బ్లాక్ ఫిల్మ్‌లపై నిషేధం; ఒక్క రోజులో 3400 లకు పైగా కేసులు

By Ravi

హైదరాబాద్‌‌‍‌లో సంచరించే మోటార్ వాహనాలకు బ్లాక్ ఫిల్ముల వాడకాన్ని నిషేధిస్తున్నట్లు గతంలో తెలుగు డ్రైవ్ స్పార్క్ ఓ కథనంలో ప్రచురించిన సంగతి తెలిసిందే. సుప్రీం కోర్టు ఆదేశాల మేరకు, హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు అక్టోబర్ 25, 2012 నుంచి నగరంలో దీన్ని అమల్లోకి తీసుకువచ్చారు. ఇప్పటికే నగరంలో సంచరించే వాహనాలకు సన్ ఫిల్ముల వాడకంపై నిషేధం గురించి ప్రింట్, ఎలక్ట్రానిక్, రేడియో, కరపత్రాల పంపిణీ ద్వారా అధికారులు భారీ ఎత్తున ప్రచారం నిర్వహించారు.

కాగా.. వాహనాలకు బ్లాక్ ఫిల్ముల వాడకంపై పోలీసులు గురువారం హైదరాబాద్‌లో ఓ స్పెషల్ డ్రైవ్ నిర్వహించారు. అద్దాలకు బ్లాక్ ఫిల్ములు తొలగించని వాహన యజమానులు జరిమానాలు విధించారు. ఒక్క రోజులోనే సుమారు 3,000 లకు పైగా వాహనాలపై జరిమానాలు విధించారు. గురువారం సాయంత్రం 4.00 గంటల సమయం నాటికి రాష్ట్రంలో ఉన్న 25 ట్రాఫిక్ పోలీస్ స్టేషన్లలో నమోదైన కేసుల వివరాలు ఉన్నాయి.

  • పోలీసు వాహనాలు - 13
  • ఇతర ప్రభుత్వ శాఖల వాహనాలు - 29
  • బస్సులు ట్రక్కులు, డిసిఎమ్‌లు మొదలైన పెద్ద వాహనాలు - 35
  • ఇతర కార్లు/జీపులు - 3,334

Black Films Banned
సుప్రీం కోర్టు ఆదేశాలను పాటించాల్సిందిగా ట్రాఫిక్ పోలీసులు గడచిన రెండు వారాల నుంచి భారీ ప్రచారం నిర్వహిస్తున్నప్పటికీ కేవలం 10-15 శాతం మంది కార్ల యజమానులు మాత్రమే దీనిని పాటించినట్లు తెలుస్తోంది. వాస్తవానికి ఈ తప్పుకు జరిమానా రూ.500 విధించాల్సి ఉన్నప్పటికీ, ప్రారంభంలో భాగంగా, ప్రస్తుతం కేవలం రూ.100 లను మాత్రమే పోలీసులు జరిమానాగా విధిస్తున్నారు. రెండవ సారి కూడా ఇదే తప్పుకు పాల్పడితే ఈసారి అధిక మొత్తాలలో జరిమానాలను విధిచడం జరుగుతుందని అధికాలు తెలిపారు.

అంతేకాకుండా.. స్పాట్‌లో బ్లాక్ ఫిల్ములను కూడా తొలగించేస్తున్నారు. ఈ విషయంలో డ్రైవర్లకు మరింత అవగాహన కల్పించేందుకు గాను కరపత్రాలు పంపిణీ చేస్తున్నారు. మీడియా, విఐపిలు, ప్రభుత్వాధికారులు ఎవరైనా సరే ఈ నిబంధను పాటించి తీరాల్సిందే. ఇందుకు ఎవ్వరు అతీతులు కాదు.

సన్/బ్లాక్ ఫిల్ము తొలగించాలంటే రూ.500 చెల్లించాలి..
కాగా.. మోటార్ వాహనాలకు బ్లాక్ ఫిల్ములను తొలగించేందుకు కొందరు షాపు ఓనర్లు రూ.500 లకు పైగా వసూలు చేస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. ఈ నేపథ్యంలో సదరు షాపు ఓనర్లతో సమావేశం జరిపి బ్లాక్ ఫిల్ములను తొలగించడానికి గరిష్టంగా రూ.100 మాత్రమే వసూలు చేయాలని, ఆ విధంగా బోర్డులను డిస్‌ప్లే చేయాలని హెచ్చరించారు. సన్ ఫిల్ములను తొలగించడానికి రూ.100 కన్నా ఎక్కువ ఛార్జ్ చేస్తే ఈ విషయాన్ని ట్రాఫిక్ పోలీసుల దృష్టికి తీసుకువెళ్లవచ్చు.

"కేంద్ర మోటార్ వాహన చట్టంలోని 100వ నిబంధన ప్రకారం, వాహనాల తయారీదారులు బిగించే ఫ్రంట్ విండ్‌స్క్రీన్స్ (ముందు వైపు అద్దం), రియర్ విండ్‌స్క్రీన్ (వెనుక వైపు అద్దం)లు 70 శాతం విజువల్ లైట్ ట్రాన్స్‌మిషన్ (విఎల్‌టి)ను, కారుకు పక్కల ఉండే అద్దాలు (కారు డోర్లకు అమర్చిన అద్దాలు) 50 విఎల్‌టిని కలిగి ఉండాలి". ఒక్కమాటలో చెప్పాలంటే, వాహనాల తయారీదారులు బిగించే అద్దాలపై (ఫ్యాక్టరీ ఫిట్టెడ్ గ్లాసెస్) ఎలాంటి నల్లటి ఫిల్ములను, విజబలిటీని తగ్గించే పదార్థాలు/వస్తువులను ఉపయోగించరాదు.

Most Read Articles

English summary
On the first day of its Special Drive “Operation Black Film” against the use of tint films on the safety glasses of 4-wheelers, the Hyderabad Traffic Police on Thursday registered as many as 3,411 cases against violators.
Story first published: Friday, October 26, 2012, 13:45 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X