దీపావళికి ముందే మార్కెట్లోకి రానున్న టాటా నానో సిఎన్‌జి

Posted By:

మధ్యతరగతి ప్రజల కారు కలను సాకారం చేస్తూ, టాటా మోటార్స్ అధినేత రతన్ టాటా ప్రవేశపెట్టిన 'ప్రజల కారు' టాటా నానో త్వరలోనే మరో కొత్త వేరియంట్‌లో లభ్యం కానుంది. ఈ ఏడాది అరంభంలో జరిగిన 2012 ఢిల్లీ ఆటో ఎక్స్‌పోలో టాటా మోటార్స్ ప్రదర్శనకు ఉంచిన సిఎన్‌జి వేరియంట్ టాటా నానో కారును ప్రస్తుత పండుగ సీజన్‌లో విడుదల చేయాలని కంపెనీ యోచిస్తోంది.

సాధారణంగా కార్ కంపెనీలు, కొత్త మోడళ్లను మార్కెట్లో ప్రవేశపెట్టేందుకు పండుగ సీజన్‌ను ఎంచుకుంటుంటాయి. ఈ నేపథ్యంలో, మార్కెట్ సెంటిమెంట్ బలంగా ఉండే ప్రస్తుత దీపావళి సీజన్‌లో టాటా నానో సిఎన్‌జి వెర్షన్‌ను విడుదల చేయాలని టాటా మోటార్స్ భావిస్తున్నట్లు సమాచారం. పెట్రోల్ వెర్షన్ నానోతో పోల్చుకుంటే సిఎన్‌జి వెర్షన్ నానో ధర కాస్తంత అధికంగా ఉండొచ్చని తెలుస్తోంది.

అయితే, సిఎన్‌జి ఇంధన లభ్యత కొన్ని ప్రధాన నగరాలకు మాత్రమే పరిమితమైన నేపథ్యంలో, టాటా నానో సిఎన్‌జి దేశవ్యాప్తంగా అందుబాటులో ఉండే అవకాశాలు కనిపించడం లేదు. ఏదేమైనప్పటికీ, పెరుగుతున్న పెట్రోల్ ధరలతో విసిగెత్తిపోయే వారికి సిఎన్‌జి వెర్షన్ ఓ చక్కటి ఆప్షన్‌గా నిలువనుంది. మార్కెట్ వర్గాల సమాచారం ప్రకారం, దీపావళి కంటే ముందుగానే ఈ కారు మార్కెట్లోకి వచ్చే అవకాశం ఉంది.

ఇదే కాకుండా, టాటా మోటార్స్ ఓ డీజిల్ వెర్షన్ టాటా నానో కారును కూడా మార్కెట్లో విడుదల చేయనున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం టాటా నానో డీజిల్ అభివృద్ధి దశలో ఉంది. వచ్చే ఏడాది ఆరంభంలో ఇది మార్కెట్లోకి రావచ్చని అంచనా.

English summary
According to sources, Tata Motors is planning to launch the CNG verison of its peoples car Tata Nano during this festiv season. Tata Nano CNG will cost about 15%-20% more than the current petrol version.
Story first published: Tuesday, September 18, 2012, 10:27 [IST]
Please Wait while comments are loading...

Latest Photos