, ట్రాఫిక్ అధికారులు రూ.100 నుంచి రూ.500 మేర జరిమానాలను వసూలు చేయటం జరిగుతుంది.

కాగా.. సుప్రీం కోర్టు వాహనాలకు సన్ ఫిల్ముల వాడకంపై నిషేధం విధించి సుమారు నెల రోజులు కావస్తున్నప్పటికీ, కొందరు వాహనా చోదకులు మాత్రం ఇంకా వారి వాహనాల నుంచి ఈ సన్ ఫిల్ములను తొలగించ లేదు. దీంతో ట్రాఫిక్ పోలీసులు సదరు వాహన యజమానుల నుంచి భారీ మొత్తాల్లో జరిమానాలు వసూలు చేస్తన్నారు. అయితే, ఈ తప్పును పదే పదే చేసిన వారు లేదా ఇలా సన్ ఫిల్ములు తొలగించకుండా ట్రాఫిక్ అధికారులకు పలుమార్లు దొరికిన వారి డ్రైవింగ్ లైసెన్సులను రద్దు చేయటం జరుగుతుందని భారీ ఎత్తున ప్రచారం జరుగుతోంది.


మొదటి రెండు తప్పులకు జరిమానాతో సరిపెట్టి, మూడోసారి కూడా తప్పు చేసినట్లయితే డ్రైవింగ్ లైసెన్సును రద్దు చేయటం జరుగుతుందని ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో, బెంగుళూరుకు చెందిన అడిషనల్ ట్రాఫిక్ కమిషనర్ ఆఫ్ పోలీస్ (ట్రాఫిక్) అబ్దుల్లా సలీమ్ ఓ ఆంగ్ల పత్రికతో మాట్లాడుతూ, సన్ ఫిల్మును తొలగించకపోయినట్లయితే డ్రైవింగ్ లైసెన్స్ రద్దు చేస్తామని వాహన చోదకులను భయపెట్టమని తమ డిపార్ట్‌మెంట్ ఎలాంటి సందేశాలు జారీ చేయలేదని, ఇలా తరచూ తప్పు చేసిన వారి విషయంలో లైసెన్స్ రద్దు గురించి కేవలం ఆర్టీవో ప్రతిపాదనలు మాత్రమే చేస్తామని ఆయన స్పష్టం చేశారు.

వాస్తవానికి మోటార్ వాహన చట్టంలోని సురక్షిత అద్దాలతో (సేఫ్టీ గ్లాసెస్) సంబంధం ఉన్న నిబంధన ప్రకారం, ఈ నిబంధను ఉల్లంఘించినట్లయితే లైసెన్స్ రద్దు చేయాలని పేర్కొనడం లేదు. ఈ చట్టంలోని సెక్షన్ 20, 23 ప్రకారం కోర్టులు మాత్రమే లైసెన్సు రద్దు చేస్తాయని ఆయన వివరించారు.

Source:

Most Read Articles

English summary
Bangalore Additional Commissioner of Police (Traffic) M. Abdulla Saleem told The Hindu that his department did not issue any “threat” to cancel the licence. “We can only recommend to the licensing authority (RTO) to cancel the driving licence for repeated offences,” he said.
Story first published: Monday, June 18, 2012, 10:59 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X